Congress Third list : 57 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ మూడో జాబితా విడుదల - లిస్ట్ లో దానం, మల్లు రవి పేర్లు - లిస్ట్ ఇదే
Loksabha Elections 2024: లోక్ సభ అభ్యర్థులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మూడో జాబితాను ప్రకటించింది. ఇందులో 57 మందికి అవకాశం కల్పించింది.
Congress candidates for Loksabha lections 2024: పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి మూడో జాబితాను ప్రకటించింది కాంగ్రెస్ హైకమాండ్. మొత్తం 57 మంది పేర్లతో ఈ లిస్ట్ ను విడుదల చేసింది. ఇక ఇందులో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మరో ఐదు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.
Telangana- Congress MP Canditates List: కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా
- పెద్దపల్లి - గడ్డం వంశీకృష్ణ
- మల్కాజ్ గిరి - సునీతా మహేందర్ రెడ్డి
- సికింద్రాబాద్ - దానం నాగేందర్
- చేవెళ్ల - డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి
- నాగర్ కర్నూల్ - డాక్టర్ మల్లు రవి
ఇక తెలంగాణలోని పార్లమెంట్ సీట్ల విషయానికి వస్తే… ఇది రెండో జాబితా అని చెప్పవచ్చు. మొదటి జాబితాలో నలుగురు అభ్యర్థులను ఖరారు చేసిన అధినాయకత్వం… తాజా జాబితాలో ఐదుగురి పేర్లను ఖరారు చేసింది. పెద్దంపల్లి నుంచి ఎమ్మెల్యే గడ్డం వివేక్ కుమారుడు గడ్డం వంశీకి అవకాశం దక్కింది. ఇక మల్కాజ్ గిరి నుంచి పట్నం సునీతా మహేందర్ రెడ్డి పేరు ఖరారైంది. ఇక ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరు కూడా లిస్ట్ లో ఉంది. ఆయన్ను సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసింది కాంగ్రెస్ అధినాయకత్వం. చేవెళ్ల నుంచి గడ్డం రంజిత్ రెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవికి అవకాశం దక్కింది. రంజిత్ రెడ్డి… ఇటీవలనే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ సీటు ఆశించిన బొంతు రామ్మోహన్, పెద్దపల్లి సీటు ఆశించిన సిట్టింగ్ ఎంపీ బోరకుంట వెంకటేష్ నేత ఇద్దరికీ కూడా అవకాశం దక్కలేదు.
కాంగ్రెస్ విడుదల చేసిన తొలి జాబితాలో తెలంగాణ నుంచి నాలుగు స్థానాలకు అభ్యర్థులను(Telangana Congress MP Candidates 2024) ఖరారు చేసిన సంగతి తెలిసిందే. నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి(Janareddy Family) పేరును ఫైనల్ చేసింది. జహీరాబాద్ నుంచి సురేశ్ షెట్కర్ కు అవకాశం దక్కింది. ఇక మహబూబాబాద్(ఎస్టీ రిజర్వ్) లోక్ సభ నియోజకవర్గం నుంచి బలరామ్ నాయక్ పేరు ఖరారైంది. మహబూబ్ నగర్ నుంచి వంశీ చందర్ రెడ్డికి అవకాశం దక్కింది.
తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలు ఉండగా… రెండు జాబితాలను కలిపి మొత్తం 4 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. త్వరలోనే మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనుంది. ఇప్పటికే అభ్యర్థుల విషయంలో కసరత్తు పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇందులో కీలకమైన మెదక్, భువనగిరి, ఖమ్మం, నిజామాబాద్ తో పాటు మరికొన్నిస్థానాలు ఉన్నాయి.