NEET PG Result 2023: నీట్ పీజీ ఫలితాల వెల్లడి; ఇవే కౌన్సెలింగ్ డేట్స్..-neet pg result 2023 qualified students should apply for counselling counselling likely from july 15 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Neet Pg Result 2023: Qualified Students Should Apply For Counselling. Counselling Likely From July 15

NEET PG Result 2023: నీట్ పీజీ ఫలితాల వెల్లడి; ఇవే కౌన్సెలింగ్ డేట్స్..

HT Telugu Desk HT Telugu
Mar 15, 2023 06:55 PM IST

NEET PG 2023 Result: నీట్ పీజీ 2023 ఫలితాలు వెల్లడయ్యాయి. విద్యార్థులు తమ రిజల్ట్ ను natboard.edu.in. వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Getty Images/iStockphoto)

నీట్ పీజీ 2023 (NEET PG 2023) ను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (National Board of Examinations in Medical Sciences NBEMS) నిర్వహించింది. పరీక్ష ఫలితాలను మార్చి 15న విడుదల చేసింది. ఫలితాలను అభ్యర్థులు natboard.edu.in. వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. అలాగే, ఈ పరీక్షకు సంబంధించిన స్కోర్ కార్డ్స్ మార్చి 25 నుంచి natboard.edu.in. వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయి. నీట్ పీజీ (NEET PG 2023) పరీక్షను 2023 మార్చి 5వ తేదీన నిర్వహించారు. దేశవ్యాప్తంగా మొత్తం 2.09 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

NEET PG Result 2023: కటాఫ్ ఎంత?

ఈ సంవత్సరం నీట్ పీజీ కట్ ఆఫ్ (NEET PG 2023 cut off) మార్కులను కింది విధంగా నిర్ణయించారు. MD/MS/DNB/Diploma courses జనరల్, ఈ డబ్ల్యూఎస్ (general and EWS) కేటగిరీల అభ్యర్థులకు 291 మార్కులు, పీడబ్ల్యూబీడీ(general-PWBD) విద్యార్థులకు 274 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు (C, ST and OBC) 257 మార్కులుగా నిర్ణయించారు. ఈ పరీక్షలో క్వాలిఫై అయిన విద్యార్థులు నీట్ పీజీ కౌన్సెలింగ్ (NEET PG counselling) కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కౌన్సెలింగ్ కు అప్లై చేసుకోని అభ్యర్థుల అడ్మిషన్ ప్రాసెస్ నిలిచిపోతుంది.

NEET PG Result 2023: కౌన్సెలింగ్ ఎప్పుడు?

నీట్ పీజీ 2023 (NEET PG) లో క్వాలిఫై అయిన విద్యార్థులకు కౌన్సెలింగ్ (NEET PG Counselling) ను జులై 15 నుంచి ప్రారంభించే అవకాశముంది. ఈ విషయాన్ని కేంద్రం ఇప్పటికే సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే, కౌన్సెలింగ్ (NEET PG Counselling) కచ్చితంగా ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయం తెలుసుకోవడం కోసం అభ్యర్థులు mcc.nic.in. వెబ్ సైట్ ను తరచూ చూస్తుండాలి. 50% ఆల్ ఇండియా కోటా సీట్ల కోసం mcc.nic.in. వెబ్ సైట్ ద్వారా మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (Medical Counselling Committee MCC) కి, స్టేట్ కోటా సీట్ల కోసం ఆయా రాష్ట్రాల అడ్మిషన్ అథారిటీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. జులై 15 నాటికి ఇంటర్న్ షిప్ పూర్తి కాని వారు కూడా కౌన్సెలింగ్ (NEET PG Counselling) కు హాజరుకావచ్చు.

IPL_Entry_Point

టాపిక్