తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Brs Party Mps : సన్నాహక సమావేశంలో కనిపించని సిట్టింగ్ ఎంపీ..! ‘కారు’ దిగబోతున్నారా....?

BRS Party MPs : సన్నాహక సమావేశంలో కనిపించని సిట్టింగ్ ఎంపీ..! ‘కారు’ దిగబోతున్నారా....?

27 March 2024, 10:15 IST

google News
    • Lok Sabha Elections in Telangana 2024: వచ్చే పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి అత్యంత సవాల్ గా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పలువురు నేతలు పార్టీని వీడుతున్నారు. అయితే తాజాగా పార్టీ నిర్వహించిన కీలక సమావేశానికి సిట్టింగ్ ఎంపీ దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది.
బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశంలో కేటీఆర్
బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశంలో కేటీఆర్

బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశంలో కేటీఆర్

Nagarkurnool Lok Sabha Constituency: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన బీఆర్ఎస్... ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. నియోజకవర్గాలవారీగా సమీక్షలు చేస్తూ... కేడర్ లో జోష్ నింపే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే అధికారం కోల్పోయిన నేపథ్యంలో.... వచ్చే పార్లమెంట్ ఎన్నికలు అత్యంత సవాల్ గా మరాయి. ఈ క్రమంలో.... బలమైన అభ్యర్థులను బరిలో ఉంచి మెజార్టీ ఎంపీ సీట్లను గెలుచుకోవాలని భావిస్తోంది. గత తప్పిదాలను పునరావృతం కాకుండా.... జాగ్రత్తలు తీసుకోవాలని చూస్తోంది. అయితే తాజాగా నిర్వహించిన పార్లమెంట్ నియోజకవర్గ సమావేశానికి సిట్టింగ్ ఎంపీ దూరంగా ఉన్నారు. దీంతో ఆయన దారెటు..? అన్న చర్చ మొదలైంది.

కనిపించని సిట్టింగ్ ఎంపీ…?

పోతుగంటి రాములు…. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ. ప్రస్తుతం నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం(Nagarkurnool Lok Sabha constituency) నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో టీడీపీలో ఉన్న ఆయన… ఆ తర్వతా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున నాగర్ కర్నూల్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఆయన కుమారుడైన భరత్ కల్వకుర్తి జడ్పీటీసీగా కూడా ఉన్నారు. అప్పట్లో ఆయన కుమారుడు భరత్ ను జెడ్పీ ఛైర్మన్ గా చేసేందుకు కూడా పావులు కదిపారు రాములు. కానీ పార్టీలోని పలువురు నేతల నుంచి అభ్యంతరాలు రావటంతో…. సీన్ మారిపోయింది. అప్పట్నుంచి అసంతృప్తిగానే ఉన్నారు రాములు. దీనికితోడు గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తన కుమారుడిని అచ్చంపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించేందుకు కూడా ప్రయత్నాలు చేసినప్పటికీ…. అధినాయకత్వం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బాల్ రాజుకే సీటు ఖరారు చేసింది. దీంతో పార్టీ తీరుపై తీవ్రమైన అంసతృప్తితో ఉన్న రాములు…. పార్టీకి దూరంగా ఉంటున్నారు. త్వరలోనే ఆయన పార్టీ మారే అవకాశం ఉందన్న చర్చ కూడా జోరుగా జరుగుతుంది. అయితే తాజాగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నిర్వహించిన పార్టీ సన్నాహక సమావేశంలో ఆయన కనిపించలేదు. ఇందుకు వర్కింగ్ ప్రెసిడింట్ కేటీఆర్(KTR) హాజరయ్యారు. అయితే సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాములు(MP Pothuganti Ramulu) కనిపించకపోవటంతో….ఆయన విషయంలో వస్తున్న వార్తలకు మరింత బలం చేకూర్చినట్లు అయింది.

ఎంపీ రాములు… బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతారనే చర్చ వినిపిస్తోంది. ఇప్పటికే మందా జగన్నాథం కూడా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. ఆయన నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ ను ఆశిస్తున్నారు. రాములు కూడా టికెట్ ఖరారుపైనే ఆశలు పెట్టుకున్నారని… మరోసారి బరిలో ఉండాలని చూస్తున్నారని సమాచారం. కానీ కాంగ్రెస్ లో మల్లు రవి, జగన్నాథం, సంపత్ కుమార్ రేసులో ఉన్నారు. తీవ్రమైన పోటీ నేపథ్యంలో… రాములుకు టికెట్ దక్కకపోవచ్చన్న చర్చ కూడా ఓ సైడ్ నుంచి వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో…. రాములు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది.

తదుపరి వ్యాసం