తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  T Congress: కోమటిరెడ్డికి సారీ చెప్పిన రేవంత్ రెడ్డి - వీడియో రిలీజ్

T Congress: కోమటిరెడ్డికి సారీ చెప్పిన రేవంత్ రెడ్డి - వీడియో రిలీజ్

13 August 2022, 12:18 IST

google News
    • కోమటిరెడ్డి వెంకటరెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పారు. పార్టీ నేతల తిట్లకు బాధ్యత వహిస్తూ క్షమాపణ చెబుతున్నట్లు ప్రకటించారు. ఐక్యమత్యమే పార్టీకి బలం అని అన్నారు. ఇందుకు సంబంధించి ఓ వీడియోనూ విడుదల చేశారు.
రేవంత్ రెడ్డి - వెంకట్ రెడ్డి (ఫైల్ ఫొటో)
రేవంత్ రెడ్డి - వెంకట్ రెడ్డి (ఫైల్ ఫొటో) (HT)

రేవంత్ రెడ్డి - వెంకట్ రెడ్డి (ఫైల్ ఫొటో)

revanth reddy apology to mp komatireddy: తెలంగాణ కాంగ్రెస్ చండూరు సభ వేడి తగ్గడం లేదు. ఎంపీ కోమటిరెడ్డిపై అద్దంకి దయాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేయటంతో మొదలైన రగడ... రోజురోజుకూ ముదురుతుంది. ఈ కామెంట్స్ పై సీరియస్ గా ఉన్న కోమటిరెడ్డి... ఏకంగా పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టార్గెట్ గా విమర్శలు చేశారు. బహిరంగ క్షమాపణ చెప్పటమే కాదు... సదరు నేతను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఎంపీ కోమటిరెడ్డి కామెంట్స్ పై రేవంత్ రెడ్డి స్పందించారు. బహిరంగ క్షమాపణ చెబుతూ ఓ వీడియోను విడుదల చేశారు.

'హోంగార్డు వ్యాఖ్యలతో పాటు మునుగోడు బహిరంగ సభలో కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్... మునుగోడు పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశించి పరుషమైన పదజాలం వాడటంతో వారంతో మనస్తాపానికి గురయ్యారు. పీసీసీ అధ్యక్షుడిగా సారీ చెప్పాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలపై కోమటిరెడ్డికి బహిరంగంగా క్షమాపణ చెబుతున్నా. ఇలాంటి చర్యలు, ఇలాంటి భాష ఎవరికీ మంచిది కాదు. తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాషీలక పాత్ర పోషించి, రాష్ట్ర సాధనలో పాత్ర పోషించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇలా అవమానించే విధంగా ఎవరు మాట్లాడినా తగదని, తదుపరి చర్యల కోసం క్రమశిక్షణా సంఘం చైర్మన్ చెన్నారెడ్డికి రేవంత్ సూచిస్తున్నాను’’ అంటూ రేవంత్ ట్విట్టర్‌లో వీడియోను పోస్ట్ చేశారు.

ఇదిలా ఉంటే అద్దంకి దయాకర్‌ శనివారం మరోసారి ఎంపీ కోమటిరెడ్డికి క్షమాపణలు తెలిపారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. షోకాజ్ నోటీసులకు వివరణ ఇచ్చానని.. క్షమాపణ కూడా చెప్పినట్లు వెల్లడించారు. భవిష్యత్‌లో మరోసారి అలా జరగకుండా చూసుకుంటాననని అద్దంకి దయాకర్‌ ప్రకటించారు.

మొత్తంగా అద్దంకి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ కామెంట్స్ ను ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి కూడా తీవ్రంగా ఖండించారు. సొంత పార్టీ నేతలు కూడా అద్దంకి తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అఇతే రేవంత్ క్షమాపణలు చెప్పటంతో… ఎంపీ వెంకట్ రెడ్డి ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

తదుపరి వ్యాసం