Ganesh Immersion 2022 : వినాయక నిమజ్జనం.. సెలవు, ట్రాఫిక్ ఆంక్షలు
Hyderabad Ganesh Immersion Holiday : వినాయక చవితి వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. హైదరాబాద్ లో గణేశ్ చతుర్థి అంటే దేశవ్యాప్తంగా ఫేమస్. చాలామంది చూపు ఇటువైపు ఉంటుంది. ఈ మేరకు గణేశ్ ఉత్సవ సమితి కూడా ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు గణేశ్ నిమజ్జనం సందర్భంగా శుక్రవారం నాడు సెలవు ప్రకటించారు.
వినాయక చవితి వేడుకలు ముగింపు దశకు వస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఖైరతాబాద్ గణేశ్ దేశవ్యాప్తంగా ప్రాచూర్యం ఉండటంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. దీంతో 9వ తేదీన అంటే శుక్రవారం రోజున.. సెలవు దినంగా ప్రకటించింది ప్రభుత్వం. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాలోని ప్రాంతాల్లో సెలవు అమల్లో ఉంటుందని తెలిపింది. శుక్రవారం భారీ ఎత్తున వినాయక నిమజ్జన కార్యక్రమం జరగనుంది. దీంతో ఆ రోజున ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు జీవో జారీ చేసింది ప్రభుత్వం.
హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే ఇతర జిల్లాల ప్రాంతాలకు సైతం ప్రభుత్వం సెలవు ప్రకటించింది ప్రభుత్వం. ఆ రోజున ట్రాఫిక్ ఆంక్షలు సైతం ఉన్నాయి. స్కూళ్లు, ఆఫీసులకు వెళ్లాలంటే.. విద్యార్ధులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ కారణంగా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఖైరతాబాద్ గణేశుడిని చూసేందుకు వేల సంఖ్యలో భక్తులు వస్తారు.
హుస్సేన్ సాగర్ లో గణనాథుడి నిమజ్జనంపై కొన్ని రోజులు వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనానికి అనుమతి లేదని ప్రభుత్వం చెప్పింది. దీంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. మంగళవారం గణేశ్ ఉత్సవ సమితి సభ్యులు.. ట్యాంక్ బండ్ పై ర్యాలీ చేసేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అరేస్టు చేశారు. విమర్శలు ఎక్కువ కావడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ట్యాంక్‌బండ్‌పై క్రేన్లు ఏర్పాటు చేస్తోంది. ఈ నెల 9వ తేదీన జరిగే వినాయక నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు చేస్తోంది.
మరోవైపు చవితి ఉత్సవాలతో కొన్ని రోజులుగా పోలీసులు తీరిక లేకుండా పని చేస్తున్నారు. ఇక నిమజ్జనం కావడంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు రూట్ మ్యాప్ తయారు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ట్యాంక్ బండ్ మీద గణేశ్ నిమజ్జనానికి వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తు్న్నారు.