TS EAMCET 2023: ఇంగ్లీష్ వర్షన్ ఉండదు.. ఎంసెట్ పరీక్షపై కీలక నిర్ణయం-no english version paper for telangana eamcet 2023 check full details ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Eamcet 2023: ఇంగ్లీష్ వర్షన్ ఉండదు.. ఎంసెట్ పరీక్షపై కీలక నిర్ణయం

TS EAMCET 2023: ఇంగ్లీష్ వర్షన్ ఉండదు.. ఎంసెట్ పరీక్షపై కీలక నిర్ణయం

HT Telugu Desk HT Telugu
Mar 03, 2023 03:22 PM IST

TS EAMCET 2023 Updates: ఎంసెట్ పరీక్షకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది జేఎన్టీయూ హైదరాబాద్. ప్రశ్నాపత్రాన్ని కేవలం ఇంగ్లీష్ భాషలోనే ఇవ్వటాన్ని ఈ ఏడాదికి పక్కనబెట్టింది.

తెలంగాణ ఎంసెట్
తెలంగాణ ఎంసెట్

Telangana EAMCET 2023 Updates: ఎంసెట్ 2023 పరీక్షకు సంబంధించి మరో అప్డేట్ ఇచ్చింది జేన్టీయూ హైదరాబాద్. ప్రశ్నాపత్రాన్ని కేవలం ఇంగ్లీష్ భాషలో ఇవ్వకుండా.... తెలుగు- ఇంగ్లీష్, ఉర్దూ- ఇంగ్లీష్ భాషల్లో ఇచ్చేలా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇంగ్లీష్ లోనే ప్రశ్నా పత్రం ఉండాలనే నిబంధనను సడలించారు. మే 7 నుంచి 11 వరకు జరగనున్న ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాప్రతాలు... ఇంగ్లీష్-తెలుగు, ఇంగ్లీష్-ఉర్దూ మాధ్యమాల్లో మాత్రమే ఉండనున్నాయి.

ఇప్పటి వరకు నిర్వహించిన విధానంతో పరీక్షల నిర్వహణ ఇబ్బందిగా మారినట్లు అధికారులు గుర్తించారు. పైగా ఈ పరీక్షలను సెషన్ల వారీగా నిర్వహిస్తారు. ఇందులో కూడా పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనూ నిర్ణయం తీసుకున్నారు. ఇక గతంలో నిర్ణయించిన పరీక్షల్లో చూస్తే.. పట్టణ విద్యార్థులు కేవలం ఇంగ్లీష్ పేపర్ నే ఎంచుకునేవారు. ఇక గ్రామీణ అభ్యర్థులు ఇంగ్లీష్ తెలుగు, ఇంగ్లీష్ - ఉర్దూ వెర్షన్ ఎంచుకున్నట్లు గుర్తించారు. ఈ తరహా మాదిరిగా పరీక్ష నిర్వహించటం, పరీక్ష పత్రాలను క్రోడీకరించటంతో పాటు పరీక్ష నిర్వహణలోనూ పలు ఇబ్బందులు తలెత్తుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే కేవలం ఇంగ్లీష్ భాషలోనే ఇచ్చే ప్రశ్నాపత్రాన్ని ఈ ఏడాదికి తొలగించినట్లు అధికారులు ప్రకటించారు.

Telangana EAMCET 2023 Updates: ఎంసెట్ 2023 కి సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసింది తెలంగాణ ఉన్నత విద్యా మండలి. ఫిబ్రవరి 28వ తేదీన నోటిఫికేషన్ విడుదలవుతుంది. మార్చి 3 నుంచి ఆన్ లైన్ అప్లికేషన్స్ స్వీకరించనున్నారు. ఆన్లైన్ అప్లికేషన్ స్వీకరణకి చివరి తేదీ ఏప్రిల్ 10గా నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ఏప్రిల్ 12 నుండి 14 వరకు ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. 250 రూపాయల లేట్ ఫీజుతో ఏప్రిల్ 15 వరకు అవకాశం ఉంటుంది. 500 రూపాయల లేట్ ఫీజుతో ఏప్రిల్ 20వ తేదీ, 2500 రూపాయల లేట్ ఫీజు తో 25 ఏప్రిల్ వరకు ఛాన్స్ ఉంటుంది. ఇక 5000 రూపాయల లేట్ ఫీజు తో మే 2వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 30 నుండి ఆన్లైన్ లో ఎంసెట్ హల్ టికెట్స్ జారీ చేస్తారు. మే 7,8, 9 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహిస్తారు.ఈసారి ఇంటర్ వెయిటేజీ లేదని విద్యా మండలి స్పష్టం చేసింది.

ముఖ్య వివరాలు:

ఫిబ్రవరి 28న నోటిఫికేషన్ విడుదల.

మార్చి 3 నుండి ఆన్లైన్ అప్లికేషన్స్ స్వీకరణ.

ఆన్లైన్ అప్లికేషన్ స్వీకరణకి చివరి తేదీ ఏప్రిల్ 10.

ఏప్రిల్ 12 నుండి 14 వరకు ఎడిట్ చేసుకునే అవకాశం.

ఏప్రిల్ 30 నుండి ఆన్లైన్ లో ఎంసెట్ హల్ టికెట్స్ జారీ.

మే 29 నుండి జూన్ 1 వరకు ఎంసెట్ పరీక్షలు

మే 7,8, 9 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలు.

మే 10,11న అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షలు.

ఉదయం 9 నుండి 12 వరకు మొదటి సెషన్ పరీక్ష, మధ్యాహ్నం 3 నుండి 6 వరకు రెండవ సెషన్ పరీక్ష ఉంటుంది.

ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఎంసెట్ ఫీజు 500 రూపాయలు.

ఇతర విద్యార్థులకు ఎంసెట్ ఫీజు 900 రూపాయలు.

ఈసారి ఎంసెట్ ద్వారా నే బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్స్

ఈసారి ఎంసెట్ లో ఇంటర్ వెయిటేజీ లేదు

Whats_app_banner

సంబంధిత కథనం