తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Munugodu Bypoll: మునుగోడు బైపోల్ పై కేసీఆర్ క్లారిటీ.. యాక్షన్ ప్లాన్ ఇదేనంట!

Munugodu Bypoll: మునుగోడు బైపోల్ పై కేసీఆర్ క్లారిటీ.. యాక్షన్ ప్లాన్ ఇదేనంట!

22 September 2022, 6:37 IST

    • Munugodu Bypoll: ఓవైపు బీజేపీని ఇరుకున పెట్టేలా పావులు కదపుతున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్... మరోవైపు మునుగోడు విషయంలోనూ జాగ్రత్తగా ముందుకెళ్లేలా కార్యాచరణ రూపొందించే పనిలో పడ్డారు. తాజాగా ఆ నియోజకవర్గ నేతలతో భేటీ అయిన కేసీఆర్... పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.
నవంబరులో మునుగోడు ఉప ఎన్నిక?
నవంబరులో మునుగోడు ఉప ఎన్నిక? (twitter)

నవంబరులో మునుగోడు ఉప ఎన్నిక?

KCR On Munugodu Bypoll: మునుగోడు బైపోల్ వేడి పెరుగుతోంది. ఓవైపు ఇతర కార్యక్రమాలపై దృష్టిపెడుతున్న ప్రధాన పార్టీలు... అదేస్థాయిలో మునుగోడుపై కన్నేస్తున్నాయి. ఎవరికి వారు వ్యూహాల్లో మునిగిపోయారు. గెలుపే లక్ష్యంగా లెక్కలు వేసుకుంటున్నారు. అయితే ఇప్పటికే అభ్యర్థులు ఖరారు చేసేసిన బీజేపీ, కాంగ్రెస్... గ్రౌండ్ లో ప్రచారంపై దృష్టిపెట్టారు. ఇదిలా ఉంటే.... టీఆర్ఎస్ టికెట్ ఎవరికి టికెట్ ఇస్తారు? ఎప్పుడు ప్రకటిస్తారు? అనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే మునుగోడు విషయంలో కేసీఆర్ సరికొత్త లెక్కలతో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Hyderabad Pub : యువతులతో అసభ్యకర డ్యాన్సులు, ఆఫ్టర్ 9 పబ్ పై పోలీసుల దాడులు

Ganja Smuggling : చింతపండు బస్తాల మాటున గంజాయి రవాణా- గుట్టు రట్టు చేసిన వరంగల్ పోలీసులు

IRCTC Srilanka Tour Package : హైదరాబాద్ నుంచి శ్రీలంక రామాయణ యాత్ర- 5 రోజుల ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలివే!

Mysore Ooty Tour : మైసూర్ టూర్ ప్లాన్ ఉందా..? బడ్డెట్ ధరలోనే ఊటీతో పాటు ఈ ప్రాంతాలను చూడొచ్చు, ఇదిగో ప్యాకేజీ

తాజాగా రెండురోజుల కిందట మునుగోడు నేతలతో గులాబీ బాస్ కేసీఆర్ భేటీ నిర్వహించారు. ఎన్నికల్లో అనుససరించాల్సిన వ్యూహంపై వారికి దిశానిర్దేశం చేశారు. అక్టోబరులో ఉపఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముందని.. నవంబరులోనే ఎన్నికలు జరగవచ్చని అభిప్రాయపడినట్లు సమాచారం. ఈ క్రమంలో నేతలకు కీలక అంశాలపై దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నిక వచ్చేలా చేసిన బీజేపీ... ప్రస్తుతం ఇప్పుడు భయపడుతోందని కేసీఆర్ పార్టీ నేతలతో ప్రస్తావించారని తెలుస్తోంది. బీజేపీ మూడో స్థానానికే పరిమితమవుతుందని నేతలకు సర్వే లెక్కలు చెప్పినట్లు సమాచారం.

వాటిపై ఫోకస్ పెంచండి...!

ఉప ఎన్నికను ఏ మాత్రం తేలికగా తీసుకోవద్దని కేసీఆర్ సూచించారంట..! ప్రధానంగా సంక్షేమ పథకాలపై ఫోకస్ పెట్టాలని... దళిత బంధు పై ఊరూరా ప్రచారం నిర్వహించాలని చెప్పినట్లు సమాచారం. దళిత బంధు పథకం కోసం మునుగోడులో 500 మందిని ఎంపిక చేయాలని... గిరిజన రిజర్వేషన్ల జీవో, గిరిజన బంధు పథకంపై విస్తృతంగా ప్రచారం చేయాలని స్పష్టం చేశారని తెలుస్తోంది. గిరిజనుల ఇంటింటికీ తిరిగటంతో... నియోజకవర్గానికి చెందిన గిరిజనులను రోజుకో 1000 మందిని హైదరాబాద్‌ తీసుకొచ్చి బంజారా, ఆదివాసీ భవన్‌లను చూపించాలని సూచించారంట...! తద్వారా ఆయా వర్గాలను పార్టీకి దగ్గరే చేసే ప్రయత్నం జరగాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

ఇక దళితబంధు, గిరిజనబంధు పథకాలే కాకుండా... ఇతర వర్గాల ప్రజలతో కూడా ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేయాలని కేసీఆర్ చెప్పారని పార్టీల వర్గాల నుంచి సమాచారం.కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఓ వేడుకలా జరపాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. నోటిఫికేషన్‌ వచ్చాక చండూరులో బహిరంగ సభను నిర్వహించటంతో పాటు... ఆ సభ వేదికగానే అభ్యర్థిని ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం....!

మొత్తంగా మునుగోడు ఉప ఎన్నికపై దృష్టిపెట్టిన కేసీఆర్... గెలుపు వ్యూహలను పక్కగా రచిస్తున్నారంట..! సెమీ ఫైనల్ గా భావిస్తున్న ఈ ఎన్నికలో ఎలాగైనా గెలిచి... కాంగ్రెస్, బీజీపీలకు గట్టి షాక్ ఇవ్వాలని చూస్తున్నారంట..! మరీ కేసీఆర్ అంచనా వేస్తున్నట్లు మునుగోడు బైపోల్ నోటిఫికేషన్ అక్టోబరులో వస్తుందా..? నవంబరులో ఎన్నిక జరుగుతుందా అనేది చూడాలి మరీ...!