Dalita Bandhu : దళిత బంధు పథకానికి దరఖాస్తు ఎలా? అర్హులు ఎవరు?-how to apply for dalith bandhu and eligibility criteria ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Dalita Bandhu : దళిత బంధు పథకానికి దరఖాస్తు ఎలా? అర్హులు ఎవరు?

Dalita Bandhu : దళిత బంధు పథకానికి దరఖాస్తు ఎలా? అర్హులు ఎవరు?

Praveen Kumar Lenkala HT Telugu
Dec 28, 2021 10:41 AM IST

Dalita Bandhu దళిత బంధు పథకం : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మరో సంక్షేమ పథకం ఇది.హుజూరాబాద్ ఉప ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రభుత్వం ఈ దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టింది.

సూపర్ మార్కెట్ (ప్రతీకాత్మక చిత్రం)
సూపర్ మార్కెట్ (ప్రతీకాత్మక చిత్రం) (Unsplash)

Dalita Bandhu scheme: దళిత బంధు పథకం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మరో సంక్షేమ పథకం. గతంలో దళితులకు మూడెకరాల భూమి అని చేసిన ప్రకటన సక్రమంగా అమలు కాకపోవడంతో వెల్లువెత్తిన విమర్శలను గమనించిన ప్రభుత్వం హుజూరాబాద్ ఉప ఎన్నికలకు ముందు ఈ పథకానికి శ్రీకారం చుట్టింది.

దళిత బంధు పథకం ద్వారా దళితులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ పలు వేదికల ద్వారా వెల్లడించారు.

ఈ పథకం ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ. 10 లక్షలు జమ చేసేలా విధివిధానాలు రూపొందించారు.

అయితే వీటిని లబ్ధిదారుల పెట్టబోయే యూనిట్లకు మాత్రమే వెచ్చించేలా షరతులు విధించారు.

దళిత బంధు(Dalita Bandhu)లో లబ్ధిదారుడిగా చేరాలంటే..

Dalitha bandhu telangana eligibility in telugu: దళిత బంధు పథకాన్ని 2014 నాటి కుటుంబ సమగ్ర సర్వేలోని వివరాల ఆధారంగా ప్రభుత్వ యంత్రాంగం తిరిగి సర్వే చేసి లబ్ధిదారులను గుర్తిస్తుంది. గ్రామ స్థాయిలో ఈ సర్వే జరిపాక లబ్ధిదారుల జాబితాను గ్రామ సభలో ప్రదర్శిస్తారు. గ్రామ సభ దీనిని ఆమోదిస్తుంది.

ఒకవేళ సమగ్ర సర్వేలో వివరాలు నమోదు చేసుకోని వారు, కొత్త వారు ఎవరైనా ఉంటే వారికీ పథకాన్ని వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి ఇదివరకే ప్రకటించారు.

అందువల్ల లబ్ధిదారుల జాబితాలో చోటు దక్కనివారు (apply for dalitha bandhu scheme) పంచాయతీ కార్యదర్శిని, గ్రామ సర్పంచిని, వార్డు సభ్యులను సంప్రదించాలి.

దళిత బంధు (Dalita Bandhu) సాయంతో ఏ వ్యాపారం చేయాలి?

దళిత బంధు ద్వారా ఇచ్చే రూ. 10 లక్షలతో వ్యాపారం చేసేందుకు దాదాపు 30కి పైగా వ్యాపార ఆలోచనలను గుర్తించారు. ఆయా యూనిట్ల ఏర్పాటుకు మాత్రమే ఈ నిధులు వినియోగించాల్సి ఉంటుంది.

డెయిరీ ఫామ్, టాక్సీ వాహనాల కొనుగోలు, సూపర్ మార్కెట్ ఏర్పాటు, ప్రొక్లెయిన్లు, లారీలు వంటి భారీ వాహనాల కొనుగోలుకు వీటిని వినియోగించవచ్చు.

వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించిన వాహనాలు, సిమెంట్ ఇటుకలు తయారీ యూనిట్, రెడీ మిక్స్ తదితర యూనిట్లు ఏర్పాటు చేయవచ్చు.

లబ్ధిదారులు బృందంగా ఏర్పడి కూడా వ్యాపారం చేయవచ్చు. 10 మంది వరకు గ్రూప్‌గా ఏర్పడవచ్చు. ఎలక్ట్రానిక్, హార్డ్ వేర్, మెడికల్ డివైజెస్ తయారీ వంటి వ్యాపారాలు కూడా చేయవచ్చు.

దళిత బంధు (Dalitha bandhu) లబ్ధిదారులకు మార్కెటింగ్‌కూ సాయం..

దళిత బంధు ద్వారా చేసే వ్యాపారాలకు ప్రభుత్వం మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తుంది. ఈ పథకం కింద కొనుగోలు చేసే టాక్సీ వాహనాలను ప్రభుత్వ కార్యాలయాల్లో అవసరం ఉంటే లీజు కు తీసుకుంటారు.

అలాగే ప్రభుత్వ ప్రాజెక్టుల్లో ఆయా భారీ వాహనాల అవసరం ఉంటే వాటిని వినియోగించుకునేందుకు ప్రాధాన్యత ఇస్తారు.

దళిత బంధు ద్వారా చేసే వ్యాపారాలపై ప్రభుత్వ యంత్రాంగం పర్యవేక్షణ ఉంటుంది. అలాగే వీటికి సాయంగా ప్రభుత్వ యాప్ కూడా రూపుదిద్దుకుంది. దీని ద్వారా ప్రతి లబ్ధిదారుడికి ఆయా వ్యాపారాల్లో తగిన సూచనలు జారీచేస్తారు.

లబ్ధిదారుడు చనిపోతే దళిత రక్షణ నిధి ద్వారా బీమా సౌకర్యం కల్పిస్తారు. ఆయా యూనిట్లు కొనసాగేలా ప్రభుత్వం తగిన చేయూత ఇస్తుంది.

dalitha bandhu application, ఇతర వివరాల కోసం మీ పంచాయతీ కార్యదర్శిని సంప్రదించండి.

టీ20 వరల్డ్ కప్ 2024

సంబంధిత కథనం

టాపిక్