BR Ambedkar Open University Admissions 2024 : అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, పీజీ,డిప్లోమా ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ఈ గడువు ఇవాళ్టితో(అక్టోబర్ 30) పూర్తి అవుతుంది. అర్హత కలిగిన అభ్యర్థులు https://www.braouonline.in/ వెబ్ సైట్ లోకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
(1 / 7)
హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో ఆన్ లైన్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన వారి నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే ఈ గడువు ఇవాళ్టి(అక్టోబర్ 30)తో పూర్తి కానుంది. ఇప్పటికే పలుమార్లు దరఖాస్తుల గడువు పొడిగించిన నేపథ్యంలో… మరోసారి పొడిగించే అవకాశం లేదని తెలుస్తోంది.
(2 / 7)
అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ ద్వారా ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో చేరవచ్చు. ఇక పీజీలో చూస్తే ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంబీఏ కోర్సులతో పాటు పీజీ డిప్లొమాలో బీఎల్ఐఎస్సీ (BLISc), ఎంఎల్ఐఎస్సీ (MLISc) సహా పలు సర్టిఫికేట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
(3 / 7)
డిగ్రీ ప్రవేశాలకు ఇంటర్ విద్యను పూర్తి చేసి ఉండాలి. పోస్ట్ గ్రాడ్యూయేషన్ కోర్సుల్లో MA, MSc, Mcom ఉన్నాయి. ఈ కోర్సుల్లో చేరాలంటే గ్రాడ్యూయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఇవి కూడా తెలుగు, ఇంగ్లీష్ మీడియాల్లో ఉన్నాయి. ఇక లైబ్రేరియన్ సైన్స్ తో పాటు పలు రకాల డిప్లోమా కోర్సులు కూడా యూనివర్శిటీ ఆఫర్ చేస్తోంది.
(4 / 7)
ఆన్ లైన్ అప్లికేషన్ ఫీజుతో పాటు ట్యూషన్ ఫీజును ఆన్లైన్ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా ఏపీ, టీఎస్ ఆన్లైన్ సెంటర్ ల ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఆయా కోర్సులను బట్టి ఫీజులు ఉంటాయి. అధికారిక సైట్ లో ఆ వివరాలను కూడా పొందుపరిచారు. కేవలం హైదరాబాద్ పరిధిలోనే కాకుండా జిల్లాల్లోనూ స్టడీ సెంటర్లలో కూడా పేర్లు నమోదు చేసుకోవచ్చు. వివరాల కోసం వర్సిటీ హెల్ప్‌లైన్ నెంబర్లు 7382929570, 7382929580, 7382929590 & 7382929600 సంప్రదించవచ్చు,
(5 / 7)
ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే సమయంలో స్టడీ సెంటర్లను జాగ్రత్తగా ఎంచుకోవాలి. మీకు దగ్గరగా, అనుకూలంగా ఉండే ప్రాంతాల వివరాలను వెబ్ సైట్ లో చూడొచ్చు. డిగ్రీ కోర్సుల్లో కూడా అనేక కాంబినేషన్లు ఉన్నాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వీటిని ఎంచుకోవచ్చు. https://www.braouonline.in/ వెబ్ సైట్ లోకి వెళ్తే పూర్తి వివరాలను పొందవచ్చు.