TS DSC Updates : డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్- దరఖాస్తు గడువు జూన్ 20 వరకు పొడిగింపు-hyderabad ts dsc 2024 exam dates confirmed applications last date extended upto june 20th ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Dsc Updates : డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్- దరఖాస్తు గడువు జూన్ 20 వరకు పొడిగింపు

TS DSC Updates : డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్- దరఖాస్తు గడువు జూన్ 20 వరకు పొడిగింపు

Bandaru Satyaprasad HT Telugu
Apr 02, 2024 07:51 PM IST

TS DSC Updates : తెలంగాణ డీఎస్సీపై విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. జులై 17 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. దీంతో పాటు డీఎస్సీ దరఖాస్తులను జూన్ 20 వరకు పొడిగించింది.

డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్
డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్

TS DSC Updates : తెలంగాణ డీఎస్సీ(TS DSC) అభ్యర్థులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో 11,062 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. డీఎస్సీ దరఖాస్తులకు నేటితో గడువు ముగిసింది. అయితే అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు డీఎస్సీ దరఖాస్తులను(DSC Applications Extended) జూన్ 20 వరకు పొడిగిస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. అభ్యర్థులు రూ.1000 దరఖాస్తు రుసుము చెల్లించి జూన్ 20వ తేదీ రాత్రి 11.50 గంటల వరకు అప్లై చేసుకోవచ్చని తెలిపింది. దీంతో పాటు డీఎస్సీ పరీక్షల(TS DSC Exam Schedule) తేదీలను అధికారులు ఖరారు చేశారు. జులై 17 నుంచి 30 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

11,062 పోస్టులకు నోటిఫికేషన్

గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ (TS DSC Notification)ను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం..... మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీకి కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 2629 స్కూల్‌ అసిస్టెంట్, ఎస్జీటీలు 6,508, భాషా పండితులు 727, పీఈటీలు 182, ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) 796 పోస్టులు ఉన్నాయి. గతంలో దరఖాస్తు చేసుకున్న వారి కోసం ప్రత్యేకంగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేకపోయినప్పటికీ.... ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించింది. పోస్టుల సంఖ్య పెంపుతో అన్ని జిల్లాల్లో భారీగా దరఖాస్తులు వస్తున్నాయని అధికారులు అంటున్నారు.

జిల్లాల వారీగా ఖాళీలు(Districtwise DSC Posts)

డీఎస్సీ నోటిఫికేషన్ లోని హైదరాబాద్ జిల్లాలో ఎస్జీటీ పోస్టులు(SGT Posts) 537 అత్యధికంగా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలో 21 ఎస్జీటీ పోస్టులు మాత్రమే ఉండగా..స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు(School Assistants) అత్యధికంగా ఖ‌మ్మం జిల్లాలో 176 ఉన్నాయి. మేడ్చల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లాలో 26 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 74 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా... ఎస్టీటీలు 209గా ఉన్నాయి. నల్గొండ జిల్లాలో 383 ఎస్జీటీ ఖాళీలు ఉన్నాయి. ఇక హన్మకొండ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 158 ఉండగా...ఎస్జీటీ ఉద్యోగాలు 81 ఖాళీలు ఉన్నాయి. జగిత్యాల జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 99 ఖాళీలు, ఎస్జీటీ ఉద్యోగాలు 161గా ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో 86 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 224 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. యాదాద్రి జిల్లాలో 84 స్కూల్ అసిస్టెంట్ లు, ఎస్జీటీలు 137 పోస్టులు ఉన్నాయి.

తెలంగాణ టెట్ పరీక్షలు(TS TET Exams)

తెలంగాణ టెట్ నోటిఫికేషన్(TET Notification) విడుదలైన సంగతి తెలిసిందే. మార్చి 27 నుంచి దరఖాస్తులు ప్రారంభం కాగా ఏప్రిల్ 10తో దరఖాస్తులు ముగుస్తాయి. మే 20 నుంచి టెట్ పరీక్షలు ప్రారంభం అవుతాయని తెలంగాణ విద్యాశాఖ ఇటీవల ప్రకటించింది. జూన్ 3వ తేదీ వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. https://tstet.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి అభ్యర్థులు టెట్ దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

తెలంగాణ టెట్ ముఖ్య తేదీలు(TS TET Important Dates)

  • తెలంగాణ టెట్ నోటిఫికేషన్ - మార్చి 4, 2024
  • దరఖాస్తులు ప్రారంభం -మార్చి 27, 2024
  • దరఖాస్తులకు చివరి తేదీ - ఏప్రిల్ 10, 2024
  • పరీక్షలు ప్రారంభం - మే 20, 2024
  • పరీక్షల ముగింపు - జూన్ 06, 2024

Whats_app_banner

సంబంధిత కథనం