ఏపీలో అంగన్ వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు!-apply online for anganwadi job vacacncies in vizianagaram district ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  ఏపీలో అంగన్ వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు!

ఏపీలో అంగన్ వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు!

HT Telugu Desk HT Telugu
May 21, 2022 04:37 PM IST

విజయనగరం జిల్లాలో అంగన్ వాడీ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను అధికారుల విడుదల చేశారు.

andhra pradesh govt
andhra pradesh govt

ఏపీలోని విజయనగరం జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ విభాగం.. జిల్లాలో ఖాళీగా ఉన్న పలు అంగన్ వాడీల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 86 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది.

పోస్టుల వివరాలు

అంగన్ వాడీలు - 10

అంగన్ వాడీ హెల్పర్స్ - 73,

మినీ అంగన్ వాడీ హెల్పర్స్ 3

విద్యార్హతలు: అభ్యర్థులు టెన్త్ పాసై ఉండాలి. అభ్యర్థి స్థానిక గ్రామానికి చెందిన వివాహిత అయి ఉండాలని స్పష్టంగా తెలిపారు. అభ్యర్థులను రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు చేసుకునే విధానం

ముందుగా విజయనగరం జిల్లా అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.

తర్వాత Anganwadi Helper -> Worker -> Mini Anganwadi Workers Notification అని కనిపించే లింక్‌పై క్లిక్ చేయాలి.

అనంతరం కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో అంగన్ వాడీ అప్లికేషన్ లింక్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి అప్లికేషన్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి

దరఖాస్తు ఫామ్‌లో అడిగిన వివరాలను నింపాలి. అనంతరం క్రింది అడ్రస్‌కు ఆ ఫామ్‌ను పంపాలి.

శిశు అభివృద్ధి పథకపు అధికారిణి,

ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం,

విజయనగరం, ఏపీ

ఈ నెల 23లోగా  చేరేలా దరఖాస్తును పంపించాల్సి ఉంటుంది.

WhatsApp channel