TSPSC AEE Jobs : గుడ్ న్యూస్.. 1540 ఏఈఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్
AEE Jobs 2022 in Telangana: నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
1540 AEE Jobs 2022 Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది టీఎస్పీఎస్సీ(Telangana Public Service Commission). 1540 ఏఈఈ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి నోటిఫికేషన్ సెప్టెంబర్ 15 న విడుదల అవుతుందని ఆ నోటీస్ లో పేర్కొంది.
ఏఈఈ ఉద్యోగాలకు సెప్టెంబర్ 22 నుంచి దరఖాస్తులు మొదలు కానున్నాయి. అక్టోబర్ 14, 2022 వరకు దరఖాస్తులను ఆన్ లైన్ విధానంలో స్వీకరించనున్నారు. మొత్తం 1540 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. నియామక పరీక్ష డిసెంబర్ లేదా జనవరిలో ఉండే అవకాశం ఉంది. పూర్తి నోటిఫికేషన్ ను సెప్టెంబర్ 15వ తేదీన విడుదల చేయనున్నట్లు పేర్కొంది.
ముఖ్య వివరాలు:
AEE Jobs Details: అసిట్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) సివిల్ పీఆర్ అండ్ ఆర్ డీ డిపార్ట్ మెంట్(మిషన్ భగీరథ) లో 302 పోస్టులు
ఏఈఈ సివిల్ విభాగం 211 పోస్టులు, ఏఈఈ సివిల్ ఎంఏ అండ్ యూడీ పీహెచ్ విభాగంలో 147 పోస్టులు
టీడబ్ల్యూ డిపార్ట్ మెంట్ లో 15, ఐ అండ్ సీడీ డిపార్ట్ మెంట్లో మొత్తం 704 ఖాళీలు (సివిల్ 320, మెకానికల్ 84, ఎలక్ట్రికల్ 200, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విభాగంలో 100)
ఏఈఈ మెకానికల్ ఐ అండ్ సీఏడీ డిపార్ట్ మెంట్ లో 03, ఏఈఈ (సివిల్) టీఆర్ అండ్ బీ విభాగంలో 145 ఉద్యోగాలు
ఏఈఈ ఎలక్ట్రికల్ టీఆర్ అండ్ బీ విభాగంలో 13 పోస్టులు
అర్హతలు - సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, అగ్రికల్చర్ విభాగంలో ఇంజనీరింగ్/ మెకానికల్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి. ఆయా పోస్టులను బట్టి అర్హతులు ఉంటాయి.
వయోపరిమితి - అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతం - నెలకు రూ.54220 నుంచి రూ. 1,33,630 మధ్య ఉంటుంది.
దరఖాస్తుల స్వీకరణ - సెప్టెంబర్ 22, 2022
తుది గడువు - 14, అకోబ్టర్, 2022
పరీక్ష - డిసెంబర్ లేదా జనవరిలో నిర్వహించే అవకాశం
NOTE:
ఈ కింది లింక్ పై క్లిక్ చేసి అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలు, అప్డేట్స్ తెలుసుకోవచ్చు.