తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Singareni Jobs : సింగరేణి కారుణ్య నియామక ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్- గరిష్ట వయోపరిమితి 40 ఏళ్లకు పెంపు

Singareni Jobs : సింగరేణి కారుణ్య నియామక ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్- గరిష్ట వయోపరిమితి 40 ఏళ్లకు పెంపు

11 June 2024, 15:36 IST

google News
    • Singareni Jobs Age Limit : సింగరేణి కారుణ్య నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారసుల గరిష్ట వయో పరిమితి 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
సింగరేణి కారుణ్య నియామక ఉద్యోగులకు గుడ్ న్యూస్- గరిష్ట వయోపరిమితి 40 ఏళ్లు
సింగరేణి కారుణ్య నియామక ఉద్యోగులకు గుడ్ న్యూస్- గరిష్ట వయోపరిమితి 40 ఏళ్లు

సింగరేణి కారుణ్య నియామక ఉద్యోగులకు గుడ్ న్యూస్- గరిష్ట వయోపరిమితి 40 ఏళ్లు

Singareni Jobs Age Limit : సింగరేణి కారుణ్య నియామక ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారసుల గరిష్ట వయో పరిమితి 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వయో పరిమితి పెంపు ఉత్తర్వులు వెలువడ్డాయి. 2018 మార్చి 9 కటాఫ్ తేదీ నుంచి ఈ ఆదేశాలు అమలు చేస్తున్నట్లు సింగరేణి సీఎండీ వెల్లడించారు. ఈ ఉత్తర్వులతో 300 మంది నిరుద్యోగులు తక్షణమే లబ్ది పొందనున్నారు.

సింగరేణి కారుణ్య ఉద్యోగాల గరిష్ట వయోపరిమితిని 40 ఏళ్లకు పెంచారు. ఈ మేరకు సోమవారం సింగరేణి సీఎండీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇది వరకు గరిష్ట వయోపరిమితి 35 ఏళ్లుగా ఉండగా, కార్మిక సంఘాల వినతి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సింగరేణి కార్మికుడు మెడికల్‌ ఇన్‌వ్యాలిడేషన్‌కు గురైనా, మరణించినా కారుణ్య నియామకాల్లో వారసులకు ఉద్యోగాలు కల్పిస్తారు.

కార్మికుల సంక్షేమంపై దృష్టి

సింగరేణి యాజమాన్యం కార్మికుల సంక్షేమంపై దృష్టి సారించింది. కార్మికుల సంక్షేమంలో భాగంగా వారి కుటుంబాలకు విద్య, వైద్యం, ఇతర వసతుల కల్పనపై దృష్టి పెట్టింది. ప్రమాదంలో గాయపడిన, మృతి చెందిన కార్మికులను, వారి కుటుంబాలకు రూ.కోటి బీమా సదుపాయాన్ని సంస్థ అందిస్తోంది. దీంతో పాటు సింగరేణి కార్మికుల పిల్లలకు అత్యున్నత ప్రమాణాలతో చదువులు అందించేందుకు కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా సింగరేణి కార్మికుల పిల్లల కోసం నిర్వహిస్తున్న పాఠశాలలను ఆధునీకరించడం, డిజిటలీకరణతో పాటు స్టేట్​ సిలబస్​ స్థానంలో సీబీఎస్ఈ​సిలబస్​అమలు చేయాలని నిర్ణయించింది. సింగరేణి ఆధ్వర్యంలో నడుస్తున్న కాలేజీలను , ఇంజినీరింగ్ ​కాలేజీలను ఆధునీకరించాలని నిర్ణయించింది.

మౌలికసదుపాయాలు

కార్మికుల పాత క్వార్టర్స్​ను ఆధునీకరించి, అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సింగరేణి యాజమాన్యం భావిస్తోంది. ఆఫీసర్లకు మాదిరాగే కార్మికుల క్వార్టర్స్ ను​ అప్​గ్రేడ్​ చేయాలని యోచిస్తోంది. సింగరేణిలోని 6 ప్రాంతాల పరిధిలో 42 వేలకు పైగా కార్మికులు ఉన్నారు. వీరంతా చాలా వరకు పాత క్వార్టర్స్​లోనే ఉంటున్నాయి. వర్షాకాలం ఇబ్బందులు తలెత్తుతున్నాయని కార్మికులు తరచూ ఫిర్యాదు చేస్తు్న్నారు. దీంతో పాత క్వార్టర్స్ తొలగించి వాటి స్థానంలో మోడ్రన్​క్వార్టర్స్ నిర్మించాలని యాజమాన్యం నిశ్చయించింది.

సింగరేణి ఆసుపత్రులు ఆధునీకరణ

సింగరేణిలోని ఆసుపత్రులను సూపర్​స్పెషాలిటీ హాస్పిటల్స్​గా తీర్చిదిద్దాలని సింగరేణి యాజామాన్యం యోచిస్తోంది. కొత్తగూడెం, రామగండంతో పాటు పలు ప్రాంతాల్లో ఆసుపత్రులను అప్​గ్రేడ్​ చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం సింగరేణి ఆసుపత్రుల్లో సాధారణ వైద్యమే అందిస్తున్నారు. ఆధునిక వైద్యం కోసం హైదరాబాద్​నిమ్స్, ఇతర ప్రైవేటు ఆసుపత్రులకు పంపేవారు. అయితే ఇకపై కార్మికులకు గుండె, కిడ్నీలు, ఊపిరితిత్తులు, ఆర్థోపెడిక్​చికిత్సలను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు సూపర్​స్పెషాలిటీ ఆసుపత్రులుగా తీర్చిదిద్దాలని యాజమాన్యం భావిస్తోంది.

తదుపరి వ్యాసం