Amit Shah's Hyderabad visit: ఈ నెల 16న హైదరాబాద్ కు అమిత్ షా - షెడ్యూల్ ఇదే-home minister amith sha to visit hyderabad on 16 september 2022 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Amit Shah's Hyderabad Visit: ఈ నెల 16న హైదరాబాద్ కు అమిత్ షా - షెడ్యూల్ ఇదే

Amit Shah's Hyderabad visit: ఈ నెల 16న హైదరాబాద్ కు అమిత్ షా - షెడ్యూల్ ఇదే

HT Telugu Desk HT Telugu

amith sha to visit hyderabad: బీజేపీ అగ్రనేత అమిత్ షా మరోసారి తెలంగాణకు రానున్నారు. ఈనెల 16వ తేదీన హైదరాబాద్ లో పర్యటించనున్నారు.

హైదరాబాద్ కు అమిత్ షా, (twitter)

home minister amith sha hyderabad tour:మరోసారి బీజేపీ అగ్రనేత హైదరాబాద్ కు రాబోతున్నారు. ఈనెల 16న నగరానికి రానున్న ఆయన... సెప్టెంబర్‌ 17న పరేడ్‌ మైదానంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగబోయే హైదరాబాద్‌ విమోచన దినోత్సవంలో పాల్గొంటారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది.

30 రోజుల్లో రెండోసారి...

amith sha tour in telangana: సెప్టెంబరు 17 సమీపించే కొద్దీ.. తెలగాణ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ సీఎంలను కూడా ఆహ్వానించింది. ఇక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు. మరోవైపు తెలంగాణ సర్కార్ కూడా తెలంగాణ జాతీయ సమైక్యతా పేరుతో మూడు రోజుల పాటు ఉత్సవాలను జరపనుంది. రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు కూడా చేపట్టనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయం సెప్టెంబర్ 17 చుట్టు తిరగటం ఖాయంగా కనిపిస్తోంది. సెప్టెంబరు 16న వస్తున్న అమిత్ షా... రెండు రోజుల పాటు ఇక్కడే ఉంటారు. ఈ నెల 17న పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే తెలంగాణ విమోచన వేడుకల్లో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత బీజేపీ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర పదాధికారులు, ముఖ్యనేతలతో సమావేశమవుతారు . నెల రోజుల వ్యవధిలో తెలంగాణలో అమిత్ షా పర్యటించడం ఇది రెండోసారి. గత నెల 21న మునుగోడులో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇప్పుడు తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వస్తున్నారు.

hyderabad liberation day :హైదరాబాద్ రాష్ట్ర విమోచనానికి 74 ఏళ్లు పూర్తై.. 75 వసంతంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో.. ఏడాది పొడవునా ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ ఏర్పాట్లును కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి దగ్గర ఉండి చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఎంఐఎం పార్టీ కూడా తిరంగ యాత్రను ఖరారు చేసింది. పాతబస్తీలో ఈ యాత్రను చేపడుతున్నట్లు అసదుద్దీన్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టేందుకు సిద్ధమైంది. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పొటాపోటీ ఉత్సవాలను జరిపేందుకు సిద్ధమైన నేపథ్యంలో... రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. ఇదే సమయంలో అమిత్ షా ఏం మాట్లాడబోతున్నారు..? కర్ణాటక, మహారాష్ట్ర సీఎంలు కేసీఆర్ ను ఏమైనా టార్గెట్ చేస్తారా వంటి ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

సంబంధిత కథనం