September 17 : అధికారికంగా విమోచన దినోతవ్సం….-unio government decided to conduct official celebrations on september 17
Telugu News  /  Telangana  /  Unio Government Decided To Conduct Official Celebrations On September 17
హైదరాబాద్‌ విలీనం సందర్భంగా పటేల్‌తో నిజాం సంస్థానాధీశుడు
హైదరాబాద్‌ విలీనం సందర్భంగా పటేల్‌తో నిజాం సంస్థానాధీశుడు

September 17 : అధికారికంగా విమోచన దినోతవ్సం….

03 September 2022, 6:32 ISTHT Telugu Desk
03 September 2022, 6:32 IST

హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్ణయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణ‍యించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎనిమిదేళ్ల తర్వాత కేంద్రం విమోచన దినోత్సవం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రి కిషన్‌ రెడ్డి విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు వివిధ శాఖలతో చర్చలు నిర్వహిస్తున్నారు.

September 17 తెలంగాణ విమోచ‌న దినాన్ని ఈ ఏడాది కేంద్ర ప్ర‌భుత్వం అధికారికంగా నిర్వ‌హించ‌నుంది. ఈ కార్య‌క్ర‌మ నిర్వ‌హ‌ణ‌కు సంబంధించిన ఏర్పాట్లపై కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి కేంద్ర ప్ర‌భుత్వంలోని ప‌లు శాఖ‌ల‌కు చెందిన అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు.

ఏటా September 17 సెప్టెంబ‌ర్ 17న తెలంగాణ విమోచ‌న దినాన్ని పాటిస్తున్న సంగ‌తి తెలిసిందే. నిజాం పాల‌న నుంచి తెలంగాణ‌కు విముక్తి క‌లిగిన సంద‌ర్భాన్ని తెలంగాణ విమోచ‌న దినంగా పాటిస్తున్నారు. ఈ ఏడాది తెలంగాణ విమోచ‌న దినాన్ని ఈ నెల 17న సికింద్రాబాద్ ప‌రేడ్ గ్రౌండ్స్‌లో అధికారికంగా నిర్వ‌హించేందుకు కేంద్రం నిర్ణ‌యించింది.

ఈ కార్య‌క్ర‌మానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటు మ‌హారాష్ట్ర, కర్ణాట‌క ముఖ్య‌మంత్రులు ఏక్‌నాథ్ షిండే, బ‌స‌వ‌రాజ్ బొమ్మైలు హాజ‌రు కానున్నట్లు తెలుస్తోంది.

సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం నిర్వహణ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సెప్టెంబర్ 17 విలీన దినోత్సవమా, విమోచనా దినోత్సవమా, విద్రోహ దినమా అంటూ రకరకాల చర్చలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత September 17 సెప్టెంబర్ 17పై ప్రభుత్వం ఎటూ తేల్చకుండా ఉంది.

ఇటీవల తెలంగాణలో దూకుడు పెంచిన బీజేపీ సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని ఘనం నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి బీజేపీ సెప్టెంబర్ 17 September 17ను అధికారిక కార్యక్రమంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. ఇప్పుడు రాజకీయంగా కూడా ఆ పార్టీకి లబ్ది చేకూర్చే అంశం కావడంతో విమోచన దినోత్సవాన్ని కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టేందుకు సిద్ధమవుతోంది.

తెలంగాణ ప్రాంతానికి విమోచన లభించి 74ఏళ్లు పూర్తై 75వ ఏట అడుగు పెడుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉత్సవాలను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి, కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి, ఇతర అధికారులతో విమోచన దినోత్సవం నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో చర్చించారు. సికింద్రబాద్‌ పేరెడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే కార్యక్రమానికి హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశాలున్నాయి. కేసీఆర్‌తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌షిండే, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైలను అతిథులుగా పిలవాలని యోచిస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రజలను పెద్ద ఎత్తున ఆహ్వానించాలని భావిస్తున్నారు.

పరేడ్‌ గ్రౌండ్స్‌లో September 17సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించిన తర్వాత ఏడాది పొడవున సంబరాలు నిర్వహించ నున్నారు.ఇందు కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాటాలు జరిగిన భైరాన్‌పల్లి, పరకాల వంటి ప్రాంతాల్లో కార్యక్రమాలను నిర్వహిస్తారు. కుమురం భీం, షోయబుల్లా ఖాన్‌ వంటి స్వాతంత్య్ర పోరాట వీరుల కుటుంబాలను మంత్రులు, ప్రజా ప్రతినిధులు కలుసుకుంటారు. విమోచన దినోత్సవ వేడుకల సన్నాహక సమావేశంలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌, ఆ పార్టీ ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు.