తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Tet 2024 : తగ్గని 'టెట్' ఫీజు - దగ్గరపడిన అప్లికేషన్ల గడువు, ఈసారి ఆసక్తి అంతంతే..!

TS TET 2024 : తగ్గని 'టెట్' ఫీజు - దగ్గరపడిన అప్లికేషన్ల గడువు, ఈసారి ఆసక్తి అంతంతే..!

06 April 2024, 7:32 IST

google News
    • Telangana TET 2024 : తెలంగాణ టెట్ పరీక్షకు ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఏప్రిల్ 10వ తేదీతో ఈ గడువు పూర్తి కానుంది. అయితే ఈసారి భారీగా అప్లికేషన్ రుసుం పెంచటంపై అభ్యర్థులు పెదవి విరుస్తున్నారు. తగ్గించాలన్న డిమాండ్ గట్టిగా వినిపించినప్పటికీ… ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. 
తెలంగాణ టెట్ - 2024
తెలంగాణ టెట్ - 2024

తెలంగాణ టెట్ - 2024

Telangana TET 2024 Updates: తెలంగాణలో టెట్ దరఖాస్తుల(TS TET Applications) ప్రక్రియ కొనసాగుతోంది. మెగా డీఎస్సీ(Megs DSC) నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యం… టెట్ నోటిఫికేషన్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకోసం మార్చి 27వ తేదీ నుంచి ఆన్ లైన్ అప్లికేషన్లను స్వీకరిస్తున్నారు. ఈ గడువు ఏప్రిల్ 10వ తేదీతో పూర్తి కానుంది. విద్యాశాఖ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… కేవలం నాలుగు రోజులు మాత్రమే గడువు ఉంది. మే 20వ తేదీ నుంచి తెలంగాణ టెట్(Telangana TET) పరీక్షలు జరగనున్నాయి. https://schooledu.telangana.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.

TS TET Application Fee 2024: తగ్గని టెట్ ఫీజు

ఇక ఈసారి టెట్(TS TET Application Fee) ఫీజు భారీగా పెరిగింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా దరఖాస్తు రుసుమును రూ. 1000గా చేశారు. అభ్యర్థులు రెండు పేపర్లు రాస్తే… రూ. 2వేలు చెల్లించాల్సిందే. అయితే గతేడాది నిర్వహించినప్పుడు… రెండు పేపర్లు రాస్తే రూ. 400 చెల్లిస్తే సరిపోయేది. కానీ ఈసారి మాత్రం…. ఒక్క పేపర్ కే రూ. 1000 చెల్లించాల్సి వస్తోంది. ఫలితంగా ఇది అభ్యర్థులకు ఇబ్బందికరంగా మారింది. ఒక్కసారిగా వెయ్యి రూపాయలకు పెంచటంతో… అభ్యర్థులు పెదవి విరుస్తున్నారు. ఇదే విషయంపై ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు వచ్చాయి. ప్రతిపక్ష పార్టీలతో పాటు నిరుద్యోగ అభ్యర్థుల నుంచి సర్కార్ పై ఒత్తిడి వచ్చింది. వెంటనే టెట్ ఫీజును తగ్గించాలని కోరారు. అయితే సర్కార్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. పైగా దరఖాస్తుల ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఏప్రిల్ 10వ తేదీతో పూర్తి కానుంది.

ఆసక్తి అంతంతే…!

గతంతో పోల్చితే…ఈసారి తెలంగాణ టెట్ కు భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం కనిపించటం లేదు. గతేడాది నిర్వహించిన టెట్ పరీక్షకు…. 2,91,058 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో పేప‌ర్ -1కు 82,560 ద‌ర‌ఖాస్తులు, పేప‌ర్- 2కు 21,501 ద‌ర‌ఖాస్తులు రాగా…. ఈ రెండు పేప‌ర్ల‌కు క‌లిపి 1,86,997 మంది అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. గ‌తేడాది నిర్వ‌హించిన టెట్‌కు మొత్తంగా చూస్తే….. 3.79 ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. అయితే ఈసారి నిర్వహించబోయే టెట్ కు ఈస్థాయిలో దరఖాస్తులు వచ్చే పరిస్థితులు కనిపించటం లేదు. ప్రస్తుతం విడుదలైన నోటిఫికేషన్ కు సంబంధించి… లక్షలోపు దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. ఇంకా నాలుగు రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ టైంలో అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు ఎక్కువగా వచ్చినప్పటికీ… గతేడాది వచ్చిన దరఖాస్తుల సంఖ్య దాటడం కష్టమే అనిపిస్తోంది.

How to Apply TS TET 2024 : టెట్ కు ఇలా దరఖాస్తు చేసుకోండి

  1. టెట్ రాసే అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా https://schooledu.telangana.gov.in  వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. ముందుగా ‘Fee Payment’ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి నిర్ణయించిన ఫీజును చెల్లించాలి.
  3. పేమెంట్ స్టెటస్ అనే కాలమ్ పై నొక్కి దరఖాస్తు రుసుం చెల్లింపు ప్రక్రియ పూర్తి అయిందా..? లేదా అనేది చెక్ చేసుకోవాలి.
  4. ఆ తర్వాత ‘Application Submission’ అనే లింక్ పై క్లిక్ చేయాలి.
  5. మీ వివరాలను నమోదు చేయాలి. ఫొటో, సంతకం తప్పనిసరిగా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
  6. అన్ని వివరాలను ఎంట్రీ చేశాక చివర్లో ఉండే సబ్మిట్ బటన్ పై నొక్కితే అప్లికేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది.
  7. 'Print Application' అనే ఆప్షన్ పై నొక్కితే మీ దరఖాస్తు కాపీనీ డౌన్లోడ్ లేదా ప్రింట్ తీసుకోవచ్చు.
  8. రిజిస్ట్రేషన్ నెంబర్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలి. హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునేందుకు ఈ నెంబర్ ఉపయోగపడుతుంది.

TS TET Dates 2024: టీఎస్ టెట్ ముఖ్య తేదీలు:

  • తెలంగాణ టెట్ దరఖాస్తులకు చివరి తేదీ - ఏప్రిల్ 10, 2024.
  • హాల్ టికెట్లు - మే 15, 2024.
  • పరీక్షలు ప్రారంభం - మే 20, 2024.
  • పరీక్షల ముగింపు - జూన్ 06,2024.
  • టెట్ ఫలితాలు - జూన్ 12, 2024.
  • అధికారిక వెబ్ సైట్ - https://schooledu.telangana.gov.in/ISMS /

తదుపరి వ్యాసం