తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Irctc Tour From Hyd : హైదరాబాద్ టూ మధ్యప్రదేశ్.. మహాదర్శన్ టూర్ ప్యాకేజీ చూశారా?

IRCTC Tour From HYD : హైదరాబాద్ టూ మధ్యప్రదేశ్.. మహాదర్శన్ టూర్ ప్యాకేజీ చూశారా?

Anand Sai HT Telugu

17 October 2022, 22:59 IST

google News
    • IRCTC Tourism Tour Package : మధ్యప్రదేశ్ వెళ్లాలి అనుకునేవారి కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

IRCTC Tourism MADHYA PRADESH MAHA DARSHAN: వేర్వేరు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్ లోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. MADHYA PRADESH MAHA DARSHAN పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఫ్లైట్ జర్నీ ద్వారా సాగే ఈ టూర్ లో... పలు పర్యాటక ప్రాంతాలను చూపించనుంది. 4 రాత్రులు, 5 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. మహేశ్వర్, సాంచి, ఉజ్జయిని, ఓంకారేశ్వర్ ప్రాంతాలు కవర్ అవుతాయి. 17 డిసెంబర్ 2022న టూర్ అందుబాటులో ఉంది.

Day 1 : హైదరాబాద్ నుండి ఉదయం బయలుదేరుతారు. మధ్యాహ్నం భోపాల్ చేరుకుంటారు. పికప్ చేసి హోటల్‌కి తీసుకెళ్తారు. మధ్యాహ్నం 12 గంటలకు హోటల్‌లో చెక్ ఇన్ అవ్వాలి. హోటల్‌లో భోజనం చేసి ఫ్రెష్ అప్ అయ్యి సాంచికి బయలుదేరాలి. సాంచి స్తూపాన్ని సందర్శించాలి. తిరిగి భోపాల్ కు వచ్చి.. డిన్నర్ చేసి బస చేస్తారు.

Day 2: అల్పాహారం చేసి హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి. ఇందిరా గాంధీ రాష్ట్రీయ మానవ్ సంగ్రహాలయ, గిరిజన మ్యూజియం సందర్శించాలి. ఇండోర్‌కు బయలుదేరాలి. అక్కడ హోటల్‌లో దిగాలి. ఇండోర్‌లో రాత్రి భోజనం చేసి బస చేయాలి.

Day 3: అల్పాహారం చేసి.. చెక్ అవుట్ చేయాలి. ఓంకారేశ్వర్ కి బయలుదేరాలి. అక్కడ ఆలయాన్ని సందర్శించండి. తర్వాత మహేశ్వరానికి బయలుదేరుతారు. అహల్యా దేవి కోటను సందర్శిస్తారు. సాయంత్రం ఉజ్జయినికి వస్తారు. హోటల్‌లో చెక్ ఇన్ అవ్వాలి. డిన్నర్ చేసి రాత్రిపూట ఉజ్జయినిలో బస చేస్తారు.

Day 4 : అల్పాహారం చేసుకుని.. ఉజ్జయినిలోని స్థానిక దేవాలయాలను సందర్శిస్తారు. అప్పటికే సాయంత్రం అవుతుంది. డిన్నర్ చేసి.. రాత్రిపూట ఉజ్జయినిలో బస చేస్తారు.

Day 5 : ఉదయాన్నే బస్మ ఆరతి కోసం మహాకాల్ ఆలయాన్ని సందర్శించాలి. అనంతరం హోటల్‌కి తిరిగి వెళ్ళాలి. అల్పాహారం చేసి హోటల్ నుంచి వెకేట్ చేయాలి. ఆ తర్వాత ఇస్కాన్ ఆలయాన్ని సందర్శిస్తారు. ఇండోర్‌కి బయలుదేరాలి. ఇండోర్ ఎయిర్‌పోర్ట్‌లో సాయంత్రం 4 గంటలకు డ్రాప్ చేస్తారు. అక్కడ నుంచి హైదరాబాద్‌కి ఫ్లైట్ లో వస్తారు. దీంతో టూర్ ముగుస్తుంది.

సింగిల్ ఆక్యూపెన్సీకి కు రూ.34600 ధర ఉండగా.. డబుల్ ఆక్యూపెన్సీకి రూ.27250 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ ఆక్యూపెన్సీకి రూ.25850 గా ఉంది. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.

తదుపరి వ్యాసం