IRCTC Meghalaya Tour : మెస్మరైజింగ్ మేఘాలయ టూర్.. ఇదిగో ప్యాకేజీ డిటేయిల్స్-irctc announced meghalaya and assam tour package from hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Irctc Meghalaya Tour : మెస్మరైజింగ్ మేఘాలయ టూర్.. ఇదిగో ప్యాకేజీ డిటేయిల్స్

IRCTC Meghalaya Tour : మెస్మరైజింగ్ మేఘాలయ టూర్.. ఇదిగో ప్యాకేజీ డిటేయిల్స్

Anand Sai HT Telugu
Oct 16, 2022 10:47 PM IST

IRCTC Tour From Hyderabad : హనీమూన్ వెళ్లాలి అనుకున్నా.. కుటుంబంతో కలిసి ఎంచక్కా ఎంజాయ్ చేయాలనుకున్నా ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. మెస్మరైజింగ్ మేఘాలయ అండ్ అస్సాం పేరుతో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unsplash)

ఫ్యామిలీతో కలిసి కూల్ ప్లేస్ లో ఎంజాయ్ చేయాలనుకునేవారికి ఐఆర్‌సీటీసీ(IRCTC) గుడ్ న్యూస్ చెప్పింది. మెస్మరైజింగ్ మేఘాలయ అండ్ అస్సాం టూర్(MESMERIZING MEGHALAYA AND ASSAM) పేరుతో ప్యాకేజీని అందిస్తోంది. ఈ ప్యాకేజీలో మెుత్తం 5 రాత్రులు, 6 రోజులు ఫుల్ గా ఎంజాయ్ చేయోచ్చు. చిరపుంజి, గువాహతి(GUWAHATI), షిల్లాంగ్(SHILLONG) లాంటి ప్లేస్ లు కవర్ అవుతాయి. 2023 ఫిబ్రవరి 11న టూర్ అందుబాటులో ఉంది.

మేఘాలయ, అస్సాంలోని టూరిస్టు ప్లేస్ లను చూడాలి అనుకునేవారు ఈ ప్యాకేజీని ఉపయోగించుకోవచ్చు. చిరపుంజి(CHERRAPUNJEE), గువాహతి, షిల్లాంగ్ లాంటి ప్రాంతాలు ఎన్నో చూడొచ్చు. 2023 ఫిబ్రవరి 11న ఫస్ట్ డే ఉదయం హైదరాబాద్‌లో ఫ్లైట్ ఎక్కాలి. మధ్యాహ్నం గువాహతికి చేరుకుంటారు. అక్కడి నుంచి షిల్లాంగ్ తీసుకెళ్తారు. షిల్లాంగ్ లోకల్ మార్కెట్ చూడొచ్చు. నైట్ షిల్లాంగ్‌లోనే ఉండాలి.

ఆ తర్వాత రెండో రోజు.. చిరపుంజి ట్రిప్ తీసుకెళ్తారు. మార్గమధ్యంలో ఎలిఫాంటా ఫాల్స్(Elephanta Falls) చూపిస్తారు. రాత్రికి షిల్లాంగ్‌లోనే బస చేయాల్సి ఉంటుంది. మూడో రోజు ఉదయం మావ్లిన్‌నాంగ్ వెళ్లాలి. లివింగ్ రూట్ బ్రిడ్జ్, దావ్కీ లేక్ సందర్శించొచ్చు. సాయంత్రానికి షిల్లాంగ్ కి వస్తారు. నాలుగో రోజు ఉదయం డాన్ బోస్కో మ్యూజియం, వార్డ్స్ లేక్ తీసుకెళ్తారు.

ఐదో రోజు కామఖ్య(Kamakhya Temple) ఆలయం చూపిస్తారు. తర్వాత హోటల్ కు వస్తారు. బ్రేక్ ఫాస్ట్ చేసి.. అస్సాం స్టేట్ మ్యూజీయం(Assam State Museum) చూడొచ్చు. సాయంత్రంపూట బ్రహ్మపుత్ర నదిని చూపిస్తారు. నైట్ స్టే గువాహతిలోనే ఉంటుంది. మరుసటి రోజు అంటే 6వ రోజు అల్పాహారం చేసి.. హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి. ఆ తర్వాత గువాహతి ఎయిర్‌పోర్టు(Airport)కు మధ్యాహ్నం ఒంటిగంటకు చేరుకుంటారు. సాయంత్రం వరకు హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.

ఈ ప్యాకేజీలో ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.33250, డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.35000గా ఉంది. ఒకవేళ సింగిల్ ఆక్యుపెన్సీ కావాలి అనుకుంటే..రూ.40800 చెల్లించాలి. టూర్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్ సైట్లో చూడొచ్చు.

IPL_Entry_Point