Rain In Hyderabad : భాగ్యనగరంలో భారీ వర్షం
Rains In Telangana : భాగ్యనగరంలో భారీ వర్షం పడుతోంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా వరుణుడు కుండపోత వర్షం కురిపిస్తున్నాడు. ఈ కారణంగా రహదారులన్నీ జలమయమయ్యాయి.
తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. హైదరాబాద్ నగరంలో భారీగా వర్షం కురుస్తోంది. కుండపోత వర్షంతో నగర ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారులు జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.
భాగ్యనగరంలోని జూబ్లీబిల్స్, బంజారాహిల్స్, మెహిదీపట్నం, గోషామహల్, మంగళ్‌హాట్, ఆసిఫ్‌నగర్, జియాగూడ పంజాగుట్ట, అమీర్‌పేట్, ఖైరతాబాద్, ఫలక్‌నుమా, చంద్రాయణగుట్ట, సికింద్రాబాద్, ప్యాట్నీసెంటర్, బేగంపేట, అల్వాల్, చిలకలగూడ, తిరుమలగిరి, బోయిన్‌పల్లి, మారేడుపల్లి, ఉప్పల్ తోపాటు పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతుంది. ఈ కారణంగా రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరింది. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.
Rains in Telugu States : దక్షిణ, ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నాయి. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరుగాను, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇదే సమయంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్, హన్మకొండ, జనగాం, రంగారెడ్డి, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాలో అక్కడకక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇప్పటికే రెండ్రోజులుగా కోస్తాంధ్ర, రాయలసీమల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కృష్ణా, పెన్నార్ బేసిన్‌లలోని ఎగువ ప్రాంతాలతో పాటు ఏపీలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రిజర్వాయర్‌లకు భారీగా ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు రెండు దశాబ్దాల తర్వాత పొంగిపొర్లుతున్నాయని అధికారులు తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్ట్‌కు(Srisailam Project), నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతుంది. దాదాపు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి.
సంబంధిత కథనం