AP TET DSC Updates : ఏపీ టెట్ ఫలితాలు, డీఎస్సీ నిర్వహణకు ఈసీకి ప్రభుత్వం లేఖ-అనుమతి రాగానే హాల్ టికెట్లు జారీ!-amaravati ap govt wrote letter to ec permission for tet results dsc exams as per schedule ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Tet Dsc Updates : ఏపీ టెట్ ఫలితాలు, డీఎస్సీ నిర్వహణకు ఈసీకి ప్రభుత్వం లేఖ-అనుమతి రాగానే హాల్ టికెట్లు జారీ!

AP TET DSC Updates : ఏపీ టెట్ ఫలితాలు, డీఎస్సీ నిర్వహణకు ఈసీకి ప్రభుత్వం లేఖ-అనుమతి రాగానే హాల్ టికెట్లు జారీ!

Bandaru Satyaprasad HT Telugu
Mar 27, 2024 03:09 PM IST

AP TET DSC Updates : ఏపీ టెట్ ఫలితాల విడుదల, డీఎస్సీ పరీక్షల నిర్వహణకు ఈసీ అనుమతి కోరుతూ ప్రభుత్వం లేఖ రాసింది. ఈసీ అనుమతి రాగానే పరీక్ష కేంద్రాల ఎంపిక , హాల్ టికెట్లు విడుదల చేస్తామని పాఠశాల విద్యాశాఖ తెలిపింది.

ఏపీ టెట్ ఫలితాలు, డీఎస్సీ
ఏపీ టెట్ ఫలితాలు, డీఎస్సీ

AP TET DSC Updates : ఏపీ టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్షల నిర్వహణపై(AP TET DSC Exams) సందిగ్ధం నెలకొంది. డీఎస్సీ పరీక్షలకు(AP DSC Exams) ఈసీ అనుమతి తప్పనిసరి అని ఇటీవల సీఈవో ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఏపీలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 5 వరకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(AP TET 2024) నిర్వహించిన సంగతి తెలిసిందే. మార్చి 20న టెట్ ఫలితాలు(TET Results) విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ అయితే మార్చి 16న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్షల నిర్వహణకు ఈసీ అనుమతి తప్పనిసరి అయింది. డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ ను హైకోర్టు ఆదేశాల మేరకు పాఠశాల విద్యాశాఖ మార్పులు చేసింది. కొత్త షెడ్యూల్ ప్రకారం మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకు పరీక్షలు జరగాల్సి ఉంది.

ఈసీ అనుమతికి ప్రభుత్వం లేఖ

ఈ నేపథ్యంలో టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్షల నిర్వహణపై ఈసీ (EC)అనుమతి కోరుతూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ లేఖ రాశారు. హైకోర్టు ఆదేశాల(High Court orders) మేరకు టెట్ ఫలితాలు ప్రకటన, డీఎస్సీ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి కోరుతూ ఈసీకి లేఖ రాశామన్నారు. ఎన్నికల సంఘం అనుమతి రాగానే టెట్‌ ఫలితాలు విడుదలతో పాటు డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈసీ నుంచి స్పష్టత రాగానే పరీక్ష కేంద్రాల ఎంపిక, హాల్‌ టికెట్లు(DSC Hall tickets) డౌన్‌ లోడ్‌ సదుపాయం అందుబాటులోకి తెస్తామన్నారు. అయితే కొందరు డీఎస్పీ, టెట్(DSC TET Updates) ఫలితాలపై దుష్ప్రచారం చేస్తు్న్నారన్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా టెట్ రిజెల్ట్స్, డీఎస్సీని వాయిదా వేయాలని చూస్తుందని దుష్ప్రచారం సరికాదన్నారు. మరోవైపు ఎస్జీటీ పోస్టులకు(SGT) బీఈడీ అభ్యర్థులను అనర్హులుగా హైకోర్టు ప్రకటించింది. ఎస్జీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న బీఈడీ అభ్యర్థులకు త్వరలోనే ఫీజు తిరిగి చెల్లిస్తామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. ఈసీ నిర్ణయం కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.

ఇవాళ్టి నుంచే తెలంగాణ టెట్ దరఖాస్తులు

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత(TS TET 2024) పరీక్ష అప్లికేషన్లు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఇవాళ ప్రారంభం కానున్న టెట్ దరఖాస్తులు ఏప్రిల్ 10వ తేదీ వరకు కొనసాగనున్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు https://schooledu.telangana.gov.in అధికారిక వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. మే 15వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మే 20వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా.. జూన్ 6వ తేదీ వరకు నిర్వహిస్తారు. జూన్ 12వ తేదీన టీఎస్ టెట్ (TS TET Results 2024)ఫలితాలు విడుదల కానున్నాయి. తెలంగాణ టెట్‌ను 11 జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్నారు. కంప్యూటర్‌ ఆధారిత విధానంలో పరీక్షలు జరుగుతాయి. టెట్‌ పేపర్‌-1కి డీఈడీ అర్హత ఉండాలి. టెట్‌ పేపర్‌-2కి డిగ్రీ బీఈడీ ఉండాలి.

సంబంధిత కథనం