తెలుగు న్యూస్ / ఫోటో /
Karimnagar Congress Sabha: కరీంనగర్ గడ్డపై కదం తొక్కిన కాంగ్రెస్
- Congress Sabha at Karimnagar News: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాత్ సే హత్ జోడో యాత్ర మొదటి విడత ముగింపు సందర్భంగా కరీంనగర్ లో నిర్వహించిన సభ విజయవంతమైంది. ఈ సభకు ముఖ్య అతిథులుగా ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బగేల్, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ , రాష్ట్ర ఇన్‌చార్జి ఠాక్రే హాజరయ్యారు. సభకు కాంగ్రెస్ నేతలు భారీగా హాజరయ్యారు.

(1 / 4)
రాష్ట్రానికి కావాల్సింది గుజరాత్. తెలంగాణ మాడల్ కాదని ఛత్తీస్‌గడ్ మాడల్ అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ కోసం ఏం చేయని బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలని ఓడించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.
(2 / 4)
కరీంనగర్ స్థలం చాలా చరిత్రాత్మక స్థలమన్నారు భట్టి విక్రమార్క. దశాబ్దాల తెలంగాణ ప్రజల కోరికను తీర్చేందుకు సోనియాగాంధీ ఇక్కడే మాట ఇచ్చారని గుర్తు చేశారు. కరీంనగర్ అంటేనే పోరాటాల గడ్డ అని వ్యాఖ్యానించారు. లక్ష కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేకపోయారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులలో పారే నీటితోనే తెలంగాణలో పంటలు పండుతున్నాయన్నారు.
(3 / 4)
గుజరాత్ మోడల్ అంటే కేవలం గుజరాత్ మాత్రమే అని.. కాంగ్రెస్ మోడల్ అంటే పేదల అభివృద్ధి అంటూ ప్రసంగించారు ఛత్తీస్ఘడ్ సీఎం భూపేశ్ భగేల్.
ఇతర గ్యాలరీలు