Gurukula Inter Results: ఏపీ బిఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల ఇంటర్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల-ap br ambedkar gurukula inter entrance exam result released ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Gurukula Inter Results: ఏపీ బిఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల ఇంటర్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

Gurukula Inter Results: ఏపీ బిఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల ఇంటర్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

Sarath chandra.B HT Telugu
Apr 03, 2024 06:22 PM IST

Gurukula Inter Results: ఆంధ్రప్రదేశ్‌‌ డా బి.ఆర్‌.అంబేడ్కర్‌ గురుకుల విద్యా సంస్థల్లో APSWREIS ఇంటర్మీడియట్‌ ప్రవేశాల Inter entrance కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి.

ఏపీ అంబేడ్కర్ గురుకులాల్లో  ఇంటర్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
ఏపీ అంబేడ్కర్ గురుకులాల్లో ఇంటర్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

Gurukula Inter Results: ఆంధ్రప్రదేశ్‌‌ డా బి.ఆర్‌.అంబేడ్కర్‌ గురుకుల విద్యా సంస్థల్లో APSWREIS ప్రవేశాల కోసం నిర్వహించినadmission testప్రవేశ పరీక్ష ఫలితాలు Results వెలువడ్డాయి. ర్యాంకులను అంబేడ్కర్‌ గురుకుల విద్యాలయాల వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

డా.బి.ఆర్. అంబేద్కర్ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశ పరీక్షా ఫలితాలను ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి డా. మహేష్ కుమార్ రావిరాల బుధవారం విడుదల చేశారు. తాడేపల్లి లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రవేశ పరీక్షా ఫలితాలను విడుదల చేసిన అనంతరం డా. మహేష్ కుమార్ రావిరాల మాట్లాడుతూ జూనియర్ ఇంటర్ ప్రవేశాలకు రాష్ట్ర వ్యాప్తంగా 40,853 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారని, పరీక్షకు 35,629 మంది విద్యార్థులు హజరయ్యారని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా డా.బి.ఆర్. అంబేద్కర్ గురుకులాల్లో బాలికలకు 9,280 సీట్లు, బాలురకు 4,280 సీట్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ప్రతిభ ఆధారంగా ఆయా కేటగిరీల్లో విద్యార్థులకు అడ్మిషన్లు కల్పిస్తామని చెప్పారు. ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాలతో పాటు ర్యాంకు కార్డుల కోసం అభ్యర్ధులు http.//apbragcet.apcfss.in లో అందుబాటులో ఉంటాయని వివరించారు.

5వ తరగతిలో ప్రవేశాలకు అడ్మిషన్లు…

రాష్ట్రంలోని వివిధ క్యాంపస్‌లలో అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతిలో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. వీటిల్లో బాలికలకు 9,750 సీట్లు, బాలురకు 5,270 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మార్చి 22నుంచి March22 ఆన్ లైన్ విధానంలో మొదటి దశ విద్యార్ధుల ఎంపిక చేస్తున్నట్లు ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్స్‌ కార్యదర్శి వెల్లడించారు.

డా.బి.ఆర్. అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో 2024-2025 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షా ఫలితాలను మార్చి 21న విడుదల చేశారు.

5వ తరగతిలో ప్రవేశాలకు 49,993 మంది విద్యార్ధులు నమోదు చేసుకోగా 10 మార్చి 2024న నిర్వహించిన పరీక్షకు 42,928 మంది విద్యార్ధులు హాజరైనట్లు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా డా.బి.ఆర్.అంబేద్కర్ గురుకులాల్లో బాలికలకు 9,750 సీట్లు, బాలురకు 5,270 సీట్లు అందుబాటులో ఉన్నాయని కార్యదర్శి వివరించారు.

అంబేడ్కర్‌ గురుకుల విద్యాలయాల్లో ర్యాంకుల ఆధారంగా భర్తీ చేయగా మిగిలిన సీట్లను జోన్ల వారీగా స్పాట్ అడ్మిషన్లలో భర్తీ చేస్తారు.

సంబంధిత కథనం