Appsc Group 1 : గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల చేసిన ఏపీపీఎస్సీ...-andhra pradesh public service commission released group 1 prelims results ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Andhra Pradesh Public Service Commission Released Group 1 Prelims Results

Appsc Group 1 : గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల చేసిన ఏపీపీఎస్సీ...

HT Telugu Desk HT Telugu
Jan 27, 2023 10:29 PM IST

Appsc Group 1 : జనవరి 8న నిర్వహించిన గ్రూప్ - 1 ప్రిలిమ్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. మెయిన్స్ కు ఎంపికైన అభ్యర్థుల వివరాలను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది.

గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

Appsc Group 1 : గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ప్రాథమిక పరీక్ష రిజల్ట్స్ ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. జనవరి 8న గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహించిన ఏపీపీఎస్సీ... రికార్డు స్థాయిలో 20 రోజుల సమయంలోనే ఫలితాలు వెలువరించింది. 1 : 50 పద్ధతిలో ఫలితాలు వెల్లడించిన ఏపీపీఎస్సీ... 6,455 మంది మెయిన్స్ కు అర్హత సాధించినట్లు తెలిపింది. మెయిన్స్ కు అర్హత సాధించిన వారి వివరాలను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. ఏప్రిల్ 23వ తేదీన గ్రూప్ 1 మెయిన్ పరీక్ష జరగనుంది.

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 92 పోస్టుల భర్తీకోసం ఏపీపీఎస్సీ గతేడాది సెప్టెంబర్ 30న గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌-1 ఉద్యోగాలకు మొత్తం 1,26,449 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది జనవరి 8న... 18 జిల్లాల్లో 297 పరీక్షా కేంద్రాల్లో ఏపీపీఎస్సీ నిర్వహించిన ప్రాథమిక పరీక్షకు 82.38శాతం మంది హాజరయ్యారు. వీలైనంత త్వరగా ఫలితాలు వెల్లడిస్తామని ప్రకటించిన అధికారులు... అందరినీ ఆశ్చర్యపరుస్తూ... రికార్డు స్థాయిలో 20 రోజుల్లోనే ప్రిలిమ్స్ రిజల్ట్స్ వెలువరించారు.

భర్తీ చేసే పోస్టుల వివరాలు:

డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు - 1

అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్టులు - 1

డిప్యూటీ కలెక్టర్ పోస్టులు - 10

అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు - 12

డిప్యూటీ సూపరింటెండెంట్‌ పోస్టులు - 13

డివిజనల్/డిస్ట్రిక్‌ ఫైర్‌ ఆఫీసర్‌ పోస్టులు - 2

అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్‌ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు - 8

రీజనల్‌ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్‌ పోస్టులు - 2

మండల పరిషత్ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ పోస్టులు - 7

జిల్లా రిజిస్ట్రార్ పోస్టులు - 3

జిల్లా గిరిజన సంక్షేమ ఆఫీసర్‌ పోస్టులు - 1

జిల్లా బీసీ సంక్షేమ ఆఫీసర్‌ పోస్టులు - 2

మున్సిపల్ కమీషనర్ గ్రేడ్-II పోస్టులు - 6

అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్/లే సెక్రెటరీ అండ్‌ ట్రెజర్‌ గ్రేడ్-II పోస్టులు - 18

అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్టులు - 4

గ్రూప్‌–1 పోస్టులు 92 ఉండగా ఇందులో 17 అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ జాబ్స్ ఉన్నాయి.

AP Endowment Dept Recruitment : దేవదాయ ఈవో ఉద్యోగాలకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇప్పటికే ప్రిలిమ్స్ ఫలితాలను ఇవ్వగా... మెయిన్స్ పరీక్ష తేదీని ఖరారు చేసింది. ఫిబ్రవరి 17వ తేదీన ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రిలిమ్స్ లో పాస్ అయినవారు 1,278 మంది ఉన్నారు. వీరంతా మెయిన్స్ రాయనున్నారు. విశాఖపట్నం, కృష్ణా, చిత్తూరు, కర్నూలు నాలుగు జిల్లాల్లో ఈ పరీక్షలు జరుగుతాయని ఏపీపీఎస్సీ పేర్కొంది. ఉదయం 9.30 నుంచి 12గంటల వరకు పేపర్‌-1 జనరల్‌ స్టడీస్‌, మెంటల్‌ ఎబిలిటీ.. మధ్యాహ్నం 2.30 నుంచి 5గంటల వరకు పేపర్‌-2 హిందూ ఫిలాసఫీ, టెంపుల్‌ సిస్టం అంశాలపై పరీక్షలు నిర్వహించనున్నారు.

IPL_Entry_Point