HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Rain Alert : తెలంగాణకు మరోసారి భారీ వర్ష సూచన.. 19 జిల్లాలకు అలెర్ట్

Telangana Rain ALERT : తెలంగాణకు మరోసారి భారీ వర్ష సూచన.. 19 జిల్లాలకు అలెర్ట్

07 September 2024, 16:45 IST

    • Telangana Rain ALERT : తెలంగాణను వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇటీవల కురిసన వర్షాలు, వరదల నుంచి కోలుకోకముందే.. మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎక్కువ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంటున్నారు.
తెలంగాణకు మరోసారి భారీ వర్ష సూచన (Photo Source: @Kavalichandrak1)

తెలంగాణకు మరోసారి భారీ వర్ష సూచన

తెలంగాణకు మరోసారి భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. భద్రాద్రి, ఖమ్మం, భూపాలపల్లి, మహబూబాబాద్, మెదక్, ములుగు, సూర్యాపేట జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని చెబుతున్నారు. ఆదిలాబాద్, కామారెడ్డి, కరీంనగర్, మంచిర్యాల, నిర్మల్, నల్గొండ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. నిజామాబాద్, సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

దంచికొట్టిన వాన..

శుక్రవారం రాత్రి వరంగల్, హనుమకొండ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వర్షం రావడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చెరువులన్నీ నిండాయి. మత్తళ్లు పోస్తున్నాయి. దీంతో వాగులు పొంగి పొర్లుతున్నాయి. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

హైదరాబాద్‌లో..

హైదరాబాద్‌లో శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిశాయి. గచ్చిబౌలి లింగంపల్లి, టోలిచౌకి, మెహిదీపట్నం, గోల్కొండ, గండిపేట్, రాజేంద్రనగర్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, చార్మినార్ ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. పశ్చిమ, సెంట్రల్, సౌత్ హైదరాబాద్‌పై వర్షాల ప్రభావం ఉంది. ఇటు ఎల్బీ నగర్, హయత్ నగర్ ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది.

అల్పపీడనం..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మధ్య బంగాళాఖాతం, అనుకుని ఉన్న ఉత్తర బంగాఖాఖాతం మీద ఉందని ఐఎండీ వివరించింది. దానికి అనుబంధంగా ఉపరితల అవర్తనం సముద్రమట్టానికి సగటున 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపింది. సెప్టెంబర్ 9వ తేదీ నాటికి ఉత్తర ఒడిశా, బంగ్లాదేశ్ తీరంలోని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనంగా మారుతుందని అంచనా వేసింది.

ఏపీలో..

ఇవాళ, రేపు, ఉత్తర, దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. రాయలసీమ జిల్లాల్లో ఈ మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతాయని ఐఎండీ స్పష్టం చేసింది. బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది.

తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్