HYDRAA : 'హైడ్రా' చేతికి సరికొత్త అధికారాలు..! ముఖ్యమైన 10 అంశాలు
17 October 2024, 12:32 IST
- హైడ్రాకి మరిన్ని అధికారాలు కట్టబెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఇక నుంచి జీహెచ్ఎంసీ ఆస్తులను కూడా పరిరక్షించనుంది. జీహెచ్ఎంసీకి చెందిన రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ బాడీలు, బహిరంగ ప్రదేశాలు, పబ్లిక్ పార్కులు మొదలైన పబ్లిక్ ఆస్తలు ఆక్రమణలకు గురికాకుండా రక్షించడానికి హైడ్రాకి అధికారాలు దక్కాయి.
హైడ్రాకు మరిన్ని అధికారాలు...!
హైడ్రాకు మరిన్ని అధికారాలు...!
హైడ్రాకు మరిన్ని బాధ్యతలను నిర్వర్తించనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులను జారీ చేసింది.జీహెచ్ఎంసీతో పాటు ఓఆర్‌ఆర్ వరకూ ఉన్న 27 పురపాలికల్లో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, విపత్తు నిర్వహణకు అవసరమైన అధికారాలను హైడ్రాకు కట్టబెట్టింది. ఈ మేరకు బుధవారం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్ ఉత్తర్వులు ఇచ్చారు.
తాజా ఉత్తర్వులతో జీహెచ్ఎంసీకి చెందిన రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ బాడీలు, బహిరంగ ప్రదేశాలు, పబ్లిక్ పార్కులు మొదలైన పబ్లిక్ ఆస్తలు ఆక్రమణలకు గురికాకుండా హైడ్రా రక్షించనుంది. జీహెచ్‌ఎంసీ చట్టం -1955 కింద అవసరమైన అధికారాలను హైడ్రాకు అప్పగిస్తున్నట్లు’ ఉత్తర్వుల్లో వివరించారు.
హైడ్రాకు కొత్త బాధ్యతలు - 10 ముఖ్యమైన అంశాలు:
- భాగ్యనగరం పరిధిలోని చెరువులు, నాలాల రక్షణే ప్రధాన ధ్యేయంగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎస్సెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా)ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిదే. ఈ హైడ్రాకు విస్తృతాధికారాలు కల్పిస్తూ రాష్ట్ర సర్కార్ ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చింది.
- తాజాగా హైడ్రాకు తెలంగాణ ప్రభుత్వం మరికొన్ని అధికారాలను కట్టబెట్టింది. జీహెచ్ ఎంసీ(గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) అధికారాలను హైడ్రాకు బదిలీ చేస్తూ మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
- ప్రభుత్వం ఇచ్చిన తాజా ఉత్తర్వులతో జీహెచ్ఎంసీకి చెందిన రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ బాడీలు, బహిరంగ ప్రదేశాలు, పబ్లిక్ పార్కులు మొదలైన పబ్లిక్ ఆస్తలు ఆక్రమణలకు గురికాకుండా హైడ్రా రక్షించనుంది.
- జీహెచ్‌ఎంసీ చట్టం -1955 కింద అవసరమైన అధికారాలను హైడ్రాకు అప్పగిస్తున్నట్లు’ ఉత్తర్వుల్లో వివరించారు. హైడ్రాకు బదలాయించిన అధికారాలను వివరిస్తూ జీహెచ్‌ఎంసీ చట్టం1955లో ప్రత్యేకంగా 94(బీ) సెక్షన్‌ను చేరుస్తున్నారు.
- హైడ్రా విషయంలో ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ కు అనుగుణంగా బుధవారం మున్సిపల్ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఫలితంగా ఇప్పటి నుంచి హైడ్రా చేపట్టబోయే అన్ని పనులకు చట్టబద్ధత లభించనుంది.
- తాజా అధికారాల ప్రకారం… ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం ఇకపై హైడ్రా నోటిసులు జారీ చేయనుంది.
- వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ బిల్లుకు అసెంబ్లీ ఆమోదముద్ర వేస్తే… హైడ్రాకు సంపూర్ణ అధికారాలు దక్కుతాయి.
- హైడ్రా ఏర్పాటు జీవో 99తో పాటు చర్యలపై హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. హైడ్రా చర్యలను సవాలు చేస్తూ దాఖలైన వేర్వేరు వ్యాజ్యాలపై ఇటీవలే విచారించిన న్యాయస్థానం… హైడ్రాను ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది.
- హైడ్రా విషయంలో స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు పలుమార్లు నిరాకరించింది. హైడ్రా చర్యలు చట్ట నిబంధనలకు లోబడి ఉండాలని కూడా ప్రభుత్వానికి స్పష్టం చేస్తూ వచ్చింది.
- హైడ్రాను జీవో ద్వారా ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం… ఆ తర్వాత ఆర్డినెెన్స్ కూడా ఇచ్చింది. కేబినెట్ లో చర్చించి ఆమోదముద్ర వేసింది. రాష్ట్ర సర్కార్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా ఆమోదం తెలిపారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో హైడ్రాపై విస్తృత చర్చ జరిగే అవకాశం ఉంది. మున్సిపల్ చట్టాన్ని సవరించనున్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.