Nara Lokesh Letter : గ్రూప్-1 మెయిన్స్ గ‌డువు పెంచండి - సీఎం జగన్ కు లోకేశ్ లేఖ-nara lokesh lettet to cm ys jagan over group 1 mains exams time issue ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nara Lokesh Letter : గ్రూప్-1 మెయిన్స్ గ‌డువు పెంచండి - సీఎం జగన్ కు లోకేశ్ లేఖ

Nara Lokesh Letter : గ్రూప్-1 మెయిన్స్ గ‌డువు పెంచండి - సీఎం జగన్ కు లోకేశ్ లేఖ

HT Telugu Desk HT Telugu
Mar 23, 2023 04:41 PM IST

Lokesh Letter to CM Jagan: ముఖ్యమంత్రి జగన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. గ్రూప్-1 మెయిన్స్ గ‌డువు మ‌రో 3 నెల‌లు పెంచాలని కోరారు.

నారా లోకేశ్ లేఖ
నారా లోకేశ్ లేఖ

Nara Lokesh Lettet to CM YS Jagan: ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ గడువును మరో మూడు నెలలు పొడిగించాలన్నారు నారా లోకేశ్. ఈ మేరకు గురువారం ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు. అభ్య‌ర్థులు ప్రిపేర్ అయ్యేందుకు అద‌న‌పు స‌మ‌యం కేటాయించాల‌న్నారు.

ప్ర‌తిప‌క్ష‌ నేత‌గా ఉన్న‌ప్పుడు అధికారంలోకి వ‌స్తే ఏటా జాబ్ క్యాలెండ‌ర్ విడుదల చేస్తామ‌ని సీఎం జగన్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు లోకేశ్. కానీ సీఎం అయ్యాక ఆ మాటే మ‌రిచిపోయార‌ని ప్ర‌శ్నించారు. ఓ వైపు ప్ర‌భుత్వ ఉద్యోగాలు భ‌ర్తీ కాక‌, మ‌రోవైపు ప్ర‌యివేట్ ఉద్యోగాలు లేక యువ‌త నిరాశా నిస్పృహ‌ల‌కు లోన‌వుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నాలుగేళ్ల త‌రువాత విడుద‌ల చేసిన గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసి క్వాలిఫై అయిన అభ్య‌ర్థుల‌కు ప్రిపేర్ అయ్యే స‌మ‌యం త‌క్కువ‌గా ఉండ‌డం వారిని ఆందోళ‌న‌కి గురి చేస్తోంద‌న్నారు. ప్రిపరేషన్ కోసం 90 రోజుల కంటే తక్కువ సమయం ఇవ్వడం సరికాదన్నారు. మెయిన్స్ పరీక్షకు సిద్ధం కావడానికి ఏడు పేపర్లు పూర్తి చేయాల్సి ఉన్నందున టెన్ష‌న్ ప‌డుతున్నార‌ని సీఎంకి రాసిన లేఖ‌లో వివ‌రించారు. మెయిన్స్ ప్రిప‌రేష‌న్‌కి ఇచ్చిన గ‌డువుకి అద‌నంగా మ‌రో 90 రోజుల స‌మ‌యం కేటాయించాల‌ని లేఖలో ప్రస్తావించారు.

ఏప్రిల్ 23వ తేదీన పరీక్ష…

Appsc Group 1 : గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. జనవరి 8న గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహించిన ఏపీపీఎస్సీ... రికార్డు స్థాయిలో 20 రోజుల సమయంలోనే ఫలితాలు వెలువరించింది. 1 : 50 పద్ధతిలో ఫలితాలు వెల్లడించిన ఏపీపీఎస్సీ... 6,455 మంది మెయిన్స్ కు అర్హత సాధించినట్లు తెలిపింది. మెయిన్స్ కు అర్హత సాధించిన వారి వివరాలను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. ఏప్రిల్ 23వ తేదీన గ్రూప్ 1 మెయిన్ పరీక్ష జరగనుంది.

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 92 పోస్టుల భర్తీకోసం ఏపీపీఎస్సీ గతేడాది సెప్టెంబర్ 30న గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌-1 ఉద్యోగాలకు మొత్తం 1,26,449 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది జనవరి 8న... 18 జిల్లాల్లో 297 పరీక్షా కేంద్రాల్లో ఏపీపీఎస్సీ నిర్వహించిన ప్రాథమిక పరీక్షకు 82.38శాతం మంది హాజరయ్యారు. వీలైనంత త్వరగా ఫలితాలు వెల్లడిస్తామని ప్రకటించిన అధికారులు... అందరినీ ఆశ్చర్యపరుస్తూ... రికార్డు స్థాయిలో 20 రోజుల్లోనే ప్రిలిమ్స్ రిజల్ట్స్ వెలువరించారు.

భర్తీ చేసే పోస్టుల వివరాలు:

డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు - 1

అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్టులు - 1

డిప్యూటీ కలెక్టర్ పోస్టులు - 10

అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు - 12

డిప్యూటీ సూపరింటెండెంట్‌ పోస్టులు - 13

డివిజనల్/డిస్ట్రిక్‌ ఫైర్‌ ఆఫీసర్‌ పోస్టులు - 2

అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్‌ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు - 8

రీజనల్‌ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్‌ పోస్టులు - 2

మండల పరిషత్ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ పోస్టులు - 7

జిల్లా రిజిస్ట్రార్ పోస్టులు - 3

జిల్లా గిరిజన సంక్షేమ ఆఫీసర్‌ పోస్టులు - 1

జిల్లా బీసీ సంక్షేమ ఆఫీసర్‌ పోస్టులు - 2

మున్సిపల్ కమీషనర్ గ్రేడ్-II పోస్టులు - 6

అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్/లే సెక్రెటరీ అండ్‌ ట్రెజర్‌ గ్రేడ్-II పోస్టులు - 18

అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్టులు - 4

గ్రూప్‌–1 పోస్టులు 92 ఉండగా ఇందులో 17 అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ జాబ్స్ ఉన్నాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం