Telangana News Live December 14, 2024: Balayya Janareddy House Marks : కేబీఆర్ పార్క్ వద్ద రోడ్డు విస్తరణ-బాలయ్య, జానారెడ్డి ఇళ్లకు మార్కింగ్!
14 December 2024, 22:41 IST
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Balayya Janareddy House Marks : జూబ్లీహిల్స్ చెక్ పోస్టు్, కేబీఆర్ పార్క్ వద్ద రోడ్డు విస్తరణలో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, మాజీ మంత్రి జానారెడ్డి ఇంటి వద్ద అధికారులు మార్కింగ్ వేశారు. ఈ విషయంలో వీరిద్దరూ అసంతృప్తితో ఉన్న ప్రచారం జరుగుతోంది.స్థలం ఇచ్చేందుకు బాలయ్య గతంలో ఒప్పుకున్నారని సమాచారం.
CM Revanth Reddy : తెలంగాణలో కులగణన 98 శాతం పూర్తయిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మిగిలిన రెండు శాతం కూడా పూర్తైత తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచే మెగా హెల్త్ ప్రొఫైల్ గా మారుతుందన్నారు.
TG Govt Hostels Food : సాంఘిక సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు ప్రభుత్వం నోరూరించే విషయం చెప్పింది. ఇకపై లంచ్ లో నెలలో రెండు సార్లు మటన్, నాలుగు సార్లు చికెన్ పెట్టనున్నట్లు ప్రకటించింది. మిగిలిన రోజులు గుడ్డు పెట్టనున్నట్లు తెలిపింది.
- Global Madiga Day : అడగకముందే మాదిగ సామాజిక వర్గానికి అందరికంటే ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నాం.. అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. గ్లోబల్ మాదిగ డే-2024 కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి.. కీలక వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ ప్రస్థానంలో మాదిగ సామాజిక వర్గం పాత్ర ఎంతో ఉందని వ్యాఖ్యానించారు.
- Leopard attack : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలను పులులు భయపెడుతున్నాయి. ఇటీవల పులిదాడిలో ఓ మహిళ మృతిచెందింది. తాజాగా చిరుతపులి మరో మహిళపై దాడిచేసి గాయపర్చింది. ఈ ఘటన బజార్‌హత్నూర్ మండలం దేద్రా గ్రామంలో శనివారం ఉదయం జరిగింది. ఈ ఘటనపై మంత్రి సురేఖ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
- Telangana Students : తెలంగాణ విద్యార్థులపై సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. చిల్కూరులోని టీజీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్కు వచ్చిన సీఎం.. విద్యార్థులతో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అన్ని ప్రభుత్వ స్కూళ్లకు ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు.
- వరంగల్ నగరంలో చోటుచేసుకున్న ఓ వృద్ధురాలి మర్డర్ కేసు పోలీసులకు సవాల్ గా మారింది. ఘటన జరిగి ఏడాది కావొస్తున్న నిందితుల జాడ చిక్కలేదు. ఇప్పటి వరకు వంద మందికిపైగా విచారించారు. అయినప్పటికీ ఈ కేసులో ఫలితం శూన్యంగా ఉంది. ఏ చిన్న ఆధారం దొరకకుండా మర్డర్ చేయటంతో కేసును చేధించటం సమస్యగా మారింది.
- Telangana Police : ప్రస్తుతం ఏ సమస్య వచ్చినా మొదట గుర్తొచ్చేది పోలీస్. అవును శాంత్రి భద్రతలు మొదలు.. ఆపదల వరకూ అన్నింటా పోలీసులు సాయం చేస్తున్నారు. కానీ.. కొన్నిచోట్ల పోలీస్ అధికారులు బాధితులను బెదిరిస్తున్నారు. ఇలాంటి కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
- Hyderabad Formula E race Case :ఫార్ములా ఈ రేసు కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ కేసులో అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ను విచారించేందుకు రాజ్ భవన్ నుంచి అనుమతి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కేటీఆర్ విచారణకు లైన్ క్లియర్ అయినట్లు సమాచారం.
- జైలు నుండి విడుదలైన హీరో అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. తాను బాగానే ఉన్నానని… చట్టాన్ని గౌరవిస్తానని చెప్పుకొచ్చారు. మద్దతు తెలిపిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
- TGPSC Group 2 Exam 2024 Updates: గ్రూప్ 2 పరీక్షలకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు సిద్ధం చేసింది. రేపట్నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 4 పేపర్లు రాయాల్సి ఉంటుంది. పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు చర్యలు చేపట్టనున్నారు. అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక సూచనలు చేసింది.
- Hero Allu Arjun Arrest Updates : చంచల్ గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యారు. శుక్రవారమే హైకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ… జైలు నుంచి విడుదల కాలేదు. బెయిల్ పత్రాలు అందే విషయంలో ఆలస్యం కావటమే ఇందుకు కారణమైంది. దీంతో ఇవాళ ఉదయమే ఆయన విడుదలయ్యారు.
- సంక్షేమ వసతిగృహాల పరిస్థితులను చక్కదిద్దేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు నేడు వసతి గృహాలను సందర్శించనున్నారు. అక్కడ ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకోనున్నారు.