AP TG Weather Updates : ఐఎండీ అలర్ట్... తెలంగాణలో ఆ 2 రోజులు అతి భారీ వర్షాలు! 5 జిల్లాలకు హెచ్చరికలు-ap and telangana likely to receive heavy rains for four days imd latest updates check here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ap Tg Weather Updates : ఐఎండీ అలర్ట్... తెలంగాణలో ఆ 2 రోజులు అతి భారీ వర్షాలు! 5 జిల్లాలకు హెచ్చరికలు

AP TG Weather Updates : ఐఎండీ అలర్ట్... తెలంగాణలో ఆ 2 రోజులు అతి భారీ వర్షాలు! 5 జిల్లాలకు హెచ్చరికలు

Sep 07, 2024, 06:22 AM IST Maheshwaram Mahendra Chary
Sep 07, 2024, 06:22 AM , IST

  • AP Telangana Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో సెప్టెంబర్ 09, 10 తేదీల్లో అతి భారీ వర్షాలు పడుతాయని హైదారబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. 
CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఏపీ, తెలంగాణలో మరో మూడు నాలుగు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో పాటు ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతోందని ఐఎండీ  వెల్లడించింది. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. 

(1 / 6)

ఇవాళ(07 September) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు,ఎన్టీఆర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. 

(2 / 6)

అదే విధంగా విశాఖ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, అనంతపురం, సత్య సాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.  

(3 / 6)

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మధ్య బంగాళాఖాతం, అనుకుని ఉన్న ఉత్తర బంగాఖాఖాతం మీద ఉందని ఐఎండీ వివరించింది. దానికి అనుబంధంగా ఉపరితల అవర్తనం సముద్రమట్టానికి సగటున 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపింది. సెప్టెంబర్ 9వ తేదీ నాటికి ఉత్తర ఒడిశా, బంగ్లాదేశ్ తీరంలోని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనంగా మారుతుందని అంచనా వేసింది.

(4 / 6)

తెలంగాణలో ఇవాళ (శనివారం) పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. సెప్టెంబర్ 8 నుంచి మళ్లీ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

(5 / 6)

సెప్టెంబర్ 9వ తేదీన ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. సెప్టెంబర్ 10వ తేదీన కూడా పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 

(6 / 6)

ఇతర గ్యాలరీలు