జూనియర్ ఇంజనీర్స్ భర్తీకి ఎస్ఎస్‌సీ నోటిఫికేషన్‌.. దరఖాస్తుకు ఈ ఒక్కరోజే ఛాన్స్!-ssc je 2022 registration process ends today staff selection commission junior engineer exam details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  జూనియర్ ఇంజనీర్స్ భర్తీకి ఎస్ఎస్‌సీ నోటిఫికేషన్‌.. దరఖాస్తుకు ఈ ఒక్కరోజే ఛాన్స్!

జూనియర్ ఇంజనీర్స్ భర్తీకి ఎస్ఎస్‌సీ నోటిఫికేషన్‌.. దరఖాస్తుకు ఈ ఒక్కరోజే ఛాన్స్!

HT Telugu Desk HT Telugu
Sep 02, 2022 02:42 PM IST

SSC JE 2022: జూనియర్ ఇంజనీర్ పోస్టుల కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నిర్వహిస్తున్న దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఈరోజు (సెప్టెంబర్ 2) ssc.nic.in ని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

<p>SSC JE 2022</p>
SSC JE 2022

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) జూనియర్ ఇంజనీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ,క్వాంటిటీ సర్వేయింగ్, కాంట్రాక్ట్స్) రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి ఈరోజే చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 2లోపు ssc.nic.in ని సందర్శించడం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన పేపర్-1 (సీబీటీ)ని నవంబర్‌లో నిర్వహించనున్నారు.

విద్యార్హత : B.Tech డిగ్రీ లేదా మూడేళ్ల డిప్లొమా + సంబంధిత ఇంజినీరింగ్ సబ్జెక్టులో రెండేళ్ల అనుభవం. అర్హత సంబంధించిన పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్‌ను చూడండి.

వయో సడలింపు: గరిష్ట వయో పరిమితి కొన్ని పోస్టులకు 32 సంవత్సరాలు, కొన్నింటికి 30 సంవత్సరాలు. గరిష్ట వయోపరిమితిలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఐదేళ్లు, ఓబీసీ వర్గాలకు మూడేళ్లు సడలింపు ఉంటుంది.

పే స్కేల్ - గ్రూప్ B నాన్ గెజిటెడ్ పోస్ట్‌లు, స్థాయి - 6 (35400- 112400/-)

దరఖాస్తు రుసుము

జనరల్,OBC - రూ 100

SC, ST, దివ్యాంగులు, మహిళలకు ఫీజు నుండి మినహాయింపు ఉంటుంది.

ఎంపిక

అభ్యర్థులు పేపర్-I (CBT), పేపర్-IIలో పనితీరు ఆధారంగా ఎంపిక చేయబడతారు. పేపర్-Iలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను పేపర్-IIకి పిలుస్తారు. సీబీటీలో ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. అందులో నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.

ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి ముఖ్యమైన తేదీలు

- 12.08.2022 నుండి 02.09.2022 వరకు ఆన్‌లైన్ దరఖాస్తును స్వీకరిస్తారు

ఆఫ్‌లైన్ చలాన్‌ను రూపొందించడానికి చివరి తేదీ 02.09.202

ఆన్‌లైన్ ఫీజు చెల్లింపుకు చివరి తేదీ (PM 11.20), సమయం 03.09.2022 (11 PM)

ఫీజు చెల్లింపు కోసం చివరి తేదీ చలాన్ - 03.09.2022

దరఖాస్తు ఫారమ్ దిద్దుబాటు కోసం ఆన్‌లైన్ చెల్లింపు - 04.09.2022 (11 PM)

కంప్యూటర్ ఆధారిత పరీక్ష - నవంబర్ , 2022

పేపర్- II పరీక్ష సమయం తర్వలో తెలియజేస్తారు

Whats_app_banner

సంబంధిత కథనం