BRAOU Admissions 2024 : అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ ఎంబీఏ నోటిఫికేషన్ విడుదల - ముఖ్య తేదీలు
31 October 2024, 14:49 IST
- BRAOU MBA Entrance Test 2024 : అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ నుంచి ఎంబీఏ ప్రవేశాలకు నోటిఫికేెషన్ జారీ అయింది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://www.braouonline.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
ఏంబీఏ(MBA) కోర్సుల్లో ప్రవేశాలు - అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ నోటిఫికేషన్
అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ప్రవేశాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఎంబీఏ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ 15వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలు తెలుసుకునేందుకు https://www.braouonline.in/ వెబ్ సైట్ ను సందర్శించాలి.
ముఖ్య వివరాలు:
2024-25 విద్యా సంవత్సరానికి గాను ఎంబీఏ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమంలో ఉంటుంది. ఇందుకు సంబంధించి పరీక్ష అంబేడ్కర్ వర్శిటీ ప్రధాన కేంద్రం జూబ్లీహిల్స్ లో జరుగుతుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ. 1500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 1000 చెల్లించాలి.
ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఆన్ లైన్ లో చెల్లించాల్సి ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. https://www.braouonline.in/MBAHHCM/Login.aspx లింక్ పై క్లిక్ చేసి నేరుగా ఎంబీఏ ఎంట్రెన్స్ పరీక్ష కోసం అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ ప్రవేశాలకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే సమీపంలోని అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని లేదా విశ్వవిద్యాలయ హెల్ప్ డెస్క్ నంబర్లు 7382929570/580, 040-23680222/333/444/555, టోల్‌ఫ్రీ నంబర్ 18005990101 లో సంప్రదించవచ్చని అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
డిగ్రీ, పీజీ అడ్మిషన్లు:
హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో ఆన్ లైన్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన వారి నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే ఈ గడువును మరోసారి పెంచారు. ఈ తేదీని నవంబర్ 15వ తేదీకి పొడిగించారు.
అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ ద్వారా ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో చేరవచ్చు. ఇక పీజీలో చూస్తే ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంబీఏ కోర్సులతో పాటు పీజీ డిప్లొమాలో బీఎల్‌ఐఎస్సీ (BLISc), ఎంఎల్‌ఐఎస్సీ (MLISc) సహా పలు సర్టిఫికేట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే సమయంలో స్టడీ సెంటర్లను జాగ్రత్తగా ఎంచుకోవాలి. మీకు దగ్గరగా, అనుకూలంగా ఉండే ప్రాంతాల వివరాలను వెబ్ సైట్ లో చూడొచ్చు. డిగ్రీ కోర్సుల్లో కూడా అనేక కాంబినేషన్లు ఉన్నాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వీటిని ఎంచుకోవచ్చు. https://www.braouonline.in/ వెబ్ సైట్ లోకి వెళ్తే పూర్తి వివరాలను పొందవచ్చు.