Special Trains: : బెంగళూరు, హైదరాబాద్, జైపూర్ కు ప్రత్యేక రైళ్లు
Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. బెంగళూరు, హైదరాబాద్, జైపూర్ కు ప్రత్యేక ట్రైన్లను ప్రకటించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
South Central Railway Special Trains: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రవేశపెట్టిన ప్రత్యేక రైళ్ల గడువును పొడిగించింది. తాజాగా బెంగళూరు, హైదరాబాద్, జైపూర్ నగరాలకు కూడా ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ మేరకు వేర్వురుగా ప్రకటనలు విడుదల చేసింది.
గడువు పొడిగింపు...
special train services between hyderabad to jaipur: హెదరాబాద్-జైపూర్ ట్రైన్ సర్వీస్(Train No.07115) ను సెప్టెంబర్ 2 నుంచి 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ ను ప్రతీ శుక్రవారం నడపనున్నారు. ఇక జైపూర్-హైదరాబాద్ ట్రైన్ సర్వీస్(Train No.07116) ను సెప్టెంబర్ 4 నుంచి అక్టోబర్ 2 వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ రైలును ప్రతీ శనివారం నడపనున్నట్లు పేర్కొంది.
ఈ ప్రాంతాలకు స్పెషల్ ట్రైన్స్...
special train services from bengaluru: మరోవైపు బెంగళూరు-షాలిమార్ మధ్య స్పెషల్ ట్రైన్ ను ప్రకటించారు. ఈ నెల 24వ తేదీన బెంగళూరు నుంచి 10.15 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 18.15 గంటలకు గమ్యానికి చేరుతుంది. షాలిమార్-SMVT బెంగళూరు( Train No.06598) ట్రైన్ ఈ నెల 26వ తేదీన బయల్దేరుతుంది. ఈ ట్రైన్ 12.40 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 20.00 గంటలకు గమ్యస్థలానికి చేరుతుందని ప్రకటనలో వెల్లడించారు.
ఈ ప్రత్యైక రైళ్లు కృష్ణరాజపురం, కట్పడీ, రేణిగుంట, రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పలాస, బరంపుర్, కుర్ధా, భువనేశ్వర్, కటక్, కరంగపూర్, సంత్రగాచి స్టేషన్లలో ఆగుతుందని అధికారులు వెల్లడించారు. ఈ ట్రైన్లలో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయని తెలిపారు. ఈ సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని ఓ ప్రకటనలో కోరారు.