తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Irctc Shirdi Tour Package : బడ్జెట్ ధరలో హైదరాబాద్ టూ షిరిడీ టూర్ ప్యాకేజీ

IRCTC Shirdi Tour Package : బడ్జెట్ ధరలో హైదరాబాద్ టూ షిరిడీ టూర్ ప్యాకేజీ

Anand Sai HT Telugu

30 August 2022, 14:30 IST

google News
    • Hyderabad To Shirdi IRCTC Tour Package : షిరిడీ వెళ్లాలకునేవారికి ఐఆర్‌సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి అందుబాటు ధరలో ప్యాకేజీ అందిస్తోంది. ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
షిరిడీ టూర్ ప్యాకేజీ
షిరిడీ టూర్ ప్యాకేజీ (unplash)

షిరిడీ టూర్ ప్యాకేజీ

ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీలు.. సామాన్యులకు అందుబాటు ధరలో ఉంటున్నాయి. కొన్ని ప్రదేశాలకు వెళ్లాలనుకునేవారికి.. ఈ ప్యాకేజీలు ఎంతగానో ఉపయోగపడతాయి. తక్కువ ధరలో వెళ్లి రావొచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఐఆర్‌సీటీసీ తీసుకెళ్లి.. తీసుకొస్తుంది. షిరిడీకి ఓ ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి వెళ్లి రావొచ్చు. సాయి సన్నిధి పేరుతో ఈ ప్యాకేజీని ఆఫర్ చేస్తోంది ఐఆర్‌సీటీసీ. ఈ టూర్ కు సంబంధించిన వివరాలివే..

SAI SANNIDHI EX HYDERABAD : ఐఆర్‌సీటీసీ సాయి సన్నిధి పేరిట టూర్ ప్యాకేజీ అందిస్తోంది. షిరిడీ వెళ్లాలనుకునేవారి కోసం 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. రైలు మార్గంలో షిరిడీకి తీసుకెళ్లి సాయిబాబా దర్శనానికి ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో షిరిడీలో సాయిబాబా దర్శనం ఉంటుంది. అంతేకాదు శనిశిగ్నాపూర్ కూడా వెళ్లి రావొచ్చు. ప్రతీ బుధవారం ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉండేలా ఐఆర్‌సీటీసీ ప్లాన్ చేసింది. అయితే ఈసారి సెప్టెంబర్ 14న ఉంది.

IRCTC Shirdi Tour Package : ఐఆర్‌సీటీసీ టూరిజం షిరిడీ టూర్ ప్యాకేజీ మొదటి రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రారంభమవుతుంది. సాయంత్రం 06.50 గంటలకు రైలు ఉంటుంది. నైట్ అంతా ప్రయాణం చేయాలి. రెండో రోజు ఉదయం 07.10 గంటలకు నాగర్‌సోల్ వెళ్తుంది. ఆ తర్వాత షిరిడీకి వెళ్లాలి. హోటల్‌ వెళ్లిన తర్వాత.. షిరిడీ ఆలయ సందర్శనకు వెళ్లాల్సి ఉంటుంది. సాయంత్రం 4 గంటలకు రూమ్ చెకౌట్ చేయాలి. ఆ తర్వాత.. శనిశిగ్నాపూర్ సందర్శనకు వెళ్లాలి. అక్కడ నుంచి 120 కిలో మీటర్ల దూరంలో ఉన్న నాగర్ సోల్ రైల్వే స్టేషన్ తీసుకొస్తారు. రాత్రి 8:30 గంటలకు ట్రైన్ ఉంటుంది. మూడో రోజు ఉదయం 8.50 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

ఇక టూర్ ప్యాకేజీ ధర చూసుకుంటే.. స్టాండర్డ్ క్లాస్‌లో నలుగురి నుంచి ఆరుగురు ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.3700, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.3170 చెల్లించాల్సి ఉంటుంది. ఒకరి నుంచి ముగ్గురు బుక్ చేసుకుంటే సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.8510, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.4840, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.3710గా ధర నిర్ణయించారు.

కంఫర్ట్ క్లాస్‌లో నలుగురి నుంచి ఆరుగురు ఈ ప్యాకేజీ బుక్ చేసుకుంటే డబుల్ ఆక్యుపెన్సీకి రూ.3700, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.3170 చెల్లించాలి. ఒకరి నుంచి ముగ్గురు బుక్ చేసుకుంటే సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.8510గా ఉంది. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.4840, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.3710గా నిర్ణయించారు.

లంచ్, డిన్నర్, ఎంట్రెన్స్ టికెట్స్, టూర్ గైడ్ ఈ ప్యాకేజీలో అందుబాటులో ఉంటాయి. ఏదైనా వ్యక్తిగత ఖర్చులు ఉంటే మీరు పెట్టుకోవాలి. ఈ టూర్ వెళ్లేవారు కొవిడ్ నిబంధనలు పాటించాలి. తప్పుకుండా ఆర్టీపీసీఆర్ కరోనా నెగెటివ్ రిపోర్టు ఉండాలి.

తదుపరి వ్యాసం