Govt School Students: ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్నారా! అయితే ఈ పోటీలు మీ కోసమే.. కౌశల్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం-studying in government schools these competitions are for you cash prizes at district and state level ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Govt School Students: ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్నారా! అయితే ఈ పోటీలు మీ కోసమే.. కౌశల్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం

Govt School Students: ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్నారా! అయితే ఈ పోటీలు మీ కోసమే.. కౌశల్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం

Govt School Students: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల కోసం భారతీయ విజ్ఞానమండలి, సైన్స్‌ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యంలో కౌశల్ 2024 పేరుతో రాష్ట్రస్థాయి సైన్స్‌ ప్రతిభాన్వేషణ పోటీలను నిర్వహిస్తున్నారు. గెలుపొందిన వారికి జిల్లా, రాష్ట్ర స్థాయిలో నగదు బహుమతులు అందిస్తారు.

కౌశల్ 2024 పోటీలకు రిజిస్ట్రేషన్

Govt School Students: భారతీయ విజ్ఞాన మండలి మరియు సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కౌశల్ 2024 రాష్ట్రస్థాయి సైన్స్ ప్రతిభాన్వేషణ పోటీలను నిర్వహిస్తున్నారు.

ప్రభుత్వ పాఠశాలలో చదివే 8, 9, 10 విద్యార్థులకు క్విజ్, పోస్టర్ మరియు రీల్స్ విభాగాల్లో పాఠశాల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయిలో పోటీలు నిర్వహిస్తారు. ప్రతి పాఠశాల నుండి క్విజ్ కు తరగతికి ముగ్గురు చొప్పున 9 మంది విద్యార్థులు, పోస్టరు, రీల్స్ కు తరగతికి ఇద్దరు చొప్పున ఆరుగురు విద్యార్థులు పోటీల్లో పాల్గొనవచ్చు.

ఒక్కొక్క పాఠశాల నుండి 15 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొనుటకు అవకాశం ఉంటుంది. ఈ పోటీల్లో పాల్గొనే విద్యార్థులు నవంబర్ 15వ తేదీలోగా https://bvmap.org/koushalRegistration.aspx ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి.

పాఠశాల స్థాయి పరీక్ష ఆన్లైన్‌లో నవంబర్ 20, 21, 22 తేదీల్లో నిర్వహిస్తారు.జిల్లా స్థాయి పోటీ పరీక్ష ఆన్లైన్‌లో డిసెంబర్ 6వ తేదీన, రాష్ట్రస్థాయి పరీక్ష డిసెంబర్ 30వ తేదీన నిర్వహిస్తారు. జిల్లాస్థాయిలో ప్రథమ స్థానం పొందిన విద్యార్థులకు రూ.1500, ద్వితీయ స్థానం పొందిన విద్యార్థులకు రూ.1000 రూపాయలు చొప్పున, అదేవిధంగా రాష్ట్రస్థాయిలో ప్రధమ స్థానం పొందిన విద్యార్థులకు రూ.5000,ద్వితీయ స్థానం పొందిన విద్యార్థులకు రూ.3000, తృతీయ స్థానం పొందిన విద్యార్థులకు రూ.2000 చొప్పున నగదు బహుమతి అందిస్తారు. వీటితో పాటు ప్రశంసా పత్రం,జ్ఞాపికలను అందజేస్తారు.