GT vs SRH : సన్​రైజర్స్​ ఊచకోత కొనసాగుతుందా? లేక టైటాన్స్​ అడ్డుకుంటుందా?-ipl 2024 gt vs srh head to head pitch report and other details ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Gt Vs Srh : సన్​రైజర్స్​ ఊచకోత కొనసాగుతుందా? లేక టైటాన్స్​ అడ్డుకుంటుందా?

GT vs SRH : సన్​రైజర్స్​ ఊచకోత కొనసాగుతుందా? లేక టైటాన్స్​ అడ్డుకుంటుందా?

Sharath Chitturi HT Telugu
Mar 31, 2024 11:06 AM IST

GT vs SRH IPl 2024 : జీటీ వర్సెస్​ ఎస్​ఆర్​హెచ్​ మ్యాచ్​.. ఇంకొన్ని గంటల్లో మొదలవ్వనుంది. ఈ రెండు జట్ల హెడ్​ టు హెడ్​ స్టాట్స్​ ఇక్కడ చూడండి..

ప్రాక్టీస్​ సెషన్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​ ప్లేయర్లు
ప్రాక్టీస్​ సెషన్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​ ప్లేయర్లు (PTI)

GT vs SRH 2024 : ఐపీఎల్​ 2024లో ముంబై ఇండియన్స్​పై ఊచకోత సృష్టించిన సన్​ రైజర్స్​ హైదరాబాద్​.. మరో రసవత్తరమైన పోరుకు సిద్ధమైంది. అహ్మదాబాద్​ వేదికగా.. ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు.. గుజరాత్​ టైటాన్స్​తో పోటీ పడనుంది ఎస్​ఆర్​హెచ్​. ఐపీఎల్​ చరిత్ర​లోనే అత్యధిక పరుగులు (277) కొట్టిన ప్యాట్​ కమిన్స్​ జట్టుపై అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అటువైపు జీటీ కూడా.. బలంగానే ఉండటంతో.. టఫ్​ ఫైట్​ తప్పదని ఫ్యాన్స్​ ఆశిస్తున్నారు.

జీటీ వర్సెస్​ ఎస్​ఆర్​హెచ్​- హెడ్​ టు హెట్​ స్టాట్స్​..

ఐపీఎల్​లో గుజరాత్​ టైటాన్స్​- సన్​రైజర్స్​ హైదరాబాద్​లు ఇప్పటివరకు మూడుసార్లు పోటీపడ్డాయి. ఇందులో గుజరాత్​ టైటాన్స్​దే పైచేయి! ఎస్​ఆర్​హెచ్​పై 2:1 తో గెలిచింది జీటీ. ఇక అహ్మదాబాద్​ వేదికగా జరిగిన ఒక మ్యాచ్​లో.. జీటీ చేతుల్లో ఎస్​ఆర్​హెచ్​ ఓటమిపాలైంది. 2023 ఐపీఎల్​లో మాత్రం.. ఈ రెండు జట్లు రెండు సార్లు పోటీపడగా.. చెరొకసారి గెలిచాయి.

GT vs SRH head to head : ఇక ఐపీఎల్​ 2024 విషయానికొస్తే.. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్​లలో ఒకటి గెలిచి, ఇంకోటి ఓడిపోయింది ఎస్​ఆర్​హెచ్​. గుజరాత్​ టైటాన్స్​ పరిస్థితి కూడా ఇంతే! కానీ.. రన్​ రేట్​ విషయంలో శుభ్​మాన్​ గిల్​ సేన వెనకపడింది. ఫలితంగా.. ఎస్​ఆర్​హెచ్​ 4వ స్థానంలో ఉండగా.. జీటీ.. ప్రస్తుతం 8వ స్థానంలో కొనసాగుతోంది.

జీటీ వర్సెస్​ ఎస్​ఆర్​హెచ్​- పిచ్​ రిపోర్ట్​..

అహ్మదాబాద్​లోని నరేంద్ర మోదీ స్టేడియం ఎప్పుడు అన్​ప్రెడిక్టెబుల్​గానే ఉంటుంది. ఒకసారి హై స్కోరింగ్​ మ్యాచ్​ జరిగితే.. ఇంకోసారి లో స్కోరింగ్​ లేదా యావరేజ్​ రన్స్​ మ్యాచ్​ కనిపిస్తుంది. ఒక్కోసారి.. బ్యాటర్లు వీరబాదుడు కొడితే, ఇంకోసారి.. పరుగులు చేయడమే కష్టంగా మారుతుంది.

మరి ఈసారి టాస్​ గెలిచిన జట్టు.. మొదటి బ్యాటింగ్​ చేస్తుందా? లేక బౌలింగ్​ చేస్తుందా? చూడాలి.

జీటీ వర్సెస్​ ఎస్​ఆర్​హెచ్​- జట్లు..

GT vs SRH live news : జీటీ (అంచనా):- వృద్ధిమాన్​ సాహా, శుభ్​మాన్​ గిల్​ (కెప్టెన్​), సాయి సుదర్శన్​, విజయ్​ శంకర్​, డేవిడ్​ మిల్లర్​, అజ్మతుల్ల ఒమర్​జై, రాహుల్​ తివాటియా, రషీద్​ ఖాన్​, సాయి కిషోర్​, ఉమేశ్​ యాదవ్​, స్పెన్సర్​ జాన్సన్​. (ఇంపాక్ట్​ ప్లేయర్​- మోహిత్​ శర్మ)

ఎస్​ఆర్​హెచ్​ (అంచనా):- ట్రావిస్​ హెడ్​, మయాంక్​ అగర్వాల్​, అభిషేక్​ శర్మ, ఎయిడెన్​ మాక్రమ్​,హెన్రిక్​ క్లాసెన్​, అబ్దుల్​ సమద్​, షబాజ్​ అహ్మద్​, ప్యాట్​ కమిన్స్​ (కెప్టెన్​), భువనేశ్వర్​ కుమార్​, మయాంక్​ మార్కండేయ, నటరాజన్​/ ఉనద్కత్​. (ఇంపాక్ట్​ ప్లేయర్​- ఉమ్రాన్​ మాలిక్​.)

Whats_app_banner

సంబంధిత కథనం