APPSC Group 1 : ఏపీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా.. కొత్త తేదీలివే
APPSC Group 1 Updates: గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులకు అప్డేట్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మెయిన్స్ పరీక్షలను వాయిదా వేస్తూ ప్రకటన విడుదల చేసింది.
APPSC Group 1 Mains Exams: గ్రూప్ 1 అభ్యర్థులకు కీలక అప్డేట్ ఇచ్చింది ఏపీపీఎస్సీ. మెయిన్స్ పరీక్షలు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 23వ తేదీన పరీక్షలు నిర్వహించేలా ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అయితే ఏప్రిల్ 24 నుంచి మే 18వరకు సివిల్స్ ఇంటర్వ్యూలు ఉన్నాయి. దీంతో పలువురు అభ్యర్థులను పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ వచ్చారు. దీనిపై స్పందించిన కమిషన్.... మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించింది.
మెయిన్స్ పరీక్షలను జూన్ తొలి వారానికి వాయిదా వేసింది. జూన్ 3 నుంచి 10వరకు నిర్వహించనున్నట్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తేదీలు, నిర్వహించే పరీక్ష పేపర్ల వివరాలను కూడా పేర్కొంది.
Appsc Group 1 : ఇప్పటికే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. జనవరి 8న గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహించిన ఏపీపీఎస్సీ... రికార్డు స్థాయిలో 20 రోజుల సమయంలోనే ఫలితాలు వెలువరించింది. 1 : 50 పద్ధతిలో ఫలితాలు వెల్లడించిన ఏపీపీఎస్సీ... 6,455 మంది మెయిన్స్ కు అర్హత సాధించినట్లు తెలిపింది. మెయిన్స్ కు అర్హత సాధించిన వారి వివరాలను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 92 పోస్టుల భర్తీకోసం ఏపీపీఎస్సీ గతేడాది సెప్టెంబర్ 30న గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ గ్రూప్-1 ఉద్యోగాలకు మొత్తం 1,26,449 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది జనవరి 8న... 18 జిల్లాల్లో 297 పరీక్షా కేంద్రాల్లో ఏపీపీఎస్సీ నిర్వహించిన ప్రాథమిక పరీక్షకు 82.38శాతం మంది హాజరయ్యారు. వీలైనంత త్వరగా ఫలితాలు వెల్లడిస్తామని ప్రకటించిన అధికారులు... అందరినీ ఆశ్చర్యపరుస్తూ... రికార్డు స్థాయిలో 20 రోజుల్లోనే ప్రిలిమ్స్ రిజల్ట్స్ వెలువరించారు.
భర్తీ చేసే పోస్టుల వివరాలు:
డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు - 1
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్టులు - 1
డిప్యూటీ కలెక్టర్ పోస్టులు - 10
అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు - 12
డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టులు - 13
డివిజనల్/డిస్ట్రిక్ ఫైర్ ఆఫీసర్ పోస్టులు - 2
అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు - 8
రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ పోస్టులు - 2
మండల పరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టులు - 7
జిల్లా రిజిస్ట్రార్ పోస్టులు - 3
జిల్లా గిరిజన సంక్షేమ ఆఫీసర్ పోస్టులు - 1
జిల్లా బీసీ సంక్షేమ ఆఫీసర్ పోస్టులు - 2
మున్సిపల్ కమీషనర్ గ్రేడ్-II పోస్టులు - 6
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్/లే సెక్రెటరీ అండ్ ట్రెజర్ గ్రేడ్-II పోస్టులు - 18
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్టులు - 4
గ్రూప్–1 పోస్టులు 92 ఉండగా ఇందులో 17 అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ జాబ్స్ ఉన్నాయి.
ఏప్రిల్ 4న గ్రూప్- 4 మెయిన్స్ పరీక్ష
ఏప్రిల్ 4న గ్రూప్ 4 మెయిన్స్ పరీక్షను నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది. ఆయా జిల్లా కేంద్రాల్లో రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తామని తెలిపింది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ విధానంలో పరీక్షను నిర్వహిస్తారు. హాల్ టికెట్లను ఈ నెల 24వ తేదీ నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.
రెవెన్యూ శాఖలో గ్రూప్- 4 ఉద్యోగాలైన జూనియర్ అసిస్టెంట్ నియామకాల కోసం జులై 31న నిర్వహించారు. మెయిన్స్ పరీక్షకు ఎంపికైన వారి వివరాలను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. స్క్రీనింగ్ పరీక్షకు 2,11,341 మంది హాజరుకాగా.. 11,574 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా… మొత్తం 670 గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. కొత్త జిల్లాల ప్రకారం వీటి భర్తీని చేపట్టారు. జూలై లో పరీక్ష నిర్వహించగా... ఆగస్టు 2న కీ ని విడుదల చేశారు.
సంబంధిత కథనం