Komatireddy Issue: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని విమర్శించలేదన్న రేవంత్ రెడ్డి…
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా సందర్భంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో, తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకున్నారు. వెంకట్‌రెడ్డిని తానేమి అనలేదని, రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి మాత్రమే తన వ్యాఖ్యలు పరిమితమని రేవంత్ ప్రకటించారు.
రాజగోపాల్ రెడ్డి వ్యవహారంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బహిరంగ వివరణ ఇచ్చుకున్నారు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు రాజగోపాల్ ప్రకటన నేపథ్యంలో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి సోదరులనుద్దేశించి వ్యాఖ్యలు చేశారు. దీనిపై వెంకట్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రేవంత్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి చేరడంతో రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తానేమి అనలేదని రేవంత్ చెప్పారు.
రాజగోపాల్ రెడ్డి చెప్పుకునే బ్రాండ్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ లేకుంటే రాజగోపాల్ రెడ్డి బ్రాందీ షాపులో పనిచేయడానికి కూడా పనికి రాడని విమర్శించారు. మరోవైపు ఈ వ్యవహారంలో కోమటిరెడ్డికి వివరణ ఇచ్చానని రేవంత్ చెప్పారు. వెంకటరెడ్డి తమ కుటుంబ సభ్యుడని, రాజ గోపాల్ ద్రోహి అని, కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేశారని ఆరోపించారు. అతనికి ఉన్న బ్రాండ్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని అది లేకపోతే బ్రాందీ షాపులో పనిచేయడానికి కూడా పనిచేయడని ఎద్దేవా చేశారు.
తాను వెంకటరెడ్డిపై ఎలాంటి వ్యాఖ్యలుచచేయలేదు, తనకంటే వెంకటరెడ్డి పార్టీలో సీనియర్ అని, తమ మధ్య కొందరు అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి వేర్వేరని, రాజగోపాల్ ద్రోహి అని ఆరోపించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవికి రాజీనాామా చేసి రాష్ట్ర సాధనలో పోరాడారని, తన వ్యాఖ్యలు రాజగోపాల్ రెడ్డికి సంబంధించినవి మాత్రమే అని వివరణ ఇచ్చారు. తన మాటలతో వెంకటరెడ్డి మనస్తాపం చెంది ఉంటే అందులో ఆయన ప్రస్తావన లేదని గుర్తించాలని కోరారు. మునుగోడు ఉప ఎన్నికలో రేవంత్ రెడ్డి తమతో కలిసి రావాల్సిందిగా కోరుతున్నానని చెప్పారు. కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ కోసం వెంకటరెడ్డి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ్ముడిగా రాజకీయాల్లో రాజగోపాల్‌ను వదిలించుకోెవాలన్నారు. సోదరుల మధ్య సంబంధం ఇంటికి సంబంధించినంత వరకే పరిమితం అన్నారు.
రేవంత్ వ్యాఖ్యలపై రెండ్రోజుల క్రితం వెంకట్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి సోదరులను ఉద్దేశించి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎన్‌ఎస్‌యుఐలో ఉన్నప్పుడు రేవంత్ రాజకీయాల్లో పుట్టలేదన్నారు. రేవంత్ రెడ్డి మరో పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినపుడు పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డి పార్టీని విడిచిపెడితే అది ఆయనకు సంబంధించిన వ్యవహారమని, ఆయన పార్టీకి, పదవులకు రాజీనామా చేసి వెళ్లిపోవడం వ్యక్తిగత విషయమని చెప్పారు. తనకు నచ్చిన పార్టీల చేరే స్వేచ్ఛ రాజగోపాల్‌కు ఉందని అందులో తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నారు. తనను ఉద్దేశించి రేవంత్ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
టాపిక్