KCR Stratagey: గులాబీ బాస్ కేసీఆర్ సరికొత్త అస్త్రాలు... బీజేపీ ఏం చేయబోతుంది?
TRS vs BJP : తన వ్యూహలతో ప్రత్యర్థులను చిత్తు చేసే కేసీఆర్... మరోసారి సరికొత్త అస్త్రాలను సంధించారు. కొత్త సచివాలయానికి అంబేడ్కర్ పేరు, గిరిజన రిజర్వేషన్ల జీవో పై ప్రకటన చేసి... బీజేపీకి సరికొత్త సవాల్ విసిరారు.
TRS Chied KCR New Stratagey On BJP: కొత్త సచివాలయానికి అంబేడ్కర్ పెట్టాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న పార్లమెంట్ కు కూడా అంబేడ్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో గిరిజన రిజర్వేషన్లు పెంచుతూ జీవో ఇస్తున్నాం. ఆమోదం తెలుపుతారా లేక ఉరితాడు.. చేసుకుంటారా..? అంటూ ఓ వార్నింగ్ కూడా ఇచ్చారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ ప్రకటనల చుట్టే తాజా రాజకీయం నడుస్తోంది.
kcr decision on ambedkar name for new secretariat: సెప్టెంబర్ 17 విమోచన దినాన్ని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారంగా జరుపుతూ బీజేపీ ఓ అస్త్రాన్ని సంధించిన సంగతి తెలిసిందే. దీంతో పాలిటిక్స్ రసవత్తరంగా మారిపోయాయి. అయితే వెనువెంటనే జాతీయ సమైక్యత పేరిట తెలంగాణ ప్రభుత్వం కూడా మూడు రోజుల పాటు వేడుకలను నిర్వహించేసింది. ఫలితంగా సెప్టెంబర్ 17వ తేదీ అంశం ఓ వార్ ను తలపించింది. ఈ ఎపిసోడ్ ఇలా ఉంటే... కొద్దిరోజుల కిందట జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఓ కీలక తీర్మానాన్ని కూడా చేసింది కేసీఆర్ సర్కార్. నూతన పార్లమెంట్ భవనానికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలంటూ ఓ ప్రతిపాదన చేశారు. అయితే ఇది తీర్మానం వరకే సరిపెట్టడమే కాదు... మరో మాస్టర్ స్ట్రోక్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు గులాబీ అధిపతి కేసీఆర్. నూతన సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెడుతున్నట్లు ప్రకటించారు. అంతేనే కొత్త పార్లమెంట్ కు కూడా అంబేడ్కర్ పేరునే పెట్టాలంటూ ప్రధాని మోదీకి ఓ లేఖ రాశారు. కేసీఆర్ సర్కార్ నిర్ణయాన్ని దళిత, ప్రజాసంఘాలతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా హర్షించే పరిస్థితి నెలకొంది. మరోవైపు కేంద్రంలోని బీజేపీపై ఒత్తిడి పెంచే ప్రయత్నం జరుగుతోంది. కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంతో కేంద్ర బీజేపీ పెద్దలతో పాటు రాష్ట్ర బీజేపీ నేతలను ఇరుకున పెట్టేశారనే వాదన జోరందుకుంది. దీనికితోడు ఇప్పటికే ఎన్టీఆర్ గార్డెన్ పక్కన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ పనులను వేగంగా పూర్తి చేయించేలా పావులు కదుపుతున్నారు. మిగతా అన్ని పార్టీలు అంబేద్కర్‌కు జై కొట్టేలా కేసీఆర్ సక్సెస్ అయ్యారు.
కేంద్రానికి వార్నింగ్..
kcr on tribal reservations: అంబేడ్కర్ పేరు అంశం ఇదిలా ఉండగానే... కేంద్రంపై మరో అస్త్రాన్ని విడిచారు కేసీఆర్. ఈసారి గిరిజన రిజర్వేషన్ల అంశంపై సంచలన ప్రకటన చేశారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు పెంచేలా అసెంబ్లీలో చేసిన తీర్మానానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపటం లేదని విమర్శించారు. నాలుగేళ్లుగా పెండింగ్ లో ఉంచారని ఆరోపించారు. గిరిజనులపై చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ఆమోదం తెలపటం లేదని సూటిగా ప్రశ్నించారు. ఇలా విమర్శల వరకు పరిమితం కాని కేసీఆర్... కేంద్రం ఇచ్చేది ఏముంది...తామే వారం రోజుల్లో అమలు చేసేలా జోవో ఇస్తామని ప్రకటన చేశారు. జీవోను కేంద్రానికి పంపుతామని... ఆమోదం తెలుపుతారా లేక ఉరితాడు చేసుకుంటారా అంటూ ప్రధాని మోదీకి ఓ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఫలితంగా బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టేశారు. తద్వారా బీజేపీని కర్నార్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్. ఈ నిర్ణయాలపై ప్రతిపక్ష పార్టీలు కూడా ఆచితూచీ స్పందించే పరిస్థితి నెలకొంది. వ్యతిరేకిస్తే గిరిజన, ఆదివాసీ వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. ఓదశలో బీజేపీకి ఇది పెద్ద సవాల్ గానే మారిందని చెప్పొచ్చు.
ఇలా కేంద్రంతో పాటు రాష్ట్రంలో కూడా బీజేపీ పార్టీని ఇరుకున పెట్టేలా కేసీఆర్ వేగంగా పావులు కదిపేస్తున్నారనే చర్చ నడుస్తోంది. అంబేద్కర్ పట్ల కమలం పార్టీ వైఖరిపై నిలదీసేలా టీఆర్ఎస్ శ్రేణులు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రిజర్వేషన్ల తీర్మానానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలనే డిమాండ్ కూడా చేసేందుకు రెడీ అయిపోతున్నారంట..! మొత్తంగా తెలంగాణ కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి జాతీయస్థాయిలో సరికొత్త చర్చకు తెరలేపిన కేసీఆర్.. గిరిజన రిజర్వేషన్లపై కూడా జీవో ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు గిరిజన బంధు కూడా ఇస్తామన్నారు. ఇలా బీజేపీకి ఉచ్చు బిగించే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ నిర్ణయాలకు బీజేపీ ఎలాంటి కౌంటర్ తో ముందుకొస్తుందనేది ఇంట్రెస్టింగ్ మారింది.
సంబంధిత కథనం