తెలుగు న్యూస్  /  Telangana  /  Irctc Tourism Announced Gujarat Tour Package From Hyderabad Full Details Are Here

IRCTC Hyd Gujarat Tour: హైదరాబాద్ టు ద్వారక, సోమ్‌నాథ్‌ - టూర్ తేదీ, ధరలివే

01 September 2022, 11:17 IST

    • hyderabad gujarat tour package:హైదరాబాద్ నుంచి గుజరాత్ టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.
హైదరాబాద్ గుజరాత్ టూర్,
హైదరాబాద్ గుజరాత్ టూర్, (irctc tourism)

హైదరాబాద్ గుజరాత్ టూర్,

irctc tourism announced gujarat tour package: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా హైదరాబాద్ నుంచి గుజరాత్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. SUNDAR SAURASHTRA పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ట్రైన్ జర్నీ ద్వారా సాగే ఈ టూర్ లో... పలు పర్యాటక ప్రాంతాలను చూపించనుంది. అహ్మదాబాద్, ద్వారక, రాజ్ కోట్, సోమ్‌నాథ్‌, వడోదరతో పాటు పలు ప్రాంతాలు కవర్ అవుతాయి.

ట్రెండింగ్ వార్తలు

2 may 2024 హైదరాబాద్ వాతావరణం ఎలా ఉంటుంది? పూర్తి సమాచారం తెలుసుకోండి

Erravalli Farmers: వరి వెదసాగు పద్ధతితో సిరులు పండిస్తున్న ఎర్రవల్లి రైతులు, వెదజల్లే పద్ధతిలో అధిక దిగుబడులు..

Jagtial Crime : జగిత్యాలలో దారుణం, కోడలి మెడ నరికి హత్య చేసిన మామ

Warangal Kidnap : వరంగల్ లో వడ్డీ వ్యాపారి దారుణం, అప్పు తీసుకున్న వ్యక్తి కిడ్నాప్-రూ.28 లక్షలకు బలవంతపు సంతకాలు

hyderabad -gujarat tour: ఈ నెల సెప్టెంబర్ 7వ తేదీన ఈ టూర్ అందుబాటులో ఉంది. ప్రతి బుధవారం తేదీల్లో ఈ టూర్ ను ఆపరేట్ చేసున్నారు. 7 రాత్రులు, 8 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.

Day 1 Wednesday: ప్రయాణికులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకోవాలి. మధ్యాహ్నం 3 గంటలకు పోరుబందర్ ఎక్స్ ప్రెస్ బయల్దేరుతుంది. రాత్రి మొత్తం జర్నీ ఉంటుంది.

Day 2 Thursday: ఉదయం వడోదర స్టేషన్ కు చేరుకుంటారు. హోటల్ కి వెళ్లిన తర్వాత... స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహాన్ని సందర్శిస్తారు. రాత్రి వడోదరలోనే బస చేస్తారు.

Day 3 Friday: హోటల్ నుంచి చెక్ అవుట్ అయిన తర్వాత... లక్ష్మీ విలాస్ ప్యాలెస్ కు వెళ్తారు. ఆ తర్వాత అహ్మాదాబాద్ కు పయనమవుతారు. అక్కడ ఉన్న అక్షరదామం ఆలయాన్ని దర్శించుకుంటారు. రాత్రి అహ్మాదాబాద్ లోనే బస చేస్తారు.

Day 4 Saturday: హోటల్ నుంచి చెక్ అవుట్ అయిన తర్వాత... సబర్మతి ఆశ్రయంకు చేరుకుంటారు. అక్కడ్నుంచి రాజ్ కోట్ కు వెళ్తారు. మధ్యాహ్నం హెటల్ కి వెళ్లిన తర్వాత... వ్యాస్టన్ మ్యూజియంను సందర్శిస్తారు. గాంధీ మ్యూజియం, స్వామి నారాయణ్ ఆలయాన్ని దర్శించుకుంటారు. రాత్రి రాజ్ కోట్ లోనే బస చేస్తారు.

Day 5 Sunday: హోటల్ నుంచి ద్వారకా చేరుకుంటారు. ఆ తర్వాత జామ్ నగర్ కు వెళ్తారు. తిరిగి ద్వారకకు చేరుకొని రాత్రి ఇక్కడే బస చేస్తారు.

Day 6 Monday: ద్వారకాదిశ్ ఆలయానికి వెళ్తారు. చెక్ అవుట్ అయిన తర్వాత... సోమ్‌నాథ్‌ ఆలయాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం సమయానికి పోరుబందర్ కు చేరుకుంటారు. రాత్రి వరకు పోరుబందర్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు.

Day 7 Tuesday: అర్ధరాత్రి 12.20 గంటలకు ట్రైన్ సికింద్రాబాద్ బయల్దేరుతుంది.

Day 8 Wednesday: ఉదయం 08.20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

ధరలివే.....

hyd magical kerala tour cost: సింగిల్ షేరింగ్ కు రూ. 51,570 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 28,830 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.22,230 గా ఉంది. 3AC కోచ్ లో ఈ ధరలు ఉంటాయి. పూర్తి వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చూసుకోవచ్చు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, వీసా ఛార్జీలు, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.

<p>ధరల వివరాలు</p>

NOTE:

లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.

టాపిక్