(1 / 6)
నాంపల్లిలో ఉన్న గన్‌పార్క్ నుంచి జీహెచ్‌ఎంసీ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు కాంగ్రెస్ నేతలు. జీహెచ్‌ఎంసీ కార్యాలయం ముట్టడికి యత్నించారు.
(2 / 6)
ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన ముఖ్య నేతలు అందరూ పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంజన్‌కుమార్ యాదవ్, అనిల్ యాదవ్, విజయారెడ్డితో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. . వరద బాధితులకు రూ.10వేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
(3 / 6)
జీహెచ్ఎంసీ కార్యాలయ ముట్టడికి వెళ్లేందుకు సిద్ధమైన ఎన్ఎస్ యూఐ నేతలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో విద్యార్థులకు, పోలీసులకు మధ్య. తోపులాట చోటు చేసుకుంది. ఓ దశలో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వారందర్నీ అదుపులోకి తీసుకొని… పోలీస్ స్టేషన్ కు తరలించారు.
(twitter)(4 / 6)
జీహెచ్‌ఎంసీ కార్యాలయంలోకి వెళ్లిన కొందరు కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. ఆఫీసు లోపల బైఠాయించి నేతలు నిరసన వ్యక్తం చేశారు. వరద బాధితులకు రూ.10వేల చొప్పున పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు.
(5 / 6)
జీహెచ్‌ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ కు వినతి పత్రం ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. అయితే కమిషన్ వ్యవహరించిన తీరు సరిగా లేదని నేతలు ఆరోపించారు. తాము వినతిపత్రం అందించేందుకు వెళ్లగా.. తీసుకునేందుకు ఆయన నిరాకరించారని ఆరోపించారు. ఆయన పేషీ ముందు సీనియర్ నేతలు మల్లు రవి, వి.హనుమంతరావుతో పాటు పలువురు బైఠాయించారు.
(6 / 6)
నగరంలోని చాలా మంది నేతలను జీహెచ్ఎంసీ ఆఫీస్ కు చేరుకోకుండా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇతర గ్యాలరీలు