తెలుగు న్యూస్  /  Telangana  /   Telangana Congress Focus On Tribal Areas Goes With Chhattisgarh Model

Telangana Congress: ఆ ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్.. టీ కాంగ్రెస్ సరికొత్త అస్త్రం ఇదే...!

HT Telugu Desk HT Telugu

16 March 2023, 19:22 IST

    • Telangana legislative assembly elections 2023: ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా... తెలంగాణ కాంగ్రెస్ పక్కా వ్యూహాలతో అడుగులు వేసే పనిలో పడింది. ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు పాదయాత్రతో ముందుకు వెళ్తుండగా... తాజాగా మరో ప్రణాళికను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది.
తెలంగాణ కాంగ్రెస్
తెలంగాణ కాంగ్రెస్

తెలంగాణ కాంగ్రెస్

Telangana Congress Focus On Chhattisgarh Model: ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు వ్యూహాలు, ప్రతివ్యూహాలు రచించే పనిలో పడ్డాయి. ఓ వైపు ప్రజల్లోకి వెళ్తూనే... ప్రత్యర్థులను ఢీకొట్టేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నాయి. ఇక గతంలో జరిగిన ఎన్నికల్లో తేలిపోయిన కాంగ్రెస్... వచ్చే ఎన్నికలను మాత్రం చావోరేవోగా భావిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను కోరుతున్నారు. ముఖ్య నేతలు కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ సరికొత్త అంశాన్ని తెరపైకి తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. ఫలితంగా గిరిజన ప్రాంతాలను ఆకర్షించాలని చూస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

TS SSC Results: తెలంగాణలో పదో తరగతి ఫలితాల విడుదల.. 91శాతం ఉత్తీర్ణత, గత ఏడాది కంటే మెరుగైన ఫలితాలు

TS 10th Results 2024: తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు.. డైరెక్ట్ లింక్ ఇదే

Light Beers : తెలంగాణలో లైట్ బీర్లు దొరకడంలేదు, ఎక్సైజ్ అధికారులకు యువకుడు ఫిర్యాదు

CM Revanth Reddy On Notices : బీజేపీని ప్రశ్నిస్తే నోటీసులే, దిల్లీ పోలీసుల సమన్లపై సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్

ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు వ్యూహాలు, ప్రతివ్యూహాలు రచించే పనిలో పడ్డాయి. ఓ వైపు ప్రజల్లోకి వెళ్తూనే... ప్రత్యర్థులను ఢీకొట్టేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నాయి. ఇక గతంలో జరిగిన ఎన్నికల్లో తేలిపోయిన కాంగ్రెస్... వచ్చే ఎన్నికలను మాత్రం చావోరేవోగా భావిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను కోరుతున్నారు. ముఖ్య నేతలు కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ సరికొత్త అంశాన్ని తెరపైకి తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. ఫలితంగా గిరిజన ప్రాంతాలను ఆకర్షించాలని చూస్తోంది.

తెరపైకి కొత్త మోడల్..!

హాత్​ సే హాత్​ జోడో యాత్ర అంటూ పాదయాత్రల ద్వారా ప్రజల్లోకి వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ... ఆదివాసీ, గిరిజన ఓట్లపై ఫోకస్ పెట్టే పనిలో పడింది. ఇందుకోసం ఛత్తీస్​ఘడ్ మోడల్ ను తెరపైకి తీసుకురావాలని చూస్తోంది. వ్యవసాయం, ఉద్యోగ భధ్రత, విద్య, వైద్యం, మహిళలు, ఉపాధి విషయంలో ఛత్తీస్​ఘడ్ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తోంది. ఫలితంగా అధికారంలోకి వచ్చాక... తెలంగాణలో కూడా ఛత్తీస్​ఘడ్ మోడల్ ను తీసుకువస్తామని చెప్పేందుకు సిద్ధమవుతోంది. తాజాగా కరీంనగర్ వేదికగా జరిగిన బహిరంగ సభకు కూడా ఛత్తీస్​ఘడ్ ముఖ్యమంత్రి రప్పించిన తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం. ఈ సభ వేదికగా కూడా ఛత్తీస్​ఘడ్ మోడల్ ను ప్రధానంగా ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో... తెలంగాణలో కూడా ఛత్తీస్​ఘడ్ మోడల్ కు విస్తృత ప్రచారం కల్పించాలని చూస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాల మేరకు తెలుస్తోంది.

ఛత్తీస్​ఘడ్ మోడల్ ఏంటి..?

ప్రధానంగా రైతు సంక్షేమం కోసం రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ్ యోజన పథకాన్ని అక్కడి ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం 14 రకాల పంటలపై రూ. 9,000 ఇన్‌పుట్ సబ్సిడీ అందిస్తోంది. దీంతోపాటు 2020-2021 నుండి వరి కాకుండా వేరే పంటను వేసిన రైతులకు, ప్రత్యేకంగా 3 సంవత్సరాల పాటు ఎకరానికి రూ. 10,000 రూపాయిలు అందిస్తుంది. తద్వారా రైతు పంట నష్టపోకుండా ప్రభుత్వం వారికి భరోసాను కల్పించటం ద్వారా వ్యవసాయ రంగంలో పెనుమార్పులకు కారణమైంది. అదే విదంగా రాజీవ్ గాంధీ భూమిహీన్ కృషి మజ్దూర్ యోజన పథకంతో వ్యవసాయ భూమి లేని గ్రామీణ కుటుంబాలకు 2021-22 నుండి ఏడాదికి 6000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం ప్రారంభించింది. ఇక స్వామి ఆత్మానంద ఇంగ్లీష్ మీడియం పాఠశాలల పేరుతో, కంప్యూటర్ ల్యాబ్‌లు, లైబ్రరీ, ప్లే ఫీల్డ్ మొదలైన సౌకర్యాలు కలిగిన ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు స్థాపించటం ద్వారా రాష్ట్రంలో మెరుగైన నాణ్యమైన విద్యకు అత్యంత ప్రధాన్యత కల్పించటం జరుగుతుంది. ఇక రూరల్ ఇండస్ట్రియల్ పార్కులు (RIPA), గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక పార్కుల ఏర్పాటు చేయడం ద్వారా గ్రామాలను స్వయం ఆధారిత ఉపాధి, ఉద్యోగ కేంద్రాలుగా మార్చి జీవనోపాధికి ప్రత్యేక మార్గాలను అమలు పరుస్తోంది.

యువతకు నెలకు రూ.2500 నిరుద్యోగ భృతిని అందిస్తోంది ఛత్తీస్​ఘడ్ సర్కార్. ఇక వరిపంటకు కేంద్ర ప్రభుత్వం అందించే మద్దతు ధరకు, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మద్దతు ధర కల్పిస్తోంది. ప్రస్తుతం వరి ధాన్యం క్వింటాల్‌కు 2800 రూపాయల మద్దతు ధరను చత్తీస్ ఘడ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తోంది. అదేవిదంగా అక్కడి ప్రభుత్వం తునిక ఆకు ప్రతి బ్యాగ్ 4000 రూపాయిలకు కొనుగోలు చేస్తూ గిరిజనుల ఆదాయాన్ని పెంచుతోంది. ఇక గిరిజనుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని అడవుల్లో దొరికే వస్తువులకు కనీస మద్దతు ధరను నిర్ణయించి గిరిజనులకు అబివృద్ధి కోసం ఇందిరా వాన్ మిటాన్స్ పథకం ఏర్పాటు చేసింది. ప్రజల వద్దకే, వారి ఇంటికే ఆరోగ్య సేవల అందించటం కోసం మారుమూల ప్రాంతాలకు, పట్టణ మురికివాడలకు చేరుకోవడానికి హాట్ బజార్ క్లినిక్‌లు, డై-దీదీ క్లినిక్‌లను హాట్‌స్పాట్ ఆధారిత డోర్‌స్టెప్ డెలివరీ పథకాన్ని కొనసాగిస్తుండటం చత్తీస్ ఘడ్ ప్రభుత్వానికి ప్రశంసలు తెచ్చిపెడుతుంది. ఇందులో భాగంగానే హమర్ క్లినిక్ యోజనలో భాగంగా గ్రామీణ క్లినిక్ లను కూడా ప్రభుత్వం ప్రజల చెంతకు చేర్చింది.

ఈ తరహాలోనే తెలంగాణలోని గిరిజన ప్రాంతాల ప్రజలకు లాభం చేకూర్చేలా కార్యాచరణను ప్రకటించాలని టీ కాంగ్రెస్ భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తమకు అధికారం ఇస్తే... ఛత్తీస్​ఘడ్ మోడల్ విధానాన్ని తెలంగాణలో కూడా అమలు చేస్తామని చెప్పేలా కసరత్తు చేస్తున్నారు. వీటికి తోడు ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్య శ్రీ, ఉద్యోగాల భర్తీ వంటి పలు కీలకమైన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.