తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bjp Mission 90: తెలంగాణలో 'మిషన్ 90'.. బీజేపీ టార్గెట్ ఇదేనా..?

BJP Mission 90: తెలంగాణలో 'మిషన్ 90'.. బీజేపీ టార్గెట్ ఇదేనా..?

30 December 2022, 7:27 IST

google News
    • Telangana Assembly Elections 2023: వచ్చే ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే ప్రత్యేక ఆపరేషన్ తో ముందుకెళ్తోంది  బీజేపీ. అయితే తాజాగా 'మిషన్ 90'ని తెరపైకి తీసుకువచ్చింది.  ఈ టార్గెట్ తోనే వచ్చే ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది.
అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్
అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ (twitter)

అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్

BJP On Telangana Assembly Elections 2023: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది తెలంగాణ. ఇప్పటికే ప్రధాన పార్టీలు నువ్వా -నేనా అన్నట్లు ముందుకెళ్తున్నాయి. అధికార బీఆర్ఎస్ మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంటే... ఇప్పటికే రెండుసార్లు అధికారానికి దూరమైన తెలంగాణ కాంగ్రెస్...ఈసారి ఎలాగైనా గెలిచాలని చూస్తోంది. ఇదిలా ఉంటే బీజేపీ మాత్రం... తెలంగాణపై సీరియస్ గా ఫోకస్ పెట్టేసింది. గత కొంతకాలంగా ఆ పార్టీ బలపడుతూ వస్తోంది. కీలమైన ఉపఎన్నికలతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటిన కమలనాథులు... వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండాను ఎగరవేయాలని చూస్తున్నారు. ఇందుకోసం పక్కాగా ముందుకెళ్లే సరికొత్త ప్లాన్ ను తెరపైకి తీసుకువచ్చారు.

నిజానికి బీజేపీకి దక్షిణాదిలో కర్ణాటక తర్వాత అత్యంత స్కోప్ కనిపిస్తున్న రాష్ట్రం తెలంగాణ..! గతంలో ఎన్నడు లేని విధంగా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు పార్లమెంట్ స్థానాలు గెలిచి సంచలనం సృష్టించింది. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 1 స్థానానికే పరిమితమైన ఆ పార్టీ... పార్లమెంట్ ఎన్నికలు వచ్చే నాటికి గణనీయంగా పుంజుకుంది. ఈ పరిణామాన్ని లోతుగా పరిశీలించిన కమలదళం.. వెంటనే ప్రత్యేక ఆపరేషన్ షురూ చేసింది. వెంటనే నాయకత్వ పగ్గాలను బండి సంజయ్ కు అప్పగించింది. ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీ చాలా బలపడిందనే చెప్పొచ్చు. కీలకమైన దుబ్బాక, హుజురాబాద్ గెలిచి అధికార బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చింది. ఇక మునుగోడులోనూ గెలిచేంత పని చేసింది. కీలమైన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఫలితంగా తెలంగాణ తామే ప్రత్యామ్నాయం అని చెప్పే ప్రయత్నం గట్టిగా చేసింది. ఈ విషయంలో ఆ పార్టీ నాయకత్వం సక్సెస్ అయిందనే చెప్పొచ్చు. టీ కాంగ్రెస్ లోని అంతర్గత విభేదాలను పక్కగా క్యాష్ చేసుకునే పనిలో పడ్డా బీజేపీ... మరోవైపు అధికార బీఆర్ఎస్ ను ప్రతి విషయంలో టార్గెట్ చేస్తూ వెళ్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలు రానుండటంతో... ప్రత్యేక మిషన్ పేరుతో ముందుకెళ్లాలని నిర్ణయించింది బీజేపీ. ఇందుకు మిషన్ 90 తెలంగాణ 2023 అని పేరు కూడా పెట్టింది. ఈ టార్గెట్ తోనే ఎన్నికలను ఎదుర్కొవాలని చూస్తోంది.

టార్గెట్ 90!

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 90 స్థానాల్లో గెలుపు లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతుంది. మిషన్ 90 టార్గెట్ కూడా ఇదే..! ఇప్పట్నుంచే ప్రజల్లో ఉంటూ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతంపై చూసే అంశాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల స్థానాల్లో బలమైన అభ్యర్థుల కోసం బీజేపీ హైకమాండ్ ఫోకస్ చేసే అవకాశం ఉంది. ఇదే సమయంలో వచ్చే ఏడాది పాటు ఎలాంటి కార్యక్రమాలు చేయాలి... టార్గెట్ చేస్తున్న 90 స్థానాల్లో గెలుపు కోసం ఎలా ముందుకెళ్లాలనే దానిపై కసరత్తు ప్రారంభించినట్లు స్పష్టమవుతోంది. ఇందులో పార్టీ బలహీనంగా ఉన్న స్థానాల్లో చేపట్టాల్సిన చర్యలపై కూడా లోతుగానే చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ సీట్లలో బలమైన అభ్యర్థులను తెరపైకి తీసుకురావటంతో పాటు పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యాచరణపై కూడా బీజేపీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదే అంశంపై హైదరాబాద్ వేదికగా శామీర్ పేట్ లోని ఓ రిస్టార్ లో ఆ పార్టీ విస్తారక్, పాలక్, ప్రభారీల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ నేత బీఎల్ సంతోష్ కూడా హాజరయ్యారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా ఎన్నికల ఏడాది రానుండటంతో నేతలంతా ప్రజల్లో ఉండాలని కమలదళం భావిస్తోంది. ఈ మేరకు అజెండాతో పాటు కార్యాచరణను కూడా సిద్ధం చేస్తినట్లు తెలుస్తోంది.

తదుపరి వ్యాసం