తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ganesh Laddu : అన్ని రికార్డులు బ్రేక్.. ఇక్కడ రూ.60 లక్షలు పలికిన గణేశ్ లడ్డూ

Ganesh Laddu : అన్ని రికార్డులు బ్రేక్.. ఇక్కడ రూ.60 లక్షలు పలికిన గణేశ్ లడ్డూ

HT Telugu Desk HT Telugu

11 September 2022, 21:40 IST

google News
    • Ganesh Laddu Auction :  హైదరాబాద్ పరిధిలో గణేశ్ లడ్డూ వేలంపాటలు రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. తాజాగా ఓ ప్రాంతంలో రికార్డు స్థాయిలో రూ.60.08 లక్షలకు లడ్డూను కొనుగోలు జరిగింది.
ప్రతీకాత్మ చిత్రం
ప్రతీకాత్మ చిత్రం

ప్రతీకాత్మ చిత్రం

భాగ్యనగరంలో గణేశ్ లడ్డూల ధరలు ఒకదానినిమించి మరొకటి వేలంలో కొంటున్నారు. ఈ ధర చూసి.. అందరూ షాక్ అవుతున్నారు. బాలాపూర్ లడ్డూ ఎంత ఫేమస్ అని అందరికి తెలిసిందే. ఈ ధరను అల్వాల్ లడ్డూ బ్రేక్ చేసింది. అయితే తాజాగా బండ్లగూడ లడ్డూ అన్ని రికార్డులను దాటింది. వేలం పాటలో రూ. 60..08 లక్షలు పలికింది.

సికింద్రాబాద్ అల్వాల్ లో కనాజిగూడ మరకత గణేష్ లడ్డూ వేలం పాటను శనివారం జరిగిన విషయం తెలిసిందే. వేలం పాటలో రూ. 45,99,999 లక్షలకు లడ్డూను వెంకట్ రావు దక్కించుకున్నారు. ఈ ఏడాది బాలాపూర్ లడ్డూను వంగేటి లక్ష్మారెడ్డి రూ. 24.60 లక్షలకు లడ్డూను వేలం పాటలో పాడారు. కిందటి ఏడాది కంటే ఐదు లక్షలు అదనం. అయితే బండ్లగూడ కీర్తి రిచ్ మండ్ విల్లాస్ లో గణేష్ మండపం ఏర్పాటు చేశారు. ఇక్కడ వినాయక నిమజ్జనం సందర్భంగా లడ్డూ వేలం వేస్తే.. రికార్డు బ్రేక్ చేస్తూ.. రూ. 60..08 లక్షల ధర పలికింది.

ఆర్‌వి దియా ఛారిటబుల్ ట్రస్ట్ చేపట్టిన వార్షిక ఫండ్ రైజర్ యాక్టివిటీలో భాగంగా ఈ వేలం జరిగింది. రెసిడెన్షియల్ కమ్యూనిటీ నేతృత్వంలోని ఛారిటీ గ్రూప్ వారి రోజువారీ కార్యకలాపాలలో స్వచ్ఛంద సంస్థలకు మద్దతునిచ్చే లక్ష్యంతో అనేక క్రౌడ్ ఫండింగ్ కార్యకలాపాలలో పాలుపంచుకుంది. ట్రస్ట్ ప్రారంభ వాలంటీర్లలో రిచ్‌మండ్ విల్లాస్ కమ్యూనిటీకి చెందిన సీనియర్ సూపర్-స్పెషలిస్ట్ వైద్యులు, వ్యాపారవేత్తలు, సామాజిక కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.

ఇక భాగ్యనగరంలో బాలాపూర్ లడ్డూ వేలం పాట ఎప్పటి నుంచో ఫేమస్. ఇక్కడ 1994లో లడ్డూ వేలం పాట మెుదలైంది. అప్పుడు రూ. 450లకు ప్రారంభమైన వేలం పాట ప్రస్తుతం లక్షలకు చేరుకుంది. తాజాగా అల్వాల్, బండ్లగూడల్లో వేలం పాటలు రికార్డులు బద్దలు కొట్టాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గణేష్ లడ్డూల కోసం వేలం పాట భారీగా పాడుతున్నారు.

తదుపరి వ్యాసం