తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Rains : హైదరాబాద్ లో దంచికొడుతున్న వర్షం

Hyderabad Rains : హైదరాబాద్ లో దంచికొడుతున్న వర్షం

HT Telugu Desk HT Telugu

08 September 2022, 14:30 IST

google News
    • Rains In Hyderabad : భాగ్యనగరంలో వర్షం దంచికొడుతుంది. బుధవారం నుంచి హైదరాబాద్ లో విపరీతంగా వానలు పడుతున్నాయి. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి.
హైదరాబాద్ లో వర్షం
హైదరాబాద్ లో వర్షం

హైదరాబాద్ లో వర్షం

తెలంగాణలో రెండు రోజులు వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం పడుతుంది. నగరంలో బుధవారం నుంచి అకస్మాత్తుగా వర్షం కురవడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రానున్న మూడు రోజుల్లో నగరంలో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంది. నగరంలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయి.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు మూసీ నదిలో ప్రవాహం పెరుగుతోంది. ముసారాంబాగ్ వంతెనపై రాకపోకలు నిలిచిపోయాయి. మెహిదీపట్నం, గోషామహల్, జియాగూడ, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, ఖైరతాబాద్, మెహిదీపట్నం, బంజారాహిల్స్‌, జుబ్లీహిల్స్ లోనూ వర్షం కురుస్తోంది. బహదూర్‌పురా, ఫలక్ నుమా, సికింద్రాబాద్, ప్యాట్నీసెంటర్, బేగంపేట, అల్వాల్‌లో వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. చిలకలగూడ, తిరుమలగిరి, బోయిన్‌పల్లి, మారేడుపల్లి, ఓయూక్యాంపస్, హబ్సీగూడ, నాచారం, మల్లాపూర్ ప్రాంతాల్లో వర్షం పడుతోంది.

తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. వీటిలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాలు ఉన్నాయి. ఇక నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబ్ నగర్, జనగాం, సిద్ధిపేట, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఇక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.

Rains in Telugu States: గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మోసర్తు వర్షాలు కురుస్తుండగా...మరో రెండు మూడు రోజులు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని ఆంధ్రప్రదేశ్ విపత్తుల శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

తదుపరి వ్యాసం