NEET Topper List 2022: నీట్ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థికి 5వ ర్యాంక్
neet topper list 2022: నీట్(యూజీ) 2022 ఫలితాలు వచ్చేశాయి. ఈ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. 711 మార్కులతో సిద్ధార్థరావు అనే విద్యార్థి జాతీయస్థాయిలో 5వ ర్యాంక్ సాధించాడు.
NEET Results 2022: నీట్ (యూజీ) 2022 ఫలితాలు బుధవారం అర్ధరాత్రి రాత్రి విడుదలయ్యాయి. మొత్తం 17,64,571 మంది అభ్యర్థులు జులై 17న పరీక్ష రాయగా అందులో 9,93,069(56.27శాతం) మంది అర్హత సాధించారు.
NEET Exam Toppers: రాజస్థాన్‌కు చెందిన తనిష్క మొదటి ర్యాంక్ సాధించగా.. ఢిల్లీకి చెందిన వత్స ఆశిష్ బాత్రా రెండో ర్యాంకు సాధించాడు. కర్ణాటకకు చెందిన హృషికేశ్ నాగభూషణ్ గంగూలీ, రుచా పవోషీ వరుసగా మూడు, నాలుగు ర్యాంకులు కైవసం చేసుకున్నారు. మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన అభ్యర్థులూ సమానంగా 99 పర్సెంటైల్ సాధించారు. ఈ ఏడాది 18.72 లక్షల మంది నీట్‌కు దరఖాస్తు చేసుకోగా, 9.93 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు.
5వ ర్యాంక్
errabelly sidharth rao securing the all India 5th rank: తెలంగాణకు చెందిన ఎర్రబెల్లి సిద్ధార్థరావు 711 మార్కులతో నీట్ యూజీ ఫలితాల్లో జాతీయస్థాయిలో 5వ ర్యాంకు సాధించారు. చప్పిడి లక్ష్మీచరిత 705 మార్కులు పొంది ఆలిండియా 37 ర్యాంకు సాధించింది. కే జీవన్‌కుమార్‌రెడ్డి 705 మార్కులు పొంది ఆలిండియా 41 ర్యాంకు సాధించాడు. వీ అతిథి 700 మార్కులు పొంది 50వ ర్యాంకు కైవసం చేసుకున్నది. సీహెచ్ యశస్విని 700 మార్కులు పొంది ఆలిండియా 52వ ర్యాంకు సాధించింది. ఫిమేల్ టాప్ 20 ర్యాంకుల్లో లక్ష్మీచరిత, అతిథి చోటుదక్కించుకున్నారు. తెలంగాణ నుంచి 61,207 మంది అభ్యర్థులకుగాను, పరీక్షకు 59,296 మంది హాజరయ్యారు. వీరిలో 35,148 మంది అర్హత సాధించారు.
ఇక 710 మార్కులతో ఏపీకి చెందిన మట్టా దుర్గా సాయికీర్తి తేజ 12వ ర్యాంకు, 706 మార్కులతో నూని వెంకట సాయి వైష్ణవి 15వ ర్యాంకు, 705 మార్కులతో గుల్లా హర్షవర్ధన్‌నాయుడు 25వ ర్యాంకు సాధించారు.
నీట్ యూజీ 2022 రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోవాలి
step 1: నీట్ అధికారిక వెబ్ సైట్ సందర్శించాలి.
step 2: హోం పేజీ సందర్శించి నీట్ యూజీ స్కోర్ కార్డ్ డౌన్ లోడ్ లింక్ క్లిక్ చేయాలి.
step 3: మీ లాగిన్ డీటైల్స్ ఇచ్చి మీ రిజల్ట్స్ చెక్ చేసుకోవాలి.
step 4: భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ తీసిపెట్టుకోవాలి.
NOTE:
ఈ లింక్ పై క్లిక్ చేసి నీట్ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
సంబంధిత కథనం