AP TG Weather Report : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, ఆవర్తన ప్రభావం - మరో 4 రోజులు భారీ వర్షాలు, తాజా బులెటిన్ ఇదే..!
- AP Telangana Rains : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల అవర్తనం కూడా కొనసాగుతోందని ఐఎండీ తాజా బులెటిన్ లో పేర్కొంది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో నాలుగైదు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి….
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

(1 / 5)
పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని సరిహద్దు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు ఐఎండీ తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎగువన విస్తరించి ఉన్నట్లు పేర్కొంది. ఇది వచ్చే రెండు రోజుల్లో ఉత్తరం దిశ వైపు నెమ్మదిగా కదులుతుందని తెలిపింది.
(2 / 5)
ఇవాళ, రేపు, ఎల్లుండి ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతాయని అంచనా వేసింది. పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని పేర్కొంది. కొన్నిచోట్ల బలమైన ఉపరితల గాలులు వీస్తాయని తాజా బులెటిన్ లో పేర్కొంది.
(3 / 5)
ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఐఎండీ వెల్లడించింది. రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వివరించింది.
(4 / 5)
ఇవాళ తెలంగాణలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.
(5 / 5)
రేపు ఆదిలాబాద్ , మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది, సెప్టెంబర్ 9వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.
ఇతర గ్యాలరీలు