తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Formation Day Celebrations 2024 : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు - జూన్ 2న సర్కార్ చేసే కార్యక్రమాలు ఇవే

TG Formation Day Celebrations 2024 : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు - జూన్ 2న సర్కార్ చేసే కార్యక్రమాలు ఇవే

31 May 2024, 12:40 IST

google News
    • Telangana Formation Day Celebrations 2024 : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. జూన్ 2న నిర్వహించే కార్యక్రమాల వివరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు - 2024
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు - 2024 (image source https://www.telangana.gov.in/a)

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు - 2024

Telangana Formation Day Celebrations 2024 : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా వేడుకలకు ఏర్పాట్లు చేశారు.

జూన్ 2న కార్యక్రమాలివే :

  • జూన్ 2న ఉదయం 9.30కు గన్ పార్క్ లో అమర వీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారికి నివాళులు అర్పిస్తారు.
  • ఉదయం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. పోలీసు బలగాల పరేడ్, మార్చ్ ఫాస్ట్, వందన స్వీకార కార్యక్రమం ఉంటుంది.
  • తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం సోనియాగాంధీ ప్రసంగం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు.
  • పోలీసు సిబ్బందికి, ఉత్తమ కాంటింజెంట్లకు అవార్డులను ప్రదానం చేస్తారు. అవార్డు స్వీకర్తలతో ఫోటో సెషన్ అనంతరం కార్యక్రమం ముగుస్తుంది.
  • జూన్ 2 సాయంత్రం ట్యాంక్ బండ్పై తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ప్రారంభమవుతాయి. తెలంగాణకు సంబంధించిన హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేస్తున్నారు.
  • సాయంత్రం 6.30కు ముఖ్యమంత్రి ట్యాంక్ బండ్ కు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శిస్తారు.
  • తెలంగాణ కళారూపాల అద్భుత ప్రదర్శనకు అద్దం పట్టే కార్నివాల్ నిర్వహిస్తారు. దాదాపు 700 మంది కళాకారులు ఇందులో పాల్గొంటారు.
  • అనంతరం ట్యాంక్ బండ్ ఏర్పాటు చేసిన వేదికపై 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయి.
  • స్టేజ్​ షో అనంతరం జాతీయ జెండాలతో ట్యాంక్​ బండ్​పై ఇటు చివర నుంచి అటు చివరి వారకు భారీ ఫ్లాగ్​ వాక్​ నిర్వహిస్తారు. దాదాపు 5 వేల మంది ఇందులో పాల్గొంటారు. ఈ ఫ్లాగ్​ వాక్​ జరుగుతున్నంత సేపు జయ జయహే తెలంగాణ ఫుల్​ వర్షన్ (13.30 నిమిషాల) గీతాన్ని విడుదల చేస్తారు. ఇదే వేదికపై తెలంగాణ కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణికి సన్మానం చేస్తారు.
  • రాత్రి 8.50 గంటలకు పది నిమిషాల పాటు హుస్సేన్ సాగరం మీదుగా ఆకాశంలో రంగులు విరజిమ్మేలా బాణాసంచా (ఫైర్ వర్క్స్) కార్యక్రమంతో వేడుకలను ముగిస్తారు.

మాజీ సీఎం కేసీఆర్ కు ఆహ్వానం….

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సీఎం రేవంత్‌ రెడ్డి వ్యక్తిగతంగా ఆహ్వానం పంపారు. జూన్‌ 2న పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించబోయే తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాల అధికారిక కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు. తన ప్రొటోకాల్‌ సలహాదారు హర్కర వేణుగోపాల్‌కు లేఖను అందజేసే బాధ్యతలు అప్పగించారు.

’జయ జయహే తెలంగాణ’ గేయాన్ని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఈ ఏడాది జూన్ 2వ తేదీ నాటికి పదేండ్లు పూర్తవుతున్న సందర్భంగా దశాబ్ధి ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అదే వేడుకల సందర్భంగా జయ జయహే తెలంగాణ గీతాన్ని జాతికి అంకితం చేస్తామని చెప్పారు.

తదుపరి వ్యాసం