Telugu News  /  Telangana  /  Tsrtc Key Decision On Interstate Ac Bus Ticket Charges Reduced
ఏసీ బస్సు ఛార్జీలు తగ్గింపు
ఏసీ బస్సు ఛార్జీలు తగ్గింపు (tsrtc)

TSRTC Discount: గుడ్ న్యూస్... అంతర్రాష్ట్ర ఏసీ బస్సుల్లో ఛార్జీలు తగ్గింపు!

03 September 2022, 12:59 ISTMahendra Maheshwaram
03 September 2022, 12:59 IST

tsrtc interstate ac bus charges reduced: అంతర్రాష్ట్ర ఏసీ బస్సు చార్జీల షయంలో టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. 10 శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.ఈ రాయితీ ఛార్జీలు ఈ నెల 30 వ‌ర‌కు వ‌ర్తించ‌నున్నట్లు వెల్లడించింది.

tsrtc ac bus ticket charges reduce: ఈ మధ్య కాలంలో ఛార్జీల మోత మోగిస్తున్న తెలంగాణ ఆర్టీసీ... ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది. అయితే కేవలం ఇంటర్ స్టేట్ ఏపీ బస్సు ఛార్జీల విషయంలో మాత్రమే నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి కారణం లేకపోలేదు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ... నిర్ణయం తీసుకోవటంతో టీఎస్ఆర్టీసీ కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

tsrtc bus charges: రెండు రోజుల క్రితం ఏపీఎస్‌ ఆర్టీసీ కూడా అంతరాష్ట్ర ఏసీ కేటగిరీ బస్సుల్లో టికెట్‌ ధరలను తగ్గించింది. దీంతో ఆంధ్ర ప్రాంతంవైపు వెళ్లే మార్గాల్లో, ప్రయాణికులు టీఎస్‌ ఆర్టీసీ ఏసీ బస్సుల కంటే ఏపీఎస్‌ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ఎక్కేందుకే మొగ్గు చూపుతున్నారు. దీంతో తమ ఏసీ సర్వీసుల్లో కూడా టికెట్‌ చార్జీలను సవరించాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది.

ప్రస్తుతం శుభకార్యాలకు ముహూర్తాలు లేకపోవటంతో బస్సు ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంది. ఏసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ కూడా బాగా పడిపోయింది. ఫలితంగా ప్రయాణికులను ఆకట్టుకునే క్రమంలో టికెట్‌ ధరలను బేసిక్‌పై పది శాతం తగ్గించాలని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్ణయించింది.

tsrtc inter state ac buses routes: శనివారం నుంచి అమల్లోకి వచ్చే కొత్త చార్జీలు ఈ నెలాఖరు వరకు కొనసాగనున్నాయి. హైదరాబాద్‌– విజయవాడ మధ్య నడిచే గరుడప్లస్, రాజధాని సర్వీసుల్లో శుక్ర, ఆదివారాలు మినహా మిగతా రోజుల్లో 10 శాతం తగ్గింపు వర్తిస్తుందని ఆర్టీసీ స్పష్టం చేసింది.

ఇక బెంగుళూరు నుంచి హైదరాబాద్‌ వచ్చే సర్వీసుల్లో శుక్రవారం, హైదరాబాద్‌ నుంచి బెంగుళూరు వైపు వెళ్లే ఏసీ బస్సుల్లో ఆదివారం మినహా మిగతా రోజుల్లో ఈ తగ్గింపు వర్తిస్తుందని తెలిపింది. ఈ మేరకు సర్క్యూలర్ జారీ చేసింది.

ఏపీలోనూ డిస్కౌంట్...

apsrtc discount: ముహుర్తాలు, సెలవులు పెద్దగా లేకపోవడంతో ఆర్టీసీ ఏసీ సర్వీసుల్లో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా తగ్గడంతో APSRTC డిస్కౌంట్ సేల్ ప్రకటించింది. రెండు రోజుల కిందట ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఎస్‌ఆర్టీసి పరిధిలో ప్రయాణించే అన్ని రకాల సర్వీసులకు ఈ తగ్గింపు వర్తించనుంది. ఏసీ సర్వీసుల్లో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో ఆర్టీసి రాయితీలు ప్రకటించింది. ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో కొన్ని ఏసీ సర్వీసులకు 20శాతం,హైదరాబాద్‌ వైపు నడిచే సర్వీసులకు 10శాతం రాయితీ ప్రకటించారు.

apsrtc latest charges: గత నెలలో ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ 68శాతం నమోదైంది. ప్రస్తుతం ఆక్యుపెన్సీ పెంచుకోడానికి డిస్కౌంట్ సేల్ ప్రకటించారు. విజయవాడ నుంచి ప్రయాణించే సర్వీసులకు ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. వీటిలో హైదరాబాద్‌కు నడిచే 33 సర్వీసులతో పాటు 5 విశాఖపట్నం సర్వీసులు, 2 బెంగుళూరు బస్సులు, ఒక చెన్నై సర్వీసుకు రాయితీ ధరలు వర్తిస్తాయి.

interstate ac bus ticket charges: విజయవాడ నుంచి చెన్నై, బెంగళూరు వెళ్లే ఏసీ వెన్నెల సర్వీసుల్లో ఆదివారం మినహా అన్ని రోజుల్లో రాయితీ వర్తిస్తుంది. చెన్నై, బెంగళూరు నుంచి వచ్చే బస్సులకు శుక్రవారం మినహా మిగిలిన రోజుల్లో రాయితీ వర్తిస్తుంది. విశాఖపట్నం డాల్ఫిన్ క్రూయిజర్ సర్వీసుల్లో ప్రస్తుత టిక్కెట ధర రూ.1060గా ఉంటే డిస్కౌంట్‌తో రూ.870కు విక్రయిస్తారు. బెంగళూరు వెన్నెల సర్వీసు టిక్కెట్‌ ధరను రూ.2180 ఉంటే రూ.1770కు విక్రయిస్తారు. బెంగళూరు అమరావతి బస్సు టిక్కెట్ ధర రూ.1890 ఉంటే రూ.1540కు విక్రయిస్తారు. చెన్నై డాల్ఫిన్ క్రూయిజ్ బస్సు టిక్కెట్ ధర రూ.1280 ఉంటే రూ.1050కు విక్రయిస్తారు.

విజయవాడ హైదరాబాద్‌ మధ్య రాకపోకలు సాగించే గరుడ, అమరావతి, వెన్నెల ఏసీ సర్వీసులకు విజయవాడ నుంచి వెళ్లేటపుడు శుక్రవారం రెండు వైపులా ప్రయాణాలకు రాయితీ వర్తించదు. ఆదివారం మాత్రం తిరుగు విజయవాడ నుంచివ వెళ్లే బస్సులకు మాత్రమే రాయితీ వర్తించదు. హైదరాబాద్‌ ప్రయాణానికి ప్రస్తుతం వెన్నెల బస్సుల్లో టిక్కెట్ ధర రూ.940ఉంటే వాటిని రూ.850కు విక్రయిస్తారు. అమరావతి సర్వీసుల్లో టిక్కెట్ రూ.830ఉంటే వాటిని రూ.750కు విక్రయిస్తారు. గరుడ సర్వీసుల్లో రూ.740 టిక్కెట్లను రూ.670కు విక్రయిస్తారు. సెప్టెంబర్ నెలాఖరు వరకు ఈ రాయితీ వర్తించనుంది.