MLA Danam On IPL : అలా లేకుంటే ఉప్పల్ లో IPL మ్యాచ్ జరగనివ్వం - సన్ రైజర్స్ టీమ్ కు ఎమ్మెల్యే దానం సీరియస్ వార్నింగ్
05 April 2024, 16:41 IST
- MLA Danam Nagender On IPL : సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. వచ్చే ఐపీఎల్ సీజన్ లో హైదరాబాద్ టీమ్ లో లోకల్ ప్లేయర్స్ లేకపోతే మ్యాచ్ లను అడ్డుకుంటామని హెచ్చరించారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (ఫైల్ ఫొటో)
MLA Danam Nagender On IPL Matches: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(MLA Danam Nagender) సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వచ్చే ఐపీఎల్(IPL) సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) టీమ్ లో స్థానిక ఆటగాళ్లు తప్పనిసరిగా ఉండాలన్నారు. అలా తీసుకోకుంటే… ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ లు ఎలా జరుగుతాయో చూస్తామని హెచ్చరించారు. తప్పనిసరిగా హైదరాబాద్ ప్లేయర్లను తీసుకోవాలని డిమాండ్ చేశారు.
10 నిమిషాల్లోనే అమ్మేస్తున్నారు..
MLA Danam Nagender On IPL Tickets : “హైదరాబాద్‌లో క్రికెట్ మ్యాచ్‌కు టిక్కెట్లు దొరకకపోవడానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషనే(HCA) కారణం. 10 నిమిషాల్లోనే 45 వేల టిక్కెట్లు ఎలా అమ్ముడుపోయాయి..? ఆన్ లైన్ పోర్టల్ లో ఓపెన్ చేయగానే… టికెట్లు అయిపోయాయని వస్తుంది. 10 నిమిషాల్లోనే ఇలా ఎలా అవుతుంది..? నేను గతంలో బ్యాడ్మింటర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పని చేశాడు. ఆ సమయంలో చాలా మంది ఆటగాళ్లు బయటికి వచ్చారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లకు సంబంధించి చాలా మంది నాకు ఫోన్ కాల్స్ చేస్తున్నారు. టికెట్లు కనీసం దొరకటం లేదని వాపోతున్నారు. అంతేకాకుండా హైదరాబాద్ ప్లేయర్స్ కు ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వటం లేదు. వచ్చే ఐపీఎల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ టీమ్ లో హైదరాబాద్ ప్లేయర్ ఉండాలి. అలా చేయకపోతే స్డేడియం ముందు కూర్చుంటాం. కేసులు నమోదు చేసిన సరే..వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఎండలను లెక్కచేయకుండా అభిమానులు మ్యాచ్ లు చూడటానికి వస్తున్నారు. గతంలో కూడా నేను డేవిడ్ వార్నర్ ఫిక్సింగ్ చేస్తున్నాడని ఫిర్యాదు ఇచ్చా. దాంతో అతని కెప్టెన్ నుంచి తీసేశారు. ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) టీమ్ పై ఫిర్యాదు చేస్తాను. కిరణ్ అనే వ్యక్తితో పాటు హెచ్ సీఏ అధ్యక్షుడిని కూడా అరెస్ట్ చేయాలి. అప్పుడే అసలు విషయాలు బయటికి వస్తాయి” అని ఎమ్మెల్యే దానం నాగేందర్(MLA Danam Nagender) అన్నారు.
ఐపీఎల్ మ్యాచ్ టికెట్లలో బ్లాక్ మార్కెట్ దందా నడుస్తోందని దానం(MLA Danam Nagender) ఆరోపించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రితో పాటు క్రీడాశాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. టికెట్లు దొరకకపోవడానికి హెద్రబాద్ క్రికెట్ అసోసియేషన్ బాధ్యులే అని విమర్శించారు. సన్ రైజర్స్ టీమ్ లో హైదరాబాద్ ప్లేయర్లను తీసుకోవటం లేదని... కనీసం ఇంపాక్ట్ ప్లేయర్ కూడా హైదరాబాద్ క్రీడాకారులు లేకపోవడం దారుణమన్నారు. ఈ విషయంలో సదరు టీమ్ పై ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. ఇక గతంలో కూడా దానం నాగేందర్…. ఇదే తరహా కామెంట్స్ చేశారు. సన్ రైజర్స్ టీమ్ లో లోకల్ ప్లేయర్ కు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాజాగా మరోసారి వార్నింగ్ ఇవ్వటంతో…. ఈ వ్యవహారం ఎక్కడికి వరకు వెళ్తుందో చూడాలి…!
మరోవైపు ఇవాళ హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా హైదరాబాద్ - చెన్నై మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. మూడు మ్యాచ్‌లు ఆడి 2 మ్యాచుల్లో విజయం సాధించిన సీఎస్కే ఓ వైపు..మూడు మ్యాచ్‌లలో కేవలం ఒక మాచ్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోవైపు ఉన్నాయి. ఇవాళ జరిగే ఉత్కంఠ పోరుతోల ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.