IRCTC Hyd Rajasthan Tour: రాజస్థాన్ టూర్ ప్యాకేజీ… చూసే ప్రాంతాలు, ధరలివే
02 September 2022, 15:25 IST
- hyderabad Rajasthan tour package: హైదరాబాద్ నుంచి రాజస్థాన్ టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.
హైదరాబాద్ రాజస్థాన్ టూర్
IRCTC Tourism Announced Rajasthan Tour Package 2022: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా హైదరాబాద్ నుంచి రాజస్థాన్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'ROYAL RAJASTHAN' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఫ్లైటీ జర్నీ ద్వారా సాగే ఈ టూర్ లో... పలు పర్యాటక ప్రాంతాలను చూపించనుంది. జైపూర్, పుష్కర్, జోద్ పూర్, ఉదయ్ పూర్ వంటి పలు ప్రాంతాలు కవర్ అవుతాయి.
hyderabad rajsthan tour: ఈ నెల సెప్టెంబర్ 13వ తేదీన ఈ టూర్ అందుబాటులో ఉంది. ప్రతి...... తేదీల్లో ఈ టూర్ ను ఆపరేట్ చేసున్నారు. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.
Day 1: ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. మధ్యాహ్నం సమయం వరకు జైపూర్ విమానాశ్రయానికి వెళ్తారు. హెటల్ కి వెళ్లిన తర్వాత... సిటీ ప్యాలెస్, హావా మహాల్ ను సందర్శిస్తారు. రాత్రి జైపూర్ లోనే బస చేస్తారు.
Day 2: బ్రేక్ ఫాస్ట్ అనంతరం హెటల్ నుంచి చెక్ అవుట్ అయిన తర్వాత అమిర్ ఫోర్ట్ కు వెళ్తారు. అనంతరం పుష్కర్ కు పయనమవుతారు. రాత్రి ఇక్కడే హోటల్ లో బస చేస్తారు.
Day 3: మూడో రోజు ఉదయం బ్రహ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు. బ్రేక్ ఫాస్ట్ అనంతరం హోటల్ నుంచి బయల్దేరి జోద్ పూర్ కు స్టార్ట్ అవుతారు. మధ్యాహ్నం వరకు జోద్ పూర్ కు చేరుకున్న తర్వాత... మెరన్ ఘర్ ఫోర్ట్ ను సందర్శిస్తారు. హెటల్ లో చెకిన్ అయిన తర్వాత... రాత్రి జోద్ పూర్ లోనే బస చేస్తారు.
Day 4: బ్రేక్ ఫాస్ట్ అయిన తర్వాత ఉమెద్ భవన్ ప్యాలెస్ కు వెళ్తారు. అనంతరం ఉదయ్ పూర్ కు బయల్దేరుతారు. రాంక్ పుర్ జైన్ ఆలయ సందర్శన ఉంటుంది. రాత్రి ఉదయ్ పూర్ లోనే బస చేస్తారు.
Day 5: బ్రేక్ ఫాస్ట్ తర్వాత నాథ్ ద్వార కు వెళ్తారు. మధ్యాహ్నం తిరిగి ఉదయ్ పూర్ కు చేరుకుంటారు. లేక్ పిచ్చోలాను చూస్తారు. రాత్రి ఉదయ్ పూర్ లోనే బస చేస్తారు.
Day 6: బ్రేక్ ఫాస్ట్ అయిన తర్వాత సిటీ ప్యాలెస్ కు వెళ్తారు. మధ్యాహ్నం ఉదయ్ పూర్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ్నుంచి హైదరాబాద్ కు రావటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
ధరలివే.....
hyd royal rajasthan tour cost: కంఫర్ట్ క్లాస్ లో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 38,000 ధర ఉండగా.. డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 29,850 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.29,400 గా ఉంది. 5 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. పూర్తి వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చూసుకోవచ్చు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.
NOTE:
ఈ లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.