Bandi Sanjay Holi Celebrations : పారిశుద్ధ్య కార్మికులు, చిన్నారులతో కలిసి ఎంపీ బండి సంజయ్ హోలీ సంబరాలు
- Bandi Sanjay Holi Celebrations : రంగుల కేళి రంగోలి.. హోళీ వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వైభవంగా జరిగాయి. ఊరు వాడ చిన్నాపెద్దా తేడా లేకుండా రంగుల్లో మునిగి తేలారు. కరీంనగర్ లో జరిగిన హోళి సంబరాల్లో బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు.

(1 / 6)
రంగుల కేళి రంగోలి.. హోళీ వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వైభవంగా జరిగాయి. ఊరు వాడ చిన్నాపెద్దా తేడా లేకుండా రంగుల్లో మునిగి తేలారు. కరీంనగర్ లో జరిగిన హోళి సంబరాల్లో బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు.
(2 / 6)
ఎంపీ బండి సంజయ్ ఇంటి వద్దకు పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తరలివచ్చి సంజయ్ కి రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. సంజయ్ సతీమణితో కలిసి హోలీ సంబురాల్లో పాల్గొన్నారు.
(3 / 6)
బండి సంజయ్ బైక్ పై నగరంలో గల్లీ గల్లీ తిరుగుతూ కన్పించిన వారందరికీ రంగులు పూసి హోలీ వేడుకలు జరుపుకున్నారు. దారిలో కన్పించిన పారిశుద్ధ్య కార్మికుల వద్దకు వెళ్లి రంగులు పూసి ఆప్యాయంగా పలకరిస్తూ హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
(4 / 6)
ఆటో డ్రైవర్లు, కూలీలు, చిరు వ్యాపారుల వద్దకు వెళ్లి బండి సంజయ్ రంగులు పూశారు. చిన్నారులు, స్కూల్ విద్యార్థులతో కలిసి ఆడిపాడారు.
(5 / 6)
హిందూ ధర్మంలో ప్రతి పండుగకు ఒక పరమార్థం ఉంటుందన్నారు ఎంపీ బండి సంజయ్. రంగు రంగులతో జరుపుకునే హోలీ పండుగ పిల్లలు, పెద్దలు సహా ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో రంగులమయం కావాలని, కొత్త ఆనందాలు తీసుకురావాలని ఆకాంక్షించారు బండి సంజయ్. (HT Correspondent Karimnagar)
ఇతర గ్యాలరీలు